ఈ వారం కథ

గుర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిపబ్లిక్‌డే రోజు విదిత తండ్రి తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌షో చూడటానికి పెరేడ్‌గ్రౌండ్స్‌కి వెళ్ళాడు. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జెట్ ఫైటర్ విమానాలు ఒళ్ళు గగుర్పొడిచేలా గాల్లో అనేక విన్యాసాలు చేసాయి. చివర్లో మూడు జెట్ విమానాలు తోకల్లోంచి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పొగలని విరజిమ్మడంతో ఆకాశంలో పెద్ద భారతీయ జెండా ఎగురుతున్నట్లుగా భావించిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
‘‘ప్రతీ వాహనం తను ప్రయాణించిన గుర్తుని సాధారణంగా పొగ రూపంలో వదుల్తూంటుంది. దానికి రంగులు కలిపి మన జాతీయ జెండాని గుర్తుచేయడం మంచి ఆలోచన.’’ విదిత తల్లి చెప్పింది.
‘‘ప్రతీ గుర్తు ఒకో సత్యాన్ని చెప్తుంది’’. విదిత తండ్రి ఆలోచనగా చెప్పాడు.
‘‘అంటే?’’ విదిత అడిగింది.
‘‘ఇంట్లోని వాసన అమ్మ సాంబారు వండుతోందనే సత్యాన్ని చెప్తుంది’’. విదిత అన్న నవ్వుతూ చెప్పాడు.
బయట భోజనం చేసి అంతా ఇంటికి చేరుకున్నారు.
‘‘విదితా! నేను నీ గదిలోకి వచ్చినప్పుడల్లా అది నీ గురించి నాకో సత్యాన్ని చెప్తూంటుంది.’’ తండ్రి చెప్పాడు.
‘‘ఏమిటది?’’ విదిత అడిగింది.
‘‘నువ్వు నీ గదిలో చాలా గుర్తులు వదులుతావు. వాటినిబట్టి నాకు నీ గురించిన నిజాలు తెలుస్తూంటాయి.’’
‘‘ఏమిటా నిజాలు నాన్నా?’’
‘‘నీ పుస్తకాలు అలమరలో కాక నేల మీద, మంచం మీది దుప్పటి మడిచి కాక కొంత నేల మీద, బట్టలు హేంగర్లకి కాక కింద, ఇలా అశుభ్రపు గుర్తులు గల నీ గది నీ గురించి చాలా చెప్తుంది. బద్ధకస్తురాలివని, శ్రద్ధలేని దానివని, ఏ పనీ సరిగ్గా చేయవని, అందాన్ని ఆరాధించవని.. ఇలా ఇంకా చాలా.’’
విదిత కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పింది.
‘‘నిజమే. ఆకాశంలో విమానం పొగ జెండాని మనకి చూపించినట్లుగా సరిగ్గా సర్దుకోని నా గది నేను ఎలాంటి దాన్నో చూపిస్తుంది’’. విదిత చెప్పింది.
‘‘ఎక్కువ మార్కులు రావడం అంటే ఆ విద్యార్థి బాగా చదివాడన్నది సత్యం. తక్కువ మార్కులు రావడం మరో దానికి గుర్తు. ఇలా మనం చేసే ప్రతీ పనీ ప్రపంచానికి కొన్ని గుర్తులని వదుల్తుంది. మన చర్యలన్నీ మంచి గుర్తులనివదిలేలా మనం జాగ్రత్త పడుతుండాలి. చెడ్డ గుర్తులు రాకుండా చూసుకోవాలి.’’ తండ్రి వివరించాడు.
*

అనగననగా.. మల్లాది వేంకట కృష్ణమూర్తి