అంతర్జాతీయం

డొనాల్డ్ ట్రంప్‌కు పెరిగిన ప్రజాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ఉన్న వివాదాస్పద నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనకు ప్రజాదరణ పెరగడం విశేషం. అమెరికాలోకి ముస్లింలను ప్రవేశించనీయొద్దన్న ఆయన వ్యాఖ్యలకు ప్రపంచ వ్యాప్తంగా గట్టి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వంకోసం పోటీలో మాత్రం ఆయనకు రిపబ్లికన్ శ్రేణుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఫాక్స్ న్యూస్ బుధవారం విడుదల చేసిన ఎన్నికల ఫలితాలలో రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో 35 శాతం మంది ఓట్లను పొందడం ద్వారా ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి బెన్ కార్సన్ 20 శాతం ఓట్లతో రెండో స్థానంలో వెనుకబడి ఉన్నారు. టెడ్ క్రుజ్, మార్కో రుబియోలు 14 శాతం చొప్పున ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.