భావోద్వేగాల దృశ్యకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శివనాగేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.. ఆయన మాటల్లోనే..
‘సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఇంతకుముందు శ్రీకాంత్ హీరోగా వీడికి దూకుడెక్కువ చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమా తరువాత దర్శకత్వం చేయాలనే కోరిక కలిగింది. దానికోసం సీనియర్ దర్శకుల సినిమాలను పరీక్షించాను. వారెలాంటి సన్నివేశాల్ని ఎలా తీస్తున్నారనే దాన్ని గమనించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇంతవరకు ఎవరి దగ్గరా పనిచేయలేదు. ఇది నా తొలి చిత్రం. కథ ప్రకారం కొత్త నటీనటులైతే బాగుంటుందని కార్తిక్, కశ్మీరా కులకర్ణిలను ఎంపిక చేశాను. హీరోయిన్ అప్పటికే కన్నడంలో రెండు సినిమాలు చేసింది. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే భావోద్వేగాలున్న మంచి ప్రేమకథ. దాంతోపాటు హర్రర్ కూడా వుంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హర్రర్ చిత్రాలకు భిన్నంగా వుండే చిత్రమిది. వరంగల్, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. కరుణాకరన్ మంచి పాటలతోపాటు నేపథ్య సంగీతాన్ని అందించాడు. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమిది అన్నారు.’