Others

మన లోపాలు గుర్తించాలి -- డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- వెంకట్ మంచి
==========
టెన్త్‌లో లక్, ఇంటర్ కిక్, బిటెక్‌లో..? చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు పొందిన దర్శకుడు మంచి వెంకట్. తొలి చిత్రంతోనే తన ప్రతిభతో గుర్తింపు పొందిన వెంకట్‌తో ఈ వారం చిట్‌చాట్..
============
మీ నేపథ్యం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామం నుంచివచ్చా. బిఎస్సీ డిగ్రీ నరసరావుపేటలో పూర్తిచేశా. 2008 నుండి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నా.
దర్శకత్వం వైపునకు?
డైరెక్టర్ ఆలోచన చిన్నప్పటి నుంచీ ఉన్నదే. వంశీ వద్ద గోపీ గోపిక గోదావరి, సరదాగా కాసేపు, అనుమానాస్పదం చిత్రాలకు పనిచేశా. ఆ తరువాతే టెన్త్‌లో లక్, ఇంటర్‌లో కిక్ చిత్రానికి దర్శకత్వం చేశా.
నచ్చిన జోనర్?
బేసికల్‌గా లవ్ ఎంటర్‌టైనర్స్ ఇష్టం. ప్రేమిస్తే, ప్రేమఖైదీలాంటి చిత్రాలు ఇష్టపడతా. సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నా ఇష్టమే.
హారర్ జోనర్‌పై అభిప్రాయం
ఉదాహరణకి ఈవారం సినిమాలు దాదాపు ఎనిమిది వచ్చాయి. అందులో సగం హారర్ జోనర్లే. ఏదోకటి హిట్టయ్యిందంటే అలాంటి చిత్రాలు తీయడానికే అందరూ ఇష్టపడతారు. నాకు మాత్రం అలాంటి చిత్రాలపై ఇంట్రెస్ట్ లేదు.
పరిశ్రమలో ఇబ్బందులు
ఇబ్బందులంటే చాలా ఉన్నాయి. ఇందుకు ఎవర్నీ నిందించలేం. మనలోని లోపాలను కూడా చూసుకోవాలి. ఏ సినిమాకైనా పబ్లిసిటీని ఇన్‌టైమ్‌లో చేసుకోగలగాలి. సినిమాను కొత్తగా వచ్చినవాళ్లు క్యాష్ చేసుకోలేకపోతున్నారు. విడుదలయ్యాక ఫాలోఅప్ చేయడం లేదు. పెద్ద సినిమాలకు థియేటర్లు ఎక్కువ ఉండటంతో నష్టాల్లేకుండా బయటపడుతున్నారు. చిన్న సినిమాలకు అలా కాదు!
నెక్స్ట్ ప్రాజెక్టులు
హిందీ, తెలుగు బైలింగ్వల్‌గా ఓ చిత్రాన్ని చేయాలని సన్నాహాలు చేస్తున్నా. త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దర్శకుడంటే
నిర్మాతను ఇబ్బంది పెట్టనివాడే నిజమైన దర్శకుడు. షూటింగ్‌కు ముందుఒకలా, తరువాత మరోలా ఉంటున్న వాళ్లను చూస్తున్నాం. నిర్మాతను ఆర్థికంగా నిలబెడితే, అతను మరికొందరికి ఆధారమవుతాడని గుర్తించేవాడు.

-శేఖర్