జాతీయ వార్తలు

ఈశాన్యానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెపెట్‌కాటా(అసోం), ఫిబ్రవరి 5: కేంద్ర ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా పొరుగుదేశాలతో పాటుగా ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల శక్తిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి ఈశాన్య రాష్ట్రాలకోసం ఓ సరికొత్త అభివృద్ధి మోడల్ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు.
ఈశాన్య, తూర్పు రాష్ట్రాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాధామ్య అంశాల్లో ఒకటని అసోం పర్యటన సందర్భంగాప్రధాని చెప్పారు. పొరుగుదేశాలయిన మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా పాటుగా ఈ ప్రాంతాల్లోని రాష్ట్రాలన్నిటి ఉమ్మడి శక్తిని పూర్తిగా సాధించగలగాలంటే ఈశా న్య రాష్ట్రాలకోసం ఓ సరికొత్త అభివృద్ధి మోడల్ అసరమని శుక్రవారం ఇక్కడ బ్రహ్మపుత్ర క్రాకర్ పాలిమర్ లిమిటెడ్ (బిపిసిఎల్)కు చెందిన పెట్రోకెమికల్ ప్రాజెక్టును, నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన వాక్స్( మైనం) ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన అనంతరం మాట్లాడుతూ అన్నారు. ‘దేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా సర్వతోముఖాభివృద్ధి చెందాలి. పశ్చి భారతం మాత్రం అభివృద్ధి చెంది, తూర్పు, ఈశాన్య ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడరాదు. అలా ఉంటే దేశ అభివృద్ది అసంపూర్తిగా మిగిలిపోతుంది’ అని ఆయన అన్నారు.