రాష్ట్రీయం

తెలంగాణకు వెయ్యి కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

231 మండలాల్లో దుర్భిక్షం
వెంటనే కేంద్ర బృందాన్ని పంపండి
ఆదిలాబాద్, ఖమ్మం మినహా 7 జిల్లాల్లో కరవు
కరవు కోరల్లో పాలమూరు, మెదక్, ఇందూరు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి
కేంద్రానికి జాబితా పంపిన ప్రభుత్వం

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో నెలకొన్న కరవు నివారణకు రూ. 1000 కోట్ల సాయం అందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరవుపరిశీలనకు రాష్ట్రానికి వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 443 మండలాలు ఉండగా, వీటిలో 231 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపించింది. కరవు పరిస్థితులపై జిల్లాల నుంచి కలెక్టర్లు సమర్పించిన నివేదికలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు బాగానే కురవడంతో ఈ రెండు జిల్లాల్లో కరవు లేదని కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ మూడు జిల్లాల్లో మాత్రం పూర్తిగా కరవు పరిస్థితులు నెలకొన్నట్టు పేర్కొంది. కరీంనగర్, నల్లగొండ, వరంగల్ మూడు జిల్లాల్లో పాక్షికంగా కరవు పరిస్థితులు నెలకొన్నట్టు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా తొమ్మిది జిల్లాల్లో ఖమ్మం, ఆదిలాబాద్‌లో కరవు లేదని నివేదికలో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 64 మండలాల్లో, మెదక్ జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో, నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 36 మండలాల్లో కరవు నెలకొన్నట్టు కేంద్రానికి నివేదించింది. వరంగల్ జిల్లాలో 51 మండలాలకుగాను 11 మండలాల్లో, కరీంనగర్ జిల్లాల్లో 57 మండలాలకుగాను 19 మండలాల్లో, రంగారెడ్డి జిల్లాలో 37 మండలాలకుగాను 33 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్టు కేంద్రానికి నివేదించింది.
వరంగల్ జిల్లాలో..
స్టేషన్ ఘనపూర్, ధర్మసాగర్, రఘునాథపల్లి, జఫర్‌గడ్, చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట, జనగామ, లింగాల ఘనపూర్, నర్సింహులపేట
కరీంనగర్ జిల్లాలో..
రామడుగు, గాంధార, తిమ్మాపూర్, ఎల్కకుర్తి, హుస్నాబాద్, చిగురుమామిడి,కోహిడ, సైదాపూర్, బెజ్జంకి, భీమరదేవపల్లి, వేములవాడ, కతలాపూర్, చందుర్తి,సిరిసిల్ల, కోనరావుపేట,ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లంతకుంట
నల్లగొండ జిల్లాలో..
తిప్పర్తి, నక్రేకల్,మునుగోడు, చందూర్, నారాయణపూర్, కంగల్, దేవరకొండ, చందంపేట, గుండ్లపల్లి, చింతపల్లి, మోతె, మేళ్ళచెరువు, మట్టంపల్లి, భువనగిరి, రామారం, పోచంపల్లి, బీబీనగర్, చౌటప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్, తుర్కపల్లి
రంగారెడ్డి జిల్లాలో..
మర్పల్లి, మొమిన్‌పేట, నవాబ్‌పేట, శంకర్‌పల్లి, కుత్భుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, వికరాబాద్, ధరూర్, బంటారం, పెద్దేమూల్, తాండూర్, బషీరాబాద్, యేలాల్, దోమ, గండేడ్, పరిగి, పెద్దూర్, షాబాద్, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, కందుకూర్
క్ర.సం. జిల్లా పేరు మండలాలు కరవు మండలాలు
1).. మహబూబ్‌నగర్ 64 64
2). మెదక్ 46 46
3). నిజామాబాద్ 36 36
4). రంగారెడ్డి 37 33
5). కరీంనగర్ 57 19
6). నల్లగొండ 59 22
7). ఆదిలాబాద్ 52 -0-
8). ఖమ్మం 41 -0-
9). వరంగల్ 51 11
మొత్తం 443 231