బిజినెస్

అడుగడుగునా ఒత్తిడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఎంతో శ్రమించా * ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 3: భారత రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా తన ఐదేళ్ల పదవీ ప్రస్థానం తీవ్ర ఒత్తిళ్లు, సంక్షోభాల మధ్యే ముగిసిందని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు తన మనోగతాన్ని వెల్లడించారు. 2008లోరిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2013 వరకు ఏదో ఒక ఒడిదుడుకుతోనే పని చేయాల్సి వచ్చిందని అన్నారు. గురువారం నాడిక్కడ ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం (సిఇఎస్‌ఎస్)లో ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు స్వర్గీయ డాక్టర్ వాహీదుద్దీన్ ఖాన్ స్మారకోపన్యాసం సందర్భంగా ‘రిజర్వు బ్యాంక్ నిర్వహణలో ఎదురైన సవాళ్లు-సందేహాలు’ అనే అంశంపై ప్రసంగించారు. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ఆ తర్వాత ద్రవ్యోల్భణం, ఆ వెంటనే యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వల్ల భారత ఫైనాన్సియల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించడం, మరికొన్ని నెలలకే రూపాయి మారకం విలువ పతనం కావడం ఇలా వరుస ఒత్తిళ్లు, సంక్షోభాలతో ఐదేళ్లపాటు పని చేయాల్సి వచ్చిందని తన మనోగతాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఆ సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనేందుకు అనువుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదని వివరించారు. సంక్షోభ నివారణ చర్యలు, ఆర్థిక వ్యవస్థ నియంత్రణకు ప్రణాళిక, రూపాయి మారకం విలువను కాపాడ్డం, సమాచార నిర్వహణ వంటి అంశాలను ఎదుర్కొంటూ పరిస్థితులను చక్కదిద్దుకోవాల్సి వచ్చిందని వివరించారు. తన హయాంలో తలెత్తిన సంక్షోభాలు అంతకు ముందు తలెత్తిన వాటికి పూర్త్భిన్నమైనవని గుర్తు చేశారు. గతంలో తాత్కాలికంగా సంక్షోభం తలెత్తినా దాని ప్రభావం అంతం మాత్రంగానే ఉండేది, కానీ 2008 నుంచి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లకు లోనై కోలుకోలేని విధంగా దెబ్బతిందని గుర్తు చేశారు. అలాంటి ప్రతికూల వాతావరణంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా సమర్థతను చాటుకునేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అన్నారు.
కేంద్ర బ్యాంకుగా రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవని చెప్పారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఎంతో ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వడ్డీరేట్ల తగ్గింపు, పెంపుదల వంటివి అన్ని వర్గాలను ఆశ, నిరాశల్లోకి నెడతాయని అన్నారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతారుల సంఘం రాజమండ్రిలో ఒకసారి సమావేశం నిర్వహిస్తే హాజరయ్యానని, అక్కడ వారు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాలని కోరితే, మరోచోట పెన్షనర్లు తమ ఎస్‌బి నిల్వలపై వడ్డీ రేట్లు పెంచాలని కోరారని గుర్తు చేశారు. ఇక వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని మరో వైపు కోరితే తానేమి చేయాలని ప్రశ్నించారు. ద్రవ్యోద్భలణాన్ని నియంత్రించుకుంటూ, ఆర్థిక వృద్ధి రేటు పెంచుకునేందుకు చాలా ప్రయాస పడాల్సి వచ్చిందని అన్నారు. ఆర్‌బిఐ ప్రతి త్రైమాసికంలో ప్రకటించే వడ్డీరేట్లు గురించి, తీసుకోబోయే నిర్ణయాల గురించి ముందుగానే ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు తమ వద్దకు వచ్చి కొన్ని వినతలు ఇస్తుంటాయని వాటి ఆధారంగా అందరినీ కలుపుకుపోయే రీతిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండేదని వివరించారు. ఈ కార్యక్రమానికి సిఇఎస్‌ఎస్ చైర్మన్ ప్రొ.ఆర్.రాధాకృష్ణ అధ్యక్షత వహించగా డైరక్టర్ ప్రొ.ఎస్.గాలబ్ స్వాగతోపన్యాసం చేశారు.