రాష్ట్రీయం

ఉద్యాన వర్శిటీ ఉద్యోగుల విభజన పిటిషన్‌పై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ డిసెంబర్ 17: ఆంధ్ర, తెంలగాణలోని ఉద్యానవన విశ్వవిద్యాలయాల మధ్య సిబ్బంది విభజనకు మార్గదర్శకాల రూపకల్పనకు ఎంతమేర సమయం కావాలో వచ్చే సోమవారం 21వ తేదీన హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా ఏపి ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం 33 మంది ఉద్యోగులను ఏపిలోని వైఎస్‌ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉద్యోగుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని హైకోర్టు పేర్కొంది. రెండు రాష్ట్రప్రభుత్వాలు ఇటువంటి సమస్యలపై సమావేశమై ఏకాభిప్రాయానికి ఎందుకు రాలేకపోతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ఏపి విభజన చట్టాన్ని ఉల్లంఘించి 33 మంది ఉద్యోగులను ఏపికి కేటాయించారని ఏపి అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ ఏజి కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం అటానమస్ సంస్ధన్నారు. ఏపి వర్శిటీ అధికారులు సమావేశానికి రావాలని ఆహ్వానిస్తే రాలేదన్నారు. అనంతరం ఈ కేసు విచారణను 21వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు.