ఐడియా

ఆహ్వానం పలికే అందాల డోర్ మ్యాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాదరక్షలు గుమ్మం బయటే వదిలేసే సంప్రదాయం మనది. దీనితోనె ఎక్కడెక్కడో తిరిగొచ్చిన పాదరక్షలతో దరిచేరే రోగకారకాలకు కొంతైనా దూరంగా వుండగలం. మన కాళ్లకు వేసుకున్న చెప్పులు, బూట్లతోనే ఎక్కువగా ఇల్లు మురికి కూపం అవుతుంది. అందుకే షూస్టాండ్స్‌తోపాటు డోర్ మ్యాట్ ఇంటిముందు అత్యవసర వస్తువు అని చెప్పక తప్పదు. వీటిలో ఎన్నో రకాలు, ఎనె్నన్నో డిజైన్లు, సైజులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. సరైన డోర్ మ్యాట్‌తోనే ఇంటి పరిశుభ్రత సాధ్యమవుతుంది. అలాగే ఇంట్లోకి దారితీసే అన్ని గుమ్మాల దగ్గర డోర్‌మ్యాట్‌లను ఉపయోగించుకోవాలి. ఇంటి అలంకరంలో భాగంగా ప్రతి గదిలోను అవసరానికి స్నానాల గదులు, దివాను, మంచాల దగ్గర వాడుకోవచ్చు. వంటింట్లో ఎక్కువ సమయం పొయ్యి దగ్గర వుండాల్సి రావడంతో అక్కడ డోర్ మ్యాట్స్ వాడుకుంటే ఎంతో సౌకర్యవంతంగాను వుంటుంది. డోర్‌మ్యాట్లు కాళ్లకు ఆక్చుపంక్చర్‌లోని హాయిని కలిగిస్తాయి. చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా బాత్రూముల దగ్గర తడి కాళ్లతో వచ్చి పడే ప్రమాదాలు నివారించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. బయట గుమ్మాల దగ్గర సరిపోయేంత సైజులో కాస్త పెద్దవి, రబ్బరుతో తయారైన డోర్‌మ్యాట్లను ఉపయోగించడం ఉత్తమం. కొబ్బరి పీచుతో తయారైనవి కూడా వాడుకోవచ్చు. అవి దాటి నేరుగా లోపలికి వచ్చే అవకాశం లేక ఇసుక, మట్టి అక్కడే పడిపోతాయి. అవే గుమ్మాల లోపల గుడ్డ డోర్ మ్యాట్లను వుంచితే తడికాళ్లను తుడుచుకునే వీలు చిక్కుతుంది. చక్కని ఇంగ్లీషు క్యాప్షన్లతో రకరకాల ఆకారాల్లో తొరికే వీటిని కనీసం వాటిపై నిలబడి కాళ్లు శుభ్రపరుచుకునేంత పరిమాణంలోనైనా ఎన్నుకోవాలి. వాటి మన్నిక దృష్ట్యా ముదురు రంగులను కొనుగోలు చేయడం సహజం. అయితే రంగుల విషయంలో గది పరిసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లేత రంగులైతే వాటి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. మురికిని ఇంటిలోపలికి రానివ్వకుండా కట్టడి చేసే డోర్‌మ్యాట్లను తరుచు శుభ్రం చేయడం మరవద్దు.

-మురళి