Others

కథలో దమ్ముంటే.. - డైరెక్టర్స్ చాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

== శ్రీను కోనేటి ==

అబ్బాయి క్లాసు.. అమ్మాయి మాస్ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన కోనేటి శ్రీను, ఏ సినిమాలోనైనా కథలో దమ్ముంటే చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఏ రాజకీయాలు ఆపలేవని చెబుతున్నారు. ఆయనతో
ఈవారం చిట్‌చాట్..

మీ నేపథ్యం?
-మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట వద్ద లింగాల మా ఊరు. డిగ్రీ చదివా. సినిమా రంగంలోకి రావడానికి నాన్న ప్రోత్సాహమే కారణం.

దర్శకుడిగా ఎప్పటినుండి?
-మొదట నేను డాన్స్‌మాస్టర్‌గా అనేక షోలు చేశాను. ఆ టైంలో ఎంతోమంది దర్శకులతో పనిచేసే చాన్స్ వచ్చింది. వారి ఆలోచనలను అర్థం చేసుకుంటూ నాలో దర్శకుడికి సానపెట్టుకున్నా.

నచ్చిన జోనర్స్?
-యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టం. అలాగని వేరే జోనర్స్‌పై వ్యతిరేకత లేదు. కథ బాగుంటే ఏదైనా ఇష్టమే.

లవ్, హారరే నడుస్తున్నాయిగా..?
-ఈ రెండూ ప్రేక్షకులు ఇష్టపడుతున్న మాట నిజమే. అయితే ఒక్క హారర్ సినిమా హిట్టయ్యిందంటే అలాంటివి జిరాక్స్ కాపీలు వచ్చేస్తున్నాయి. ఫెయిలవుతున్నాయి. హారర్‌లో ప్రత్యేకత ఉంటేనే చూస్తారు.

పరిశ్రమలో సమస్యలు?
-చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదన్న వాదన వినిపిస్తోంది. కానీ కథలో దమ్ముంటే థియేటర్లు దొరకకపోవడం అనే సమస్యే లేదు. కథ పర్‌ఫెక్ట్‌గావుంటే అన్ని దారులు తెరుచుకుంటాయి. ఇక థియేటర్ల గుత్త్ధాపత్యం అనే విషయంపై అవగాహన లేదు.

దర్శకుడంటే?
-24 విభాగాలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అందరికీ నచ్చేలా సినిమా తీయగలిగేవాడు.

-‘యు’