జాతీయ వార్తలు

ఇక ఉక్కు పిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 24: మానవత్వ విలువలను మంటగలుపుతున్న ఉగ్రవాద శక్తులపై భారత్ - ఫ్రాన్స్‌లు ఉమ్మడి పోరాటం సాగిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్‌తో కలిసి ఇక్కడ సంయుక్త వ్యాపార శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ మానవత్వ విలువలను హరించే శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని వెల్లడించారు. ఉగ్రవాద దాడులకు ఈ రెండు దేశాలు బలయ్యాయని, ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అంశంపై పరస్పరం సహకరించుకోవాలన్న మోదీ ప్రతిపాదనను ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్ కూడా అంగీకరించారు. ఎప్పుడైతే ఫ్రాన్స్‌పై ఉగ్రవాద దాడి జరిగిందో... ఈ మహమ్మారిని అంతం చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడినే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పిలవాలని తాను నిర్ణయించుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధికి విఘాతం కలగకుండా ఉగ్రవాదాన్ని ఏవిధంగా అంతం చేయాలన్న దానిపై ఫ్రాన్స్ ఓ ఆదర్శనీయ మార్గనిర్దేశనం చేసిందని మోదీ తెలిపారు. తమ రిపబ్లిక్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని పిలిచిన వెంటనే అంగీకరించినందుకు హోలాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే కాకుండా పరస్పరం గరిష్ట స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను పొందే విధంగా ఇరు దేశాలూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ‘‘్భరత్‌లో యువశక్తి అపారం. నైపుణ్యం, నాణ్యత అమేయం. అలాగే ఫ్రాన్స్ ఉత్పాదక రంగంలో అద్భుతమైన విజయాలను సాధించింది. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే ఆర్థికంగా కూడా ఎంతగానో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది’’ అని మోదీ తెలిపారు. భారతదేశంలో అపారంగా ఉన్న జనశక్తి వనరులు తమకు తిరుగులేని ధీమాను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాయని మోదీ తెలిపారు. నైపుణ్యం కలిగిన యువశక్తి వల్ల ఉత్పాదక వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు నాణ్యతనూ పెంపొందించుకోవచ్చునని మోదీ తెలిపారు. అలాగే ఫ్రాన్స్‌కు కూడా అపారంగా వనరులున్నాయని, వాటికి సరిపడ అవసరాలు, మార్కెట్ భారత్‌కు ఉన్నాయని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోలాన్ భారత్‌తో అన్ని రంగాల్లోనూ మైత్రీబంధాన్ని పెంపొందించుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాల విషయంలో తనకు నమ్మకం ఉందని వెల్లడించిన ఆయన, ‘‘మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి చర్యలు చేపడతాం. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు అడుగులు వేస్తున్నాం’’ అని హోలాన్ తెలిపారు.