సంజీవని

మోనాజైటిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాధులు - లక్షణాలు
===============
మోనాజైటిస్
బ్యాక్టీరియా లేక వైరల్ ఇన్‌ఫెక్షన్ మెదడుకి వస్తే మెనింజైటిస్ అంటారు. మెదడు, వెన్నుపూసని మూడు పొరలు కప్పి వుంచుతాయి. శరీరంలో ఏ భాగంలోనైనా ముఖ్యంగా తలలో వుండే అవయవాలనుంచి రక్తంద్వారా క్రిములు మెదడుకి చేరడంతో ఈ పొరలు ఇన్‌ఫెక్ట్ అవుతాయి. పుర్రెకి గట్టి దెబ్బ తగలడంవల్లా రావచ్చు. దీనిని త్వరగా గుర్తించి తీవ్ర పరిణామాలు రాకుండా కాపాడుకోవాలి. దీంట్లో ఇన్‌ఫెక్షన్ వచ్చేటపుడు వచ్చే జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు లాంటి లక్షణాలే కాకుండా మెదడు బిగుసుకుపోవడం, ఎక్కువ వెలుతురుని చూడలేకపోవడం లాంటి లక్షణాలూ కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. బ్యాక్టీరియావల్ల మెదడు వాపు వ్యాధి వస్తే వ్యాధి తీవ్రమవుతుంది. సరైన సమయంలో గుర్తిస్తే తగ్గించవచ్చు.

నరాలమీద పొర దెబ్బతింటే
నరాలమీద ఒక పొర కప్పి వుంటుంది. అది ఏ ప్రాంతంలో దెబ్బతిన్నదీ, ఏ స్థాయిలో దెబ్బతిన్నదన్న దాన్నిబట్టి లక్షణాలుంటాయి. అవి రెండు రకాలుగా వుంటాయి. అలికేసినట్లు కనిపించడం, తాత్కాలికంగా కనిపించకపోవడం, రంగులు తెలియకపోవడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. శరీరంలో ఓ భాగం మొద్దుబారిపోవచ్చు. చేయి లేక పాదాల కదలికలో కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. ముద్దమాట అవుతుంది. కొన్ని కండరాలలో మార్పు వచ్చి బిగుసుకుపోవడం లాంటివి జరగవచ్చు. ఈ లక్షణాలన్నీ కనిపించాలనేమీ లేదు. కొన్ని కలయికలు కనిపించవచ్చు, తగ్గిపోవచ్చు. ఆ ఇబ్బంది అలాగే వుండిపోవచ్చు. ఈ మల్టిపుల్ స్ల్కిరోసిస్ మనిషిని ఎలా దెబ్బతీస్తుందో చెప్పడం కష్టం.

రేయేస్ సిండ్రోమ్
ఇవి పిల్లల్లో వస్తుంటుంది. మెదడు కణాలు, లివర్ కణాలు కూడా ఇన్‌ఫ్లేమ్ అవ్వడంవల్ల వస్తుంది. ఈ వ్యాధి రావడానికి సరైన కారణం తెలియకపోయినా ఫ్లూలాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌వల్ల వస్తుందని భావిస్తున్నారు. దీంట్లో తలనొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు, ఫిట్స్‌లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరల్ డిసీజ్ క్రమంగా రేయేస్ సిండ్రోమ్‌లోకి దించుతుంది. దీనివల్ల మెదడుకి తీవ్రమైన ఎటాక్ వస్తుంది. రేయేస్ సిండ్రోమ్ వచ్చినవాళ్ళల్లో పదిశాతం మంది మరణిస్తున్నారు. లక్షణాలు తక్కువగా వున్నా మెదడు, లివర్ కణాలు దెబ్బతినవచ్చు. మెదడు బాగా దెబ్బతిని వాయడం జరిగితే స్టెరాయిడ్స్ ఇస్తారు. ఈ హార్మోన్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. కొన్ని రకాల మందులు వాడడంవల్ల ముఖ్యంగా యాస్ప్రిన్ వాడటంవల్ల చాలా తక్కువ శాతం పిల్లల్లో ఈ జబ్బు వస్తోంది.