ఆంధ్రప్రదేశ్‌

దిశ చట్టాన్ని అమలుచేస్తాం:వాసిరెడ్డి పద్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అత్యాచారయత్నానికి గురై.. గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ బాలికను ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అత్యాచారయత్న ఘటన బాధ కలిగిస్తుందన్నారు. చిన్న పిల్లలు, మహిళలపై అరాచకాలకు పాల్పడితే దిశ చట్టం, మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు. దిశ చట్టంపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని, దిశ చట్టాన్ని మహిళా కమిషన్ ప్రజలలోకి తీసుకెళ్తుందన్నారు. ఇప్పటికే బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటామిని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు.