క్రీడాభూమి

క్రికెటర్లకు డోప్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లందరికీ టోకుగా డోప్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే, నిషిద్ధ మెల్డోనియం ఔషధాన్ని వినియోగించి డోప్ పరీక్షలో దొరికిపోయానంటూ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా చేసిన సంచలన ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే డోప్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని టోర్నమెంట్ డైరెక్టర్ ఎంవి శ్రీ్ధర్ స్పష్టం చేశాడు. ఐసిసి ఆధ్వర్యంలో జరిగే అన్ని టోర్నీల్లోనూ డోప్ పరీక్షలు జరుగుతాయని తెలిపాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో ముందుగానే తెలియచేయాలన్న కాంట్రాక్టుపై క్రికెటర్లు సంతకం చేయలేదు కాబట్టి వారు ప్రపంచ డోపింగ్ నిరోధిక విభాగం (వాడా) పరిధిలోకి రారని శ్రీ్ధర్ చెప్పాడు. అందుకే ఐసిసి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపాడు. ఈ విభాగం ఆధ్వర్యంలోనే డోపింగ్ పరీక్షలు జరుగుతాయని అన్నాడు. 2011 నుంచి ఐసిసి ప్రతి టోర్నీలోనూ ఈ విధంగా డోప్ పరీక్షలను నిర్వహిస్తున్నదని వివరించాడు. 2011 వరల్డ్ కప్, 2012, 2014 సంవత్సరాల్లో జరిగిన టి-20 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా భారత్‌సహా పోటీలో ఉన్న అన్ని దేశాల క్రికెటర్లు డోప్ పరీక్షకు హాజరయ్యారని శ్రీ్ధర్ పేర్కొన్నాడు.