జాతీయ వార్తలు

ఇక పూర్తిస్థాయిలో ‘తేజాస్’ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఉత్పత్తి వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మొదలవుతుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.
గురువారం ఇక్కడి ఎన్‌సిసి రిపబ్లిక్ డే క్యాంపులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ తేలికపాటి యుద్ధ విమానాల పట్ల ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. బహ్రెయిన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో ఈ తేజాస్ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఈ యుద్ధ విమానాల ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని భారత్ విశ్వసిస్తోంది. ఈ యుద్ధ విమానానికి ఒకే ఇంజిన్ ఉంటుంది. తేలికపాటి బరువు గల ఈ విమానం వేగంగా కదులుతుంది. 4.5 జనరేషన్‌కు చెందిన ఈ యుద్ధ విమానం ఎంత ఎత్తులోనయినా సూపర్‌సోనిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత వాయుసేన 120 తేజాస్ యుద్ధ విమానాలను సేకరించాలని ప్రణాళిక రూపొందించింది. వీటిలో వంద విమానాలకు భారీ మార్పులు చేయాలని తలపెట్టింది. మెరుగైన రాడార్, కొత్త ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, గగనతలంలోనే తిరిగి ఇంధనాన్ని నింపే సౌలభ్యం, మెరుగయిన క్షిపణులు వంటి మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ తేలికపాటి యుద్ధ విమానాలను నడపడానికి భారత వైమానిక దళానికి చెందిన పైలట్లకు ఇదివరకే శిక్షణ మొదలయింది. డిఆర్‌డిఒ ఇదివరకే తేజాస్ నావల్ వెర్షన్‌ను అభివృద్ధి చేసినప్పటికీ, మరింత శక్తిమంతమైన ఇంజిన్‌ను సమకూర్చడంతో పాటు ఇతర మార్పులు చేయాలని భారత నావికాదళం కోరింది.
ఉత్పత్తి ప్రణాళిక ప్రకారం ఈ సంవత్సరం (2015-16)లో ఆరు విమానాలను తయారు చేస్తారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) వచ్చే సంవత్సరం ఎనిమిది విమానాలను, ఆ తరువాత సంవత్సరం 16 విమానాలను తయారు చేస్తుంది. ఇలా ప్రతి ఏటా తయారు చేసే విమానాల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.ఐఎఎఫ్ ఆయుధ పొదిలో కాలం చెల్లిన మిగ్-21 విమానాల స్థానంలో ప్రవేశపెట్టడానికి ఈ ఎల్‌సిఎ (తేలికపాటి యుద్ధ విమానాలు) తయారీ కార్యక్రమం 1983లో మొదలయింది. అయితే వివిధ కారణాల రీత్యా వీటి తయారీకి విధించుకున్న గడువులు దాటిపోయాయి. తేజాస్ యుద్ధ విమానాలను భారత్ బహిరంగ మార్కెట్‌లో అమ్మడానికి పూనుకుంది. అయితే పాకిస్తాన్ చైనా సహకారంతో తయారు చేసిన జెఎఫ్17 యుద్ధ విమానాల నుంచి వీటికి పోటీ ఎదురుకానుంది.