రాష్ట్రీయం

ద్రోణాచార్య పేరుతో వ్యక్తిగత నైపుణ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిక్షణకోసం భారీ ప్రణాళిక
విద్యారంగానికి పెద్దపీట
బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత
వేగంగా వెళుతున్న ఎబిసి
హైదరాబాద్, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఉద్దేశించిన పలు పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. బ్రాహ్మణులకు సంబంధించి విద్య, వైద్య అంశాలతో పాటు వ్యక్తిగత నైపుణ్యం పెంపుదల కోసం ఏర్పాటైన ఎపి బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (ఎబిసి) తో పాటు పేద బ్రాహ్మణులు తమ ఉపాధికోసం ఏవైనా పథకాలు చేపడితే ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. వివిధ స్థాయిలలో విద్యార్థులకు వారి చదువును అనుసరించి ఎబిసి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం ఇప్పటికే ప్రారంభమైంది. ఎబిసి సరికొత్తగా ‘ద్రోణాచార్య’ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభించింది. 30 సంవత్సరాలలోపు నిరుద్యోగ యువత కోసం దీన్ని ఉద్దేశించారు. ఆరు అంశాలలో నైపుణ్యం కోసం ఈ పథకం కింద ఒక బృహత్ ప్రణాళికను రూపొందించారు. 2015 డిసెంబర్‌లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. సోలార్ ప్యానల్ అమర్చడంపై 25 రోజుల పాటు సాంకేతిక శిక్షణను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇంటర్ (సైన్స్), ఐటిఐ (ఎలక్ట్రికల్/మెకానికల్) అభ్యర్థులకు దీన్ని ఉద్దేశించారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో శిక్షణాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఎబిసి మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ చంగవల్లి, జనరల్ మేనేజర్ భవాని శంకర్ తెలిపారు. గురువారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎబిసి రూపొందించిన కార్యక్రమాలకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయిస్తున్నారని వివరించారు. ఇలా ఉండగా రిటైల్ ఇండస్ట్రీలో 12 రోజుల శిక్షణను విశాఖ, విజయవాడ, తిరుపతిలలో ఇస్తున్నారు. ఇంటర్ చదివిన వారు ఈ శిక్షణకు అర్హులు. గ్రాడ్యుయేట్ల కోసం కమ్యూనికేషన్, అప్టిట్యూడ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం తదితర అంశాలపై 18 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో ఏర్పాటు చేస్తున్నారు. మేనేజింగ్ సెల్ఫ్, మాస్టరింగ్ నాలెడ్జ్‌లలో 15 రోజుల శిక్షణా కార్యక్రమాలను విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకోసం ఈ శిక్షణను ఉద్దేశించారు. ఇంజనీరింగ్ (ఎలక్ట్రిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఐటి/సిఎస్‌ఇ) అభ్యర్థులకు వృత్తినైపుణ్యం పెంపొందించేందుకు 45 రోజుల శిక్షణను ఉద్దేశించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (జావా, డిఓటి, నెట్, టెస్టింగ్) కమ్యూనికేషన్ అండ్ అప్టిట్యూడ్‌లలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 18 రోజుల శిక్షణను నిర్వహించబోతున్నారు. ఈ శిక్షణను విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలలో ఈ శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. 2015 డిసెంబర్ 12 నుండి శిక్షణ ప్రారంభమవుతుందని వారు వివరించారు. ఈ నెల చివరిలోగా ఆన్‌లైన్‌లో (ఆంధ్రాబ్రాహ్మిణ్.ఓఆర్‌జి) దరఖాస్తులు పంపించాల్సి ఉంటుందని వెంకట్ చంగవల్లి తెలిపారు. అదనపు వివరాలు కావలసిన వారు 040-2476 7879 ఫోన్‌లో సంప్రదించవచ్చని వివరించారు.
12 వేల మంది విద్యార్థులకు చేయూత
‘్భరతి’ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 12,445 మంది విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఐదువేల మంది విద్యార్థులకు వారి చదువును అనుసరించి ఆర్థిక చేయూత అందించారు. ఇంటర్ చదువుతున్న వారికి 10 వేల రూపాయలు (ఏటా), గ్రాడ్యుయేట్ చదువుతున్న వారికి 15 వేల రూపాయలు ఇస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులైన చార్టెడ్ అకౌంటెంట్ (సిఎ), బిటెక్, మెడిసిన్‌తో పాటు పిజి విద్యార్థులకు 20 వేల రూపాయలు ఇస్తున్నారు. విదేశాల్లో పిజి స్థాయి చదువునేందుకు వెళ్లేవారికి 1.20 లక్షలు ఇస్తున్నారు. ఇలా ఉండగా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు శిక్షణ, సివిల్స్ శిక్షణ ఇస్తున్నారు.

నాగార్జున వర్సిటీని వదలని ర్యాగింగ్ భూతం
ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్
హైదరాబాద్, నవంబర్ 23: నాగార్జున యూనివర్సిటీని ర్యాగింగ్ భూతం వదలడం లేదు. ఇటీవల బిఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్య తీసుకున్నప్పటికీ అదే కళాశాలలో మరో ఘటన జరగడం కలకలం సృష్టించింది. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదుతో స్పందించిన వర్సిటీ అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న మంత్రి గంటా షాక్‌కు గురయ్యారు. ఘటనపై స్పందించిన మంత్రి గంటా ర్యాగింగ్‌కు పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఫోన్‌లో నాగార్జున వర్సిటీ అధికారులను ఆదేశించారు.

గొలుసు దొంగలపై జరిపిన కాల్పులపై పిటిషన్
దొంగలకు మద్దతా: హై కోర్టు జస్టిస్ దిలీప్ భోస్లే
హైదరాబాద్, నవంబర్ 23: నగర శివారులోని వనస్థలిపురంలో ఇటీవల ఇద్దరు చైన్‌స్నాచర్లపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా సోమవారం సదరు పిటిషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా దొంగలైనంత మాత్రాన కాల్పులు జరపాలా..? ప్రజల భద్రతను పట్టించుకోరా..? అంటూ పిటిషన్ వేసిన న్యాయవాది తన వాదనను తెలిపారు. దాంతో మండిపడిన డివిజన్ బెంచ్ జస్టిస్ దిలీప్ భోస్లే, జస్టిస్ రవికుమార్ ఏం..దొంగలకు మద్దతు పలుకుతున్నారా..? గొలుసు దొంగలపై సానుభూతి తెలపాలా? వెంటనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఆదేశించారు. ఇలాంటి పిటిషన్లు మళ్లీ వేయకూడదని మందలించారు.