రాష్ట్రీయం

ఏపిలో మరో 163 కరవు మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 196 కరవు మండలాలను ప్రకటించింది. అయితే వీటికి అదనంగా 163 మండలాలను కరవు ప్రాంతాలుగా శనివారం నాడు ప్రకటించింది. దీంతో కరవు మండలాల సంఖ్య 359కు పెరిగింది. గతంలో శ్రీకాకుళంలో 10, ప్రకాశంలో 21, నెల్లూరులో 14, చిత్తూరులో 39, కడపలో 33, అనంతపురంలో 39, కర్నూలులో 40 మండలాలను ఇదివరకే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. శనివారం నాడు ప్రకాశం జిల్లాలో 35, గుంటూరులో 26, అనంతపురంలో 24, నెల్లూరులో 19, కడపలో 18, చిత్తూరులో 16, కృష్ణాలో 14, శ్రీకాకుళంలో 8, విజయనగరంలో 3 మండలాలు కలిపి మొత్తం 163 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేరకు విపత్తు యాజమాన్య శాఖ ముఖ్యకార్యదర్శి జె సి శర్మ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు.