జాతీయ వార్తలు

డీఎస్పీ దవీందర్ సింగ్ కేసు ఎన్‌ఐఏ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారించనున్నది. కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో దవీందర్ సింగ్‌పై దర్యాప్తునకు ఎన్‌ఐఏ సిద్ధమైంది. తన ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి వారితో కలిసి పోలీసు వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా ఉగ్రవాదులతో కలిసిపోయినట్లుగా వారిని నమ్మించేందుకు అలా చేసినట్లు దవీందర్ సింగ్ వివరణ ఇచ్చినప్పటికీ పోలీసు కస్టడీలో ఉన్న ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయటం జరిగింది. రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ పొందిన దవీందర్‌ సింగ్‌కు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై పోలీసులు, నిఘా అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ జిల్లా కమాండర్‌ నవీద్‌ బాబా, మరో ఉగ్రవాది అల్తాఫ్‌ను, ఉగ్రవాదులకు సహకరించే న్యాయవాది ఇర్ఫాన్ గ‌త శుక్రవారం దవీందర్‌ నివాసానికి తీసుకెళ్లాడు. ఆర్మీ 15 కార్ప్స్‌ ప్రధాన కార్యాలయానికి పక్కన ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్‌, ఒక ఏకే రైఫిల్‌తోపాటు భారీగా మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.