బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై దోహా బ్యాంక్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మరిన్ని నూతన శాఖల ఏర్పాటు * బ్యాంక్ సిఇఒ ఆర్ సీతారామన్
హైదరాబాద్, నవంబర్ 21: ఖతార్‌కు చెందిన దోహా బ్యాంక్.. భారత్‌లో మరిన్ని నూతన శాఖలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. అలాగే రాబోయే మూడేళ్లలో బ్యాంక్ వ్యాపారం ప్రస్తుతం ఉన్న 2.3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు కృషి చేస్తోంది. శనివారం ఇక్కడ దోహా బ్యాంక్ సిఇఒ ఆర్ సీతారామన్ విలేఖరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంక్ సేవలను విస్తరించాలనుకుంటున్నామని, తమిళనాడు, గుజరాత్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విస్తరణపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ‘్భరత్, ఖతార్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) మధ్య వాణిజ్య అవకాశాలు’పై ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి దోహా బ్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా, జిసిసి-్భరత్ ద్వైపాక్షిక వాణిజ్యం 130 బిలియన్ డాలర్లకుపైగా ఉంటే, ఖతార్-్భరత్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది దోహా బ్యాంక్‌కు భారత్‌లో బ్యాంకింగ్ సేవల ఏర్పాటుకుగాను లైసెన్సు రాగా, ముంబయిలో తొలి శాఖను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ ఒమన్‌కు చెందిన రెండు శాఖలను ముంబయి, కొచ్చిలలో సొంతం చేసుకుంది.