ఆంధ్రప్రదేశ్‌

ఇసుక విధానంలో మార్పులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19: రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక విధానాన్ని పునఃసమీక్షించి ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే ఇసుక విధానాన్ని రూపొందించాలని రాజమహేంద్రవరం సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ బహిరంగ లేఖ రాశారు. లేఖ కాపీలను శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విడుదలచేశారు. ప్రజలకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించాలన్న రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యం, ప్రస్తుత ఇసుక విధానం వల్ల నెరవేరదని లేఖలో పేర్కొన్నారు. క్యూబిక్ మీటరుకు రూ.500 దాటి కోట్ చేసిన టెండర్లను, రూ.150కన్నా తక్కువ కోట్ చేసిన టెండర్లను రద్దుచేయాలన్న నిర్ణయం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, ఇసుక విధానంలోని లోపాలను సరిచేయాలని సూచించారు. ఇసుక విధానం పట్ల అవగాహన లేని అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వేలం ధరపై స్పష్టమైన విధానం లేకపోతే ఇసుక మాఫియా ఇసుక వేలానికి సమస్యలు సృష్టించి, వేలం ప్రక్రియను ముందుకు సాగనీయదన్నారు. రీచ్‌లు తెరచుకోకపోతే రాష్ట్రంలో నిర్మాణం ఘోరంగా దెబ్బతింటుందని, నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు జీవనోపాధిని కోల్పోతారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తంచేశారు. వేలం జరగకుండా ఉండేందుకు ఇసుక మాఫియా రకరకాల కుట్రలు చేస్తోందని, దీనిని అడ్డుకునేలా ఇసుక విధానం ఉండాలన్నారు. ప్రజలకు, నిర్మాణ రంగానికి తక్కువ ధరకు, కొరత లేని విధానాన్నయినా రూపొందించాలి లేదంటే ఉచితంగానైనా ఇసుకను అందించాలని సూచించారు. గతంలో రకరకాల కేసుల్లో స్వాధీనంచేసుకున్న ఇసుకను మళ్లీ అమ్ముకునేందుకు అనుమతినివ్వటం సరికాదని, క్యూబిక్ మీటరు ఇసుక రూ.500 దాటకూడదని నిబంధన విధిస్తూ, మరోపక్క పాత నిల్వల్లోని ఇసుకను అధిక ధరకు అమ్ముకునేందుకు ఎలా అనుమతినిస్తారని ఆకుల ప్రశ్నించారు. పాత నిల్వల్లోని ఇసుకను 5యూనిట్లు రూ.27వేలకు అమ్ముతున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. పండగకు చంద్రన్న కానుక పేరుతో ప్రజలకు ఒక రోజు ప్రయోజనం కలిగిస్తున్న ముఖ్యమంత్రి, ప్రతి రోజు రాష్ట్రంలో నిర్మాణ రంగం, ప్రజలు పండగ చేసుకునేలా ఇసుక విధానాన్ని రూపొందించాలని కోరారు. మిత్రపక్షానికే చెందిన ఎమ్మెల్యే ఇలా ముఖ్యమంత్రి లేఖ రాయటం చర్చనీయాంశమయింది.