మెయిన్ ఫీచర్

యాజ్ఞసేని - 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్వేదం అభ్యసించిన గొప్ప వీరులైన దుర్యోధన శల్య మొదలైనవారు ఎంత ప్రయత్నించినా ఎక్కుబెట్టలేని ఆ ధనుస్సును విష్ణు ప్రభావుడైన అర్జునుడు అలవాటైన ధనుస్సును సంధించినట్లుగా దానిని సులభంగా ఎక్కుబెట్టగలిగాడు.
ప్రజలు, రాజులు అందరూ ఆశ్చర్యపడుతుండగా ఐదు బాణాలతో ఆ మత్స్య యంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు.
ద్రౌపదిని గెలుచుకున్నాడు
ధనుర్విద్యను పవిత్రభావంతో ఉపాసించే మేటివీరుల లక్షణాలు.. గురువులను స్మరింటం, విల్లును ప్రదక్షిణం చేయటం, మ్రొక్కటం, మొదలైనవి. గర్వితులైనవారికి విల్లు వశం కాదు.
ఆ మత్స్యయంత్రమొక ఋషి కల్పించిన విద్య అని దృష్టద్యుమ్నుడుడు ముందుగానే చెప్పాడు. విద్యను గౌవించటం విద్వాంసునికే తలుస్తుందనీ, విద్య వినయవంతునికే ప్రసన్నవౌతుందనే సత్యాన్ని ఇక్కడ నిరూపింపబడింది.
ధనుస్సును ఎత్తవచ్చిన దుర్యోధన కర్ణ శల్య శిశుపాలుడు మొదలైన రాజులు దానిని గౌరవించటంగానీ, దానికి ప్రదక్షిణ చేయటంగానీ చేయలేదు. వారిలో బలగర్వం, అహంకారం వారి అపజయానికి కారణభూతమైంది.శ్రీమద్రామాయణంలోని శ్రీరామచంద్రుడు శివధనుస్సును ఎక్కుబెట్టబోయేముందు దానికి నమస్కరించిన తరువాతనే చేబూని సంధించాడు. విల్లునెత్తి అల్లెత్రాటిని లాగగానే ఆ విల్లు ఫెళపెళ ఫెళామంటూ విరిగిపోయింది.
శ్వో ప్రణమ్య శిరసా దేవం ఈశానం వరదం ప్రభుమ్
కృష్ణంచ మనసా కృత్యా జగృహే చార్జునోధనుః
క్షణకాలంలోపలనే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టడం మానవులకు సాధ్యవౌంతుందా? ఉత్తముడైన ఈతడు బ్రాహ్మణ రూపంలో వున్న ఇంద్రుడో, శివుడో, సూర్యుడో, కుమారస్వామియా! అని భూజనులు, ఆకాశం నుండి దేవతలూ అర్జునుని పొగిడారు. ఆకాశం నుండి దేవతల భేరీధ్వనులు మ్రోగాయి. బ్రాహ్మణోత్తములు తమ తమ ఉత్తరీయములను పదే పదే వీచుచూ పెద్దగా కేకలు వేశారు. అర్జునుడిమీద పూలవాన మెండుగా అందంగా కురిసింది.
17
అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు
అనంతరం ధర్మరాజు నకుల సహదేవులు వెంటరాగా తన ఇంటికి వెళ్లిపోయాడు.
ద్రుపద మహారాజు దృష్టద్యుమ్నునితో కూడి గొప్ప సేనతో అర్జునునికి సహాయంగా నిలిచాడు.స్వయంవరానికి వచ్చిన రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తుండగా అతిలోక సుందరి అయిన ఆ ద్రౌపది- నిత్యం చూచేవారికి కూడా ఆమె కొత్తగా కనిపిస్తున్నది. ఆమె నవ్వకపోయినా ఆమె వదనం నవ్వినట్లుగా ప్రకటితమగుచున్నది.
తలపులు తొణికిసలాడుచున్నాయి.
ఆమె మాట్లాడకపోయినా చూపులతోనే మాట్లాడుచున్నట్లు వున్నది. తామరపూవులవంటి కన్నులుగల ద్రౌపది మదపుటేనుగు నడక వంటి నడకతో విలాసంగా వచ్చింది.
అర్జునుని చేరింది.
దేవేంద్రునితో సమానమైనవాడు, నూత్న వనంతో ప్రకాశించేవాడా, ఇంద్రనీలమణుల వలె కాంతిగల దేహంగలవాడూ, మన్మథుని వంటి రూపంగలవాడూ, కుంతీ సుతుడూ పాండవ మధ్యముడూ అయిన అర్జునుడిని తన చేతిలోగల పూలదండతో పూజించింది. అర్జునుడి మెడలో కళ్యాణమాల వేసి వినయంతో నిలబడింది. ఆ యాజ్ఞసేని అప్పుడు దేవేంద్రుని వరించిన శచీదేవివలె, అగ్నిహోత్రుని వరించిన స్వాహాదేవి వలె, సూర్యుని వరించిన ఉషాదేవివలె, మన్మథుని వరించిన రతీదేవివలె, నలుని వరించిన దమయంతివలె, శ్రీరాముని వరించిన సీతాదేవివలె, విష్ణుమూర్తిని వరించిన లక్ష్మీదేవివలె శోభిల్లింది. బ్రాహ్మణులు ఆశీర్వాదాలు, ప్రశంసలు పొందుతూ తనను యాజ్ఞసేని అనుసరించుచుండగా రంగం నుండి అర్జునుడు నిష్క్రమించాడు.
రాజకుమారులందరూ సుకుమారినీ, సౌందర్యరాశినీ, అందమైన ఆకారాన్నీ, పద్మదళములవంటి కన్నులనూ, మత్త్భే గమనం వంటి నడక హొయలుగల ద్రౌపదిని కళ్ళార్పకుండా చూశారు. అంత సౌందర్యరాశి బ్రాహ్మణ వేషంలోనున్న అర్జునునికి అంకితమైపోతున్నదనే అసూయ వారిలో ప్రబలింది. ఈ ద్రుపదుడు రాజులందరినీ ఎందుకు రప్పించాడు?
చుట్టాలవలె ఇందరికి ముందుగా ఎందుకు సన్మానం చేశాడు? ఇంతటి మహావీరులుండగా ఒక బ్రాహ్మణుడికి కన్యను ఎందుకిచ్చాడు? అందరినీ మోసం చేశాడు!

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము