రాష్ట్రీయం

ఆహా.. ఏమి రుచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొయామా గవర్నర్ మనసు దోచిన ‘ఆంధ్రా దోశ’

విజయవాడ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు నగరానికి వచ్చిన జపాన్ ప్రతినిధుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సోమవారం ఉదయం స్థానిక హోటల్ గేట్‌వేలో అల్పాహార విందిచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అధికారులు, గవర్నర్ తకకాజు ఇషి బృందాన్ని అల్పాహార విందుకు తోడ్కొని వెళ్లారు. సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోశ, గారె, కట్ పొంగలి, ఉప్మాతో పాటు ఇతర వంటకాలను హోటల్ ప్రతినిధులు జపాన్ బృందానికి వడ్డించారు. గవర్నర్ తకకాజు ఇషి ప్రముఖంగా మినప, పెసర దోశలు చాలా రుచిగా వున్నాయని తెలిపారు. వాటిని ఎలా తయారుచేస్తారంటూ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తకకాజు ఇషికి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీ కేశినేని నాని దోశల పిండి తయారీ, దోశలు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపుతూ వివరించారు. విందులో జపాన్ ప్రతినిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పివి రమేష్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, జిల్లా కలెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
** దోశ తయారీ వివరాలు అడిగి తెలుసుకుంటున్న టొయామా గవర్నర్ తకకాజు ఇషి **