ఈ ఏడు మూడు సినిమాలు తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత బెక్కం వేణుగోపాల్
కుటుంబంలో అందరూ చూడదగ్గ సినిమాలు తీస్తానని, ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నమే చేశానని అంటున్నారు సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్. సినీరంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను పంచుకున్నారు. ‘1995లో నేను, శివాజీ జెమినీ టీవీలో పనిచేస్తున్నప్పుడు ప్రొడక్షన్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. శివాజీ యాంకర్‌గా ఉన్నాడు. నేను ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను. అప్పుడు కల్ట్ మూవీ లాంటిది చేద్దామని అనుకున్నా. కాని కమర్షియల్ సినిమాలే చేద్దామని శివాజీ అనడంతో లక్కి మీడియా అనే బ్యానర్‌ను పెట్టాం. అప్పటికే ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమా సమయంలో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాను. అలా ఆయన దర్శకత్వంలో ‘టాటాబిర్లా మధ్యలో లైలా’ సినిమా నిర్మించాం. 2006లో ఈ సినిమా వచ్చింది. అలా మొదలైన మా ప్రస్థానం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాం. టాటా బిర్లా మధ్యలో లైలా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత భూమిక ప్రధాన పాత్రలో ‘సత్యభామ’, ఆ తరువాత ‘మా ఆయన చంటి పిల్లాడు’, ‘్భలోకంలో యమలోకం’ సినిమా చేసాం. ఆ తరువాత ఓ మంచి కథ రావడంతో ‘మేం వయసుకు వచ్చాం’ సినిమా చేశా. ఆ సినిమాకు చాలా మంచిపేరు వచ్చింది. ఈ సినిమా తరువాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాను చిన్న బడ్జెట్‌తో పూర్తిచేశా. అంత తక్కువ బడ్జెట్‌లో ఆ క్వాలిటీ సినిమా తీయొచ్చని నిరూపించాం. ఇక దాని తరువాత ‘సినిమా చూపిస్తామామ’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నిజానికి ఆ సినిమా పెద్ద హీరోతో చేద్దామని అనుకున్నాం. ముందుగా రావురమేష్‌ని అనుకున్నాం కాని రాజ్ తరువాత అయితే బాగుంటుందని ఆయనతో చేశా. అది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలకు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మూడు సినిమాలు చేస్తున్నాం. అందులో ఒకటి త్రినాథ్‌రావు దర్శకత్వంలో ఉంటుంది. ఈ పదేళ్ళలో సినిమా పరిశ్రమలో డబ్బుకంటే కూడా గుర్తింపు తెచ్చుకున్నాం. నేను తీసిన ఇన్ని సినిమాల్లో ఒక్క ‘బ్రహ్మలోకం యమలోకం’ సినిమాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చాయి తప్ప మిగతా అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్‌తోపాటు అందరికీ డబ్బులొచ్చిన సినిమాలే తీసా. నేను తీసే సినిమాలు అందరికీ నచ్చేలా ఉండాలనేదే నా ప్రయత్నం.