రాష్ట్రీయం

వ్యాధుల సోకకుండా జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారులకు మంత్రి కామినేని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 21: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు గురైన జిల్లాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలకు గురైన నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైద్య, ఆరోగ్య అధికారులతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు.
వరదలు తగ్గిపోయినప్పటికీ, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందువల్ల సంబంధిత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులకు ప్రభుత్వ పరంగా అనేక సూచనలు చేశారు. రక్షిత మంచినీటిని మాత్రమే ప్రజలు ఉపయోగించేలా చూడాలని మంత్రి సూచించారు. ఆసుపత్రుల్లో బ్లీచింగ్‌పౌడర్, క్లోరిన్ ట్యాబ్లెట్స్, ఓఆర్ ప్యాకెట్స్, ఐవి ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డయేరియా, విషజ్వరాలపై ఎప్పటికప్పుడు సమీక్షస్తుండాలన్నారు. విద్యార్థులకు ఐరట్ ట్యాబ్లెట్స్ ప్రతి గురువారం మధ్యాహ్నా భోజనం అనంతరం ఇస్తున్నామని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేలా చూడాలని మంత్రి కోరారు. విద్యార్థులకు డి వార్మింగ్ మందు రెండు సార్లు ఇవ్వాల్సి ఉందని, ఈ కార్యక్రమం కూడా సక్రమంగా కొనసాగేలా చూడాలన్నారు.
గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉందని కామినేని సూచించారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సి ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోప్రసవమైన తల్లీబిడ్డతో పాటు వారి వెంట ఉండే కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఖర్చుతో వారి ఇళ్లకు చేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమానికి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ అని పేరుపెట్టామన్నారు. సురక్షిత మాతృత్వం-నవజాత శిశు సంరక్షణ పేరుతో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎన్‌టిఆర్ వైద్యసేవ కింద గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన ఎనిమిది నెలల్లో 100 ఓపెన్ హార్ట్ సర్జరీలు పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. పిపిపి విధానంలో త్వరలో కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ తరహా వైద్య చికిత్సలు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాలైన అరకు, పాడేరులలో రెండు ఆసుపత్రులను త్వరలో నిర్మిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎపి వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.