క్రైమ్/లీగల్

ఇద్దరు చోరులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మే 18: కళ్యాణ మండపాల్లో జరిగే వేడుకలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు చోరులను అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నాం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడిన చోరుల వివరాలను తెలియజేశారు. కాకినాడ నగరంలో ఉన్న వివిధ కళ్యాణ మండపాల్లో జరిగుతున్న వేడుకల్లో ఇటీవల కొంత కాలంగా వేడుకలకు వచ్చే వారికి చెందిన బ్యాగుల్లో పెట్టుకున్న ఆభరణాలు చోరులకు గురవుతున్నాయి. అంతే కాకుండా కళ్యాణ మండపాల్లో ఉండే గదులకు తాళం వేసి ఉంచగా వాటి తాళాలను పగులగొట్టి లేకుంటే మారుతాళాలతో తీసి అందులో ఉన్న విలువైన వస్తువులు అపహరణకు గురువుతున్నాయి. దీంతో బాధితుల నుండి పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందుతున్నాయి. ఫిర్యాదుల నేపధ్యంలో పోలీసులు కళ్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడుతున్న నింధితులను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేశారు. నిఘావర్గాల నుండి జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి వచ్చిన సమాచారంతో ఆయన డిఎస్పీ రవివర్మకు నింధితులను అరెస్టుచేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయడంతో కాకినాడ రూరల్ సిఐ చైతన్యకృష్ణ శుక్రవారం ఉదయం కాకినాడ నగరం ఏటిమొగ ప్రాంతంలో దాడిచేసి బొడ్డు కస్తూరి(28), వనమాడి దుర్గాప్రసాద్(28) అనే వారిని అరెస్టుచేశారు. వీరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తామే కళ్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు ఎస్పీ చెప్పారు. వీరి వద్దనుండి సుమారు 20లక్షల విలువైన 80కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనంచేసుకున్నట్లు తెలియజేశారు. నింధితులు ఇద్దరూ 2016నుండి సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని జికనె్వన్షన్ హాలు, భాస్కరరెడ్డి కళ్యాణ మండపం, రామకోస ఫంక్షన్‌హాలు తదితర వాటిల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు. కళ్యాణ మండపాల్లో జరిగే వేడుకలకు వీరిద్దరూ అతిధులుగా ప్రవేశించి చోరీలకు పాల్పడతున్నారని ఎస్పీ విశాల్ గున్ని తెలిపిపారు. నింధితులను అరెస్టుచేయడంలో ప్రతిభ కనబరచిన సిఐ చైతన్యకష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది సూరిబాబు, సత్తిబాబు, అప్పాజీ, శ్రీనివాసు, ప్రసాద్‌లను అభినందించారు. ఈవిలేకరుల సమావేశంలో డిఎస్పీ రవివర్మ, సిఐ చైతన్యకృష్ణలు పాల్గొన్నారు.

లాంచీ ప్రమాదంలో 19 మృతదేహాలు స్వాధీనం
ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ సిటీ, మే 18: దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంలో ఇప్పటి వరకు 19మృతదేహాలను నదినుండి వెలికితీసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. అయితే ఓ వ్యక్తి నదిలో గల్లంతు అయినట్లుగా భావించి అతని కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, ఎపి ఎస్‌పిఎఫ్ సిబ్బంది గాలించారని ఆవ్యక్తి సురక్షితంగా ఉన్నట్లుగా తెలిసిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన లాంచీ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ లాంచీలో అనధికారికంగా సిమ్మెంట్ బస్తాలు వేయడం, ఈదురు గాలులు కారణంగా లాంచీ కిటికీ డోర్లు మూసివేయడంతో పాటు నిర్లక్ష్యం కారణంగానే ఈప్రమాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ మిశ్రా, తాను హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి వెల్లి లాంచీ వెలికితీసేందుకు కృషిచేశామన్నారు. ఈవిషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమను ప్రత్యేకంగా అభినందించినట్లు చెప్పారు. నదినుండి 11మంది మహిళల మృతదేహాలు, నలుగురు పురుషుల మృతదేహాలు, నలుగురు చిన్నపిల్లల మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 17మంది సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారన్నారు. మరోసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నిదిలో ప్రత్యేక గస్తీ తిరిగడానికి పెట్రోలింగ్ బోటుకావాలని సిఎం దృష్టికి తీసుకువెల్లామని అతిత్వరలోనే బోటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇకనుండి నదిలో పోలీస్ శాఖ పర్యవేక్షణలో ప్రత్యేక గస్తీబోటు ద్వారా లాంచీలు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు