హైదరాబాద్

రిజర్వాయర్ శంకుస్థాపనలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 31: ఉప్పల్ వెలుగుట్టపైన రూ.160కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంచినీటి రిజర్వాయర్ శంకుస్థాపన టిఆర్‌ఎస్, టిడిపి నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. గురువారం జల మండలి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, నాయిని నర్సింహారెడ్డి, టి.పద్మారావు, మల్కాజిగిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, జల మండలి అధికారులు పాల్గొన్నారు. తొలుత మంత్రి కెటిఆర్ తన ప్రసంగంలో గత సమైఖ్య పాలనలో హైదరాబాద్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. నిజాం కాలం నాటి జలాశయాలు తప్ప కొత్తగా చెరువుల అభివృద్ధి చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊపర్ షేర్వాణి, అందర్ పరేషానీ అన్న విధంగా హైదరాబాద్ తయారైందని విమర్శలు చేశారు. ఇది జీర్ణించుకోలేని టిడిపి నేతలు బోబ్బల రమణారెడ్డి, కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, జల్లి మోహన్, టి.నర్సింహులు, మాచర్ల ప్రతిభ హేళన చేసేవిధంగా మాట్లాడిన మంత్రి కెటిఆర్ మాటలపై అభ్యంతరం తెలిపారు.
ఇది మాట్లాడే వేదిక కాదని, ఏ ప్రభుత్వాలు ఏమి చేశాయో అభివృద్ధిపై చర్చా వేదిక పెట్టి నిరూపించుకుందామని టిడిపి నేత రమణారెడ్డి ఎదురు సమాధానం ఇచ్చారు. మంత్రి ఆగ్రహంతో నాతో మాట్లాడేందుకు నీ స్థాయికి తగదని మందలించారు. దీంతో మంత్రి కెటిఆర్, రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం టిఆర్‌ఎస్, టిడిపి కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
అంతటితో ఆగకుండా జై తెలుగుదేశం అంటూ టిడిపి, జై తెలంగాణ అంటూ టిఆర్‌ఎస్ నేతల పరస్పర నినాదాలు చేసుకున్నారు. వేదికపైన కూర్చున్న మంత్రి టి.పద్మారావు ఆగ్రహంతో లేచి కందికి వచ్చి ఎందుకు లొల్లి చేస్తున్నావంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న టిఆర్‌ఎస్, టిడిపి నేతలు ఒకరినొకరు తోపులాడుకోవడంతో టిడిపి నేతలు రమణారెడ్డి, ప్రతిభకు తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి టిడిపి నేతలను బయటకు బలవంతంగా పంపించారు.
ఆందోళనకారులను శాంతింప జేయడంలో సఫలీకృతులయ్యారు. తమపై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు చేస్తూ దౌర్జన్యంతో బలవంతంగా పోలీసులచే బయటకు గెంటించడాన్ని నిరసిస్తూ మంత్రుల తీరుపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్ల మందు జరిగిన సంఘటనతో ఎంపి మల్లారెడ్డి.. మంత్రుల విమర్శలపై సమావేశం మధ్యలో నుండి బయటకు వెళ్లిపోయి నిరసన వ్యక్తం చేశారు.
ఘర్షణ సమయంలో టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి నేతలు జెండాలు ఊపుతూ పరస్పర నినాదాలు చేసుకుంటూ పెద్దల ముందు సెభాష్ అనిపించుకోవడం శోచనీయం.
గాయపడిన నేతలకు పరామర్శ
వెలుగుట్టపై గురువారం జరిగిన రిజర్వాయర్ శంకుస్థాపనలో మంత్రి కెటిఆర్ విమర్శలకు అభ్యంతరం తెలిపిన టిడిపి నేతలపై అధికార పార్టీ కార్యకర్తల దౌర్జన్యంపై టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణలో గాయపడిన టిడిపి నేతలు బొబ్బల రమణారెడ్డి, మాచర్ల ప్రతిభలను పరామర్శించారు. విమర్శలకు మాట్లాడేందుకు ఇది వేదిక కాదని అడిగినందుకు హోదాను మరిచిన మంత్రులే స్వయంగా దౌర్జన్యం చేయడం తగదని అన్నారు. ఎవరి హయాంలో వెలుగుట్ట రిజర్వాయర్ ఏర్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని వీరేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ విమర్శలు మాని గత చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చుకోవడం ఎంత వరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన టిడిపి కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు టి.నర్సింహులు, ముత్యాల నర్సింహ, వెంకన్నగౌడ్, కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, జల్లి మోహన్, కోల రవికుమార్‌గౌడ్, పబ్బతి శేఖర్‌రెడ్డి, కొట్టాల బాల్‌రాజ్ పాల్గొన్నారు.

‘అక్షరసేన’ డైరీ ఆవిష్కరణ
కాచిగూడ, డిసెంబర్ 31: సాధన సాహితీ స్రవంతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘అక్షరసేన’ (దైనందిని) డైరీ ఆవిష్కరణ సభ గురువారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణచారి పాల్గొని నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాన్నిమించిన అయుధం లేదని పేర్కొన్నారు. నూతన సవంత్సరం అందరి కుటుంబాల్లో సంతోషం కలుగజేయాలని అకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సవంత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు సిహెచ్.హనుమంతరావు, సుబ్బారావు, సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీ, గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, సుధామ, డా.వెనిగళ్ళ రాంబాబు, డా.లలిత పరమేశ్వరి, సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహాచార్య పాల్గొన్నారు.