కృష్ణ

బ్యాంకులో లావాదేవీలు జరిపితే ఉపాధి కూలి జమవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మే 19: మండలంలో నెలల తరబడి ఉపాధిహామి కూలిడబ్బులు బ్యాంకులో జమకాని వారందరూ వెంటనే ఆయా బ్యాంకుల్లో 10 రూపాయలు జమ చేస్తే మూడు, నాలుగు రోజుల్లో కూలి డబ్బులు బ్యాంకు అకౌంట్‌కి జమవుతాయని ఇన్‌చార్జి ఎంపివో రాజు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ దుర్గ్భావానీతో ఆయన సమావేశమయ్యారు. ఉపాధి పనుల వివరాలు, కూలీలకు డబ్బులు ఎంత వరకు జమయింది తెలుసుకున్నారు. ప్రతిరోజు మండల పరిషత్‌కి 200 మంది కూలీలు తాము చేసిన పనికి కూలి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ వస్తున్నారని సిబ్బంది తెలిపారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడదామని రాజు చెప్పారు. ప్రతినెలా బ్యాంకులో డబ్బులు వేయటం గాని, తీయటం గాని చేయని వారి అకౌంట్ పని చేయటం లేదని అధికారులు తెలిపారన్నారు. మండలంలో 5821 మంది కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. అందుచేత కూలి డబ్బులు జమకాని వారందరు తమ బ్యాంకు ఖాతాలో రూ.10 జమచేయాలని, దాంతో అకౌంట్ రన్నింగ్‌లోకి వచ్చి ఉపాధికూలి డబ్బులు జమవుతాయని వివరించారు. కాగా ఉపాధిహామి పథకంలో పనులు చేసే కూలీలకు మజ్జిగ అందించే బాధ్యతను ఆయా గ్రామాల్లోని మేట్‌లకు అప్పగించామని ఎంపివో రాజు తెలిపారు. మండలంలో ఉపాధి కూలీలకు మజ్జిగ అందించని విషయాన్ని రాజు దృష్టికి తీసుకు వెళ్ళగా ఒక్కో కూలీకి మజ్జిగ అందిస్తే రూ.4 మేట్ ఖాతాలోకి వస్తాయని చెప్పారు. మజ్జిగ అందించకుంటే మేట్‌లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.