జాతీయ వార్తలు

ఇక ఉపాధి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: తెలంగాణలో దాదాపు ఆరు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే పెట్టుబడులు, వస్తుతయారీ జోన్, ఫార్మానిమ్జ్,్ధన్యం ప్రాసెసింగ్ క్లస్టర్‌తో పాటు నాలుగు ఎస్‌ఇజడ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణకు మంచి రోజులు వచ్చాయంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పథకాల మొదటి దశ పనులను 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ వద్ద దాదాపు 17 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే జాతీయ పెట్టుబడులు, వస్తు తయారీ జోన్‌కు తుది అనుమతి లభించిందని తెలిపారు. 17 వేల మూడు వందల కోట్ల పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జోన్‌లో అరవై వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా లక్షా 11 వేలు, పరోక్షంగా లక్షా 50 వేలు మొత్తం రెండు లక్షల అరవై ఒక్క వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. ఈ జోన్ లో ఇంజనీరింగ్, ఆహారం, రక్షణ,ఎయిరో స్పేస్, ఫార్మాసూటికల్స్, టెక్స్‌టైల్స్, బట్టలు, ఎలక్ట్రానిక్, టెలికాం హార్డ్‌వేర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారవుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎయిరో స్పేస్ హబ్ ఏర్పాటు చేస్తామని, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ ఫార్మాకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపామని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు45 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న హైదరాబాద్ ఫార్మా నిమ్జ్‌లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆమె చెప్పారు. మోడిఫైడ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రెడేషన్ స్కీం కింద మెదక్ జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతాన్ని, రంగారెడ్డి జిల్లాలో ధాన్యం ప్రాసెసింగ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. ఈ రెండు పథకాలకు గతంలోనే ఆమోదం తెలిపినా ఇప్పుడు వీటికి తుది ఆమోదం లభించిందని నిర్మలాసీతారామన్ తెలిపారు.
2015-16లో ప్రతిపాదించిన నాలుగు ఎస్‌ఇజడ్‌లు మంత్రి డెవలపర్స్, ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యు లాబ్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పి, గార్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పుడు తుది ఆమోదం లభించిందని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో లక్షలాది మందికి ఉపాధి లభించటంతోపాటు పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరుగుతుందని మంత్రి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకాలకు, ఎస్‌ఇజడ్‌లకు, ఫార్మా రంగానికి ఎయిర్ ,రోడ్, సీ, పోర్ట్ లింకేజీ ఏర్పాటు చేస్తారని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సౌకర్యం లభిస్తుందని ఆమె చెప్పారు. ఈ నాలుగు పథకాల మొదటి దశ 2020 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యురాలు కవిత కోరిన విధంగా తెలంగాణలో స్పైస్ బోర్డు ఏర్పాటు చేయటం సాధ్యం కాదన్న మంత్రి ఈ విషయాన్ని తాను పార్లమెంటులో ఇది వరకే ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తెలంగాణకు విశాఖపట్నం, కృష్ణపట్నం, చెన్నై, ముంబయి సీ పోర్టులతో లింక్ చేస్తామని ఆమె తెలిపారు.