శ్రీకాకుళం

వైద్యుని సలహా మేరకే మందులు వాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 22: వైద్యుని సలహా లేకుండా మందులు వాడటం నేరమని జిల్లా ఔషధ నియంత్రణాధికారి ఏ.కృష్ణ అన్నారు. మంగళవారం వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా జిల్లా కెమిస్ట్ భవనంలో మంగళవారం ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ మందులు కొనుగోలు చేసేటపుడు అర్హులైన వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకే మందులు వాడాలన్నారు. కొనుగోలు చేసిన మందులకు విధిగా బిల్లు పొందాలని సూచించారు. మందులను పిల్లలకు దూరంగా ఉంచాలని, అంతే కాకుండా మందుల కాలపరిమితి, బ్యాచ్ నెంబరు పరిశీలించాలని తెలిపారు. ఔషధ నియంత్రణపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ కార్యాలయానికి తెలియజేయాలని అన్నారు. వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామ్మోహనరావు మాట్లాడుతూ వినియోగదారులు అన్ని విషయాలపై అవగాహన పెంపొందిచుకోవాలన్నారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కె.కల్యాణి, డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కరుణ కుమార్ గుప్తా, విద్యార్థులు, హోల్‌సేల్ మందుల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.