హైదరాబాద్

ఇ-లైబ్రరీని ప్రారంభించిన తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: నగరంలో పుస్తక ప్రియుల కోసం..కాస్త ఆధునికతను జోడించి ఇ- లైబ్రరీలను అందుబాటులోకి తెచ్చింది జిహెచ్‌ఎంసి. ఈ లైబ్రరీలను కోరుతూ ముందుకొచ్చే కాలనీ సంక్షేమ సంఘాలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందించేందుకు వీలుగా వర్తమాన ఆర్థిక సంవత్సర జిహెచ్‌ఎంసి బడ్జెట్‌లో కూడా ప్రత్యేకంగా కేటాయింపులు జరిపిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా నగరంలో మొట్టమొదటి ఇ-లైబ్రరీ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నియోజకవర్గంలో అందుబాటులోకి వచ్చింది. బన్సీలాల్‌పేట డివిజన్‌లోని బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైబ్రరీని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఇప్పటికే పలు చోట్ల గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నా, పెరుగుతున్న ఆధునిక సాంకేతికతను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఈ లైబ్రరీ విధానాన్ని జిహెచ్‌ఎంసి రూపొందించిందని వివరించారు. మొదటి విడతగా నగరంలోని ప్రతి జోన్‌కు తొలుత రెండు ఇ-లైబ్రరీలను మంజూరు చేయటం జరిగిందని మంత్రి వివరించారు. ఇ-లైబ్రరీ ఏర్పాటు విషయంలో ముందుకొచ్చే కాలనీ సంక్షేమ సంఘాలకు జిహెచ్‌ఎంసి తరపున రెండు కంప్యూటర్లు, కావల్సిన ఫర్నిచర్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. అంతేగాక, బన్సీలాల్‌పేటలోని ఈ మొట్టమొదటి లైబ్రరీని ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి లక్ష రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే ఇక్కడి కమ్యూనిటీ హాల్‌లో మంచినీటి కనెక్షన్లను అందించేందుకు అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రయోగాత్మక ఇ-లైబ్రరీని ప్రారంభించటం జరిగిందన్నారు. ఇలాంటి లైబ్రరీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే కాలనీలకు సహాయం అందించేందుకు జిహెచ్‌ఎంసి సిద్దంగా ఉందన్నారు. లైబ్రరీ నిర్వహణ, ఇతర సిబ్బంది విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. మరోసారి ఈ ప్రాంతానికి విచ్చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు, వౌలిక వసతులపై ప్రజలను అడిగి తెల్సుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇ-లైబ్రరీకి పుస్తకాలను అందజేసిన విద్యావేత్త చుక్కా రామయ్యను మంత్రి, మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మిపతి, జోనల్ కమిషనర్ హరిచందన ఇతర అధికారులు పాల్గొన్నారు.