ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి అర్చకుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవో సస్పెన్షన్ కోరుతూ విధులకు గైర్హాజర్
విజయవాడ (ఇంద్రకీలాద్రి), మార్చి 10: అర్చకులను వేధిస్తున్న దుర్గగుడి ఇవో నరసింగరావును తక్షణమే సస్పెండ్ చేసి తరువాత విచారణ చేయాలని అర్చకులు, సిబ్బంది డిమాండ్ చేశారు. నాలుగురోజుల కిందట దుర్గగుడి ఇవో అకారణంగా సుబ్బారావును వేధింపులకు గురిచేయడంతో తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రస్తుతం కోమాలోకి వెళ్లాడని అర్చకులు, సిబ్బంది ఆరోపిస్తూ అమ్మవారి సన్నిధిలో గురువారం ఉదయం ఆందోళన చేపట్టారు. విచారణాధికారిగా వచ్చిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ తెనాలి చంద్రకుమార్ మాట్లాడుతూ అర్చకులు, సిబ్బందికి న్యాయం జరుగుతుందని, వెంటనే విధులకు హాజరుకావల్సిందిగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఉద్యోగులు, అర్చకులు అంగీకరించలేదు. ఇవోను సస్పెండ్ చేసిన తర్వాతనే విచారణకు తాము హాజరవుతామని స్పష్టం చేశారు.తక్షణమే దుర్గగుడి ఇవోను సస్పెండ్ చేస్తూ ప్రకటన చేసే వరకు ఈ నిరసన కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనను ఉద్ధృతం చేయనున్నట్లు వారు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆలయ తలుపులు తీసిన అర్చక స్వాములు కేవలం అమ్మవారి నివేదన కోసం ఒక అర్చక స్వామి మాత్రమే ఆలయంలో ఉండి మిగిలిన అర్చకులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, బిజెపి నాయకుడు పట్నాయక్, లక్ష్మీపతిరాజు తదితరులు, తెనాలి చంద్రకుమార్, రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్, ఎసి దుర్గాప్రసాద్ తదితరులతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. చంద్రకుమార్ విలేఖర్లతో మాట్లాడుతూ సుబ్బారావుకు అయ్యే వైద్య ఖర్చులు మొత్తం దేవస్థానమే భరిస్తుందని, కమిషనర్ వైవి అనూరాధ తనను పంపినట్లు తెలిపారు.

అర్చకులు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టం
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
సింహాచలం, మార్చి 10: ‘అర్చకస్య హరి సాక్షాత్’ అర్చకుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో పోలుస్తారని, అటువంటి అర్చకుడు కన్నీరు పెడితే రాష్ట్రానికి, దేవాదాయశాఖకు అరిష్టమని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ అన్నారు. నిత్యం భగవంతుడి సేవలో ఉండే అర్చకులను ఇఓలు వేధించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దేవస్థానాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రధానంగా అర్చకులను వేధిస్తున్న ఇఓల తీరు మారాలని అన్నారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో అర్చకుడిపై ఇవో వేధింపుల నేపధ్యంలో రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు డివిఎస్ రామరాజు నేతృత్వంలో సింహాచలం దేవస్థానం ఉద్యోగులు, వైదిక సిబ్బంది గురువారం స్వామిజీని కలసి తమ ఆవేదనను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అర్చకుడిని ఇఓ వేధించి ఆసుపత్రి పాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. అర్చకులు పొరపాటు చేసి ఉంటే దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు ఫిర్యాదు చేయాలని, లేదంటే పీఠాధిపతులతో చెప్పాలన్నారు. అంతేగానీ ఏకపక్షంగా అర్చకుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని అన్నారు. కనకదుర్గ దేవాలయం అర్చకుడిపై జరిగిన వేధింపులపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అర్చకులు నిరాహార దీక్షలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయ ఉద్యోగుల సమాఖ్య పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.