Others

కొత్తగా చెప్పగలగాలి (డైరెక్టర్స్ ఛాయిస్..) -జగదీష్ తలశిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు జగదీష్ తలశిల. ప్రతి చిత్రంలో
ప్రేక్షకుడికి ఏదైనా కొత్త విషయం
చెప్పే ప్రయత్నం చేయాలని ఉందంటున్నాడు. భిన్నమైన కథతోనే మొదటి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈవారం ఆయనతో చిట్‌చాట్!

మీ నేపథ్యం?
విజయవాడ దగ్గర గన్నవరం మాది. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేసా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ సినిమాపై ఫ్యాషన్‌తో వచ్చా...
దర్శకుడవ్వాలన్న నిర్ణయం?
చిన్నప్పటి నుంచీ వారంలో ఏడెనిమిది సినిమాలు చూసేవాణ్ణి. చదువు పూర్తయ్యాక దర్శకుడిగా ప్రయత్నించాలని కోరికుండేది. అలా హైదరాబాద్ వచ్చాక ఏలేటి చంద్రశేఖర్, గుణ్ణం గంగరాజు, రాజవౌళిల వద్ద పనిచేసా.
ఇష్టమైన జోనర్స్?
థ్రిల్లింగ్ జోనర్స్ అంటే ఇష్టం. కానె్సప్ట్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటే ఇంకా ఇష్టం. పరిశోధన, థ్రిల్లర్స్‌గా ప్రేక్షకులకు కొత్త విషయాలు చెప్పాలంటే మరీ ఇష్టం.
హారర్, లవ్ జోనర్స్?
ఏ జోనర్ అయినా ఎమోషన్ పండితేనే ప్రేక్షకుడికి నచ్చుతాయి. అతనికి థ్రిల్లింగ్ ఉండాలి. హారర్ ఇప్పుడు కామెడీలా మారింది. ఏదైనా సక్సెస్‌ఫుల్ జోనర్సే అవి!
తొలి అవకాశం?
కీరవాణి కుటుంబీకులంతా నా వెల్‌విషర్లే! ఈగ ప్రాజెక్టులో పని చేస్తున్నపుడు వారే ప్రోత్సహించేవారు, దర్శకత్వం చేయమని. అలా నా స్నేహితుడు సాయిప్రసాద్ కోరిక మేరకు, నా తపన చూసి ఇచ్చిన అవకాశమే లచ్చిందేవి!!
దర్శకుడంటే?
థియేటర్‌లో కూర్చుని సినిమా చూసే వెయ్యమందిని ఒకేసారి ట్రాన్స్‌లోకి తీసుకెళ్లేవాడు. పనితనానికి ప్రేక్షకుడి చేత మార్కులేయంచుకుని పాసయ్యేవాడు.

-శ్రీ