మిర్చిమసాలా

వారసత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల సాధనకు విపక్షాలు చేపట్టిన ఉద్యమాల సమయంలో నాయకులు తరచూ తమ ప్రసంగాల్లో ఆ నాయుడు.. ఈ నాయుడు ఒక్కరేనంటూ ధ్వజమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు కొనసాగేలా నాటి యుపిఎ ప్రభుత్వం మంత్రివర్గంలో కూడా నిర్ణయం తీసుకోగా నాడు ప్రతిపక్ష హోదాలో వున్న ఎం వెంకయ్య నాయుడు పదేళ్లు కావాలంటే, నారా చంద్రబాబు నాయుడు ఏకంగా 15ఏళ్లు కావల్సిందేనన్నారు. తీరా వీరిద్దరూ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఈవిషయమై నోరు మెదపటం లేదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే కేంద్రంలో మంత్రిగా వున్న వెంకయ్య నాయుడు ఇటీవల విజయవాడకు వచ్చినపుడల్లా ఎవరూ అడగకపోయినా తనే స్వయంగా ‘ఆ నాయుడు.. ఈ నాయుడు ఒకటెలా అవుతారు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీన్ని సమర్థించుకోటానికిగా అన్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ నియామకాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘రాజకీయాల్లో వారసత్వం ప్రమాదకరం. జవసత్వం ఉండాలి. నా కుటుంబంలో నేను మినహా రాజకీయ నాయకులెవరూ లేరు. స్వయంకృషితో పైకొచ్చాను. కుమార్తె- అల్లుడు, కొడుకు-కోడలు.. వీరెవరిని కూడా రాజకీయాల్లోకి తీసుకురాలేదు. భవిష్యత్‌లో కూడా తీసుకురాబోనం’టూ వినేవారిని ఆయన ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. పైగా ‘నా కుమార్తెను సేవా కార్యక్రమాలకే పరిమితం చేశాను. ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాలే అవసరమా?’ అని కూడా వెంకయ్య ఎదురు ప్రశ్నిస్తున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

ఆదివారం పని రోజు
ఆదివారం సెలవు రోజయితే మిగిలిన ఆరు రోజులు పని దినాలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సెలవు రోజు పని దినం అయితే పని దినాలు అన్నీ సెలవు దినాలు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ చమత్కరించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెలవు రోజులైన శనివారం, ఆదివారం కూడా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆమె ఈ విధంగా చమత్కరించారు. సెలవు రోజుల్లో కూడా పని చేస్తున్నారని చెప్పడానికి ఇలా శనివారం, ఆదివారం కూడా సభ నిర్వహిస్తున్నారు, ఐతే పని రోజుల్లో మాత్రం ప్రభుత్వం పని చేయడం లేదని విమర్శించారు. సెలవు రోజు విశ్రాంతి లేకుండా ప్రజాప్రతినిధులు సభకు రావలసి వస్తోంది.
- మురళి

అవే మాటలు, అవే సవాళ్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్లు గడచినా, ఆంధ్ర అసెంబ్లీలోని టిడిపి, వైకాపా సభ్యుల తీరు చూస్తుంటే జనానికి విసుగుపుడుతోంది. తాజా అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండు రోజుల పాటు చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ జరిగింది. ఈ తీర్మానాల సారాంశం, ఫలితాలు ఎలా ఉన్నా, ఇరు పార్టీల నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి సవాళ్లు, ప్రతి సవాళ్లనే విసురుకున్నారు. పరస్పర ఆరోపణల్లో ఏ మార్పు లేదు. అవే ఆరోపణలు, వాటిపైన చర్చ. కొత్తగా చేరింది అమరావతి భూములు, పట్టిసీమ మాత్రమే. ఏపి అసెంబ్లీని తిలకించేందుకు వచ్చిన వారు కూడా గతంలో వచ్చినప్పుడు మాట్లాడిన మాటలే మాట్లాడుకుంటున్నారు, అవే సవాళ్లు విసురుకుంటున్నారు అని నిట్టూర్పు వదిలారు. మన ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలపై వాద సంవాదాలను ఆపి నిధుల లేమితో కటకటలాడుతున్న ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచిస్తారా ? అదీ ఎండమావేనా?
- శైలేంద్ర
ఎవరు నీతిమంతులు..?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరుతున్న క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఆరోపణ, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపి ఊడ్చుకుపోయి కనీసం ప్రతిపక్ష హోదానైనా దక్కించుకోలేక పోయింది కదా..అని వైఎస్సార్ సిపి నాయకుడొకరు టిడిపిని ఎద్దేవా చేశారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వారు (టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు) నీతిమంతులా..అంటూ నోరు జారారు. కానీ ఆ మాట తనకు కూడా వర్తిస్తుందని అనుకోలేదు కాబోలు. ఆ క్రమంలోనే తాను టిడిపిని వదల్లేదని, ఆ పార్టీనే టిఆర్‌ఎస్‌లో విలీనం చేశానంటూ ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు ఎదురైన విలేఖరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నారు. గతంలో టిడిపిని చంద్రబాబు నాయుడు తన గుప్పిట్లోకి తీసుకొని ఎన్టీఆర్ వెంట ఉన్నవారిని ఏ విధంగా గుర్తించారో..ఇప్పుడు తెలంగాణలో టిడిపిని అదేవిధంగా గుర్తించే దుస్థితి నెలకొందని గుర్తు చేసుకున్నారు. నాడు చంద్రబాబు చేసింది తప్పు కాకపోతే..నేడు మేము (టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు) చేసింది కూడా తప్పుకాదు..అంటూ ఎర్రబెల్లి అన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు నీతిమంతుడైతే.. తాము నీతిమంతులమేనంటూ ఎర్రబెల్లి చమత్కరించారు. ఇం తలోనే మరో ఎమ్మెల్యే కలుగజేసుకొని అసలు నీతి మంతులెవరూ..? అంటూ వేసిన ప్రశ్నకు అందరూ నవ్వుకున్నారు.
-సయ్యద్ గౌస్‌పాషా

ఇన్ని అబద్ధాలా..?
సంభాషణలు ఒక్కోసారి చమత్కారంగా ఉంటాయి. అవి వినోదాన్ని కూడా పంచుతుంటాయి. అసెంబ్లీలో కొన్ని సంభాషణలు మరీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. శాసనసభలో సభ్యులు ఎవరు మాట్లాడినా స్పీకర్‌ను ఉద్దేశించే మాట్లాడాల్సి ఉంటుంది. ఏ పక్షానికి చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలకైనా అధికార పక్షం నేతలు కాని, మంత్రులు కాని స్పీకర్‌ను ఉద్ధేశించి బదులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మాట్లాడుతున్నపుడు అవతలి పక్షం సభ్యులను దృష్టిలో ఉంచుకుని వారు మాట్లాడుతుంటే ఆ సంభాషణలు కొంత ఆసక్తిదాయకంగా, వినూత్నంగానూ అనిపిస్తుంటాయి. అవతలి పక్షం వారిని విమర్శించే పక్షంలో ఇన్ని అబద్ధాలా అధ్యక్షా...మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు చెబుతారా అధ్యక్షా..అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు అవి స్పీకర్‌కు ఆపాదిస్తున్నట్టు కనిపించినా, కాదనేది అందరికీ తెలిసిన విషయమే.
- బి.వి.ప్రసాద్