Others

ఇద్దరూ ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో అగ్రనటులు నటించిన కొన్ని భారీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను నిరాశపర్చాయి. ఈ వాతావరణం తమిళ చిత్ర రంగానికీ వ్యాపించినట్టుంది. అందుకే -కమల్‌హసన్‌ను హీరోగా మాత్రమే చూడగలం కాని ఉత్తమ విలన్‌గా కాదని ఆ సినిమాను తిప్పికొట్టిరు ప్రేక్షకులు. చీకటిరాజ్యం కూడా వెలుగు చూపించలేకపోయింది. అలాగే రజనీకాంత్ కొచ్చాడియన్ ‘లింగ’ చిత్రం కూడా నిరుత్సాహపర్చింది. తెలుగులో పలు సూపర్‌డూపర్ హిట్స్ అందించిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక చిత్రం చేయనున్నాడనే వార్త అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడి సంచలనం సృష్టించింది. ఇది కేవలం తమిళ పత్రికల సృష్టి. దానికి కారణం పైన మీరు చూస్తున్న చిత్రమే. ఇది కేవలం తమిళ పత్రికల సృష్టి మాత్రమేనని తెలుగు సినిమా సర్కిల్స్ వివరించాయి. మరి ఫొటో మాటేంటి అంటారా? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కలుసుకున్న రాఘవేంద్రరావు, రజనీకాంత్‌లు కలిసివున్న పైఫొటోకు అలాంటి గాలి వార్తలు పుట్టుకొచ్చాయని పరిశ్రమవర్గాలు చెప్పాయి. ఆదరణ పొందిన కొన్ని గాసిప్స్ అప్పుడప్పుడూ నిజమైపోవడం సినీ పరిశ్రమలో మామూలే. అలాగే, అప్పుడెప్పుడో చక్కర్లు కొట్టిన ఆ గాసిప్ నిజమైపోతే అంతకుమించి అభిమానులు కోరుకునేది ఏముంటుంది? నిజమవుతుందేమో వేచిచూద్దాం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717