ఉత్తరాయణం

కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోద్రా సామూహిక హత్యాకాండ తరువాత జరిగిన మతకల్లోలాలను సాకుగా తీసుకొని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసులు వేసి, సిట్‌ను నియమించి శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఏ తప్పూ చేయని మోదీ నిర్దోషిగా బయటపడ్డారు. కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. గుజరాత్‌లో చేసిన అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలు మూడు సార్లు జరిగిన ఎన్నికలలో మోదీనే తమ నాయకుడని సంపూర్ణ మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. అయినా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు.
2014లో జరిగే ఎన్నికలలో భాజపా ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆయనను కుసంస్కారంతో చాయ్‌వాలా, రాంబో, నరహంతకుడు, మృత్యుబేహారీ వంటి అనేక పేర్లు పెడుతూ ప్రజల మనసులో విషబీజాలు నాటడానికి ప్రయత్నించింది. కానీ జరిగిన ఎన్నికలలో ప్రజాతీర్పు ఇంకొక రకంగా వచ్చి మోదీ నేతృత్వంలో భాజపా సంపూర్ణ మెజారిటీని సాధించింది. దారుణమైన ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ మంత్రులు సభ్యులు గతంలో తాము స్వాహా చేసిన ప్రజల సొమ్ము వివరాలు ఎక్కడ బయటకు తీస్తాడోనని భయపడుతూ పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వక ఇంకా లేనిపోని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అసలు అవినీతికి తావులేకుండా ఉన్న పాలన, యువతకు ఉద్యోగావకాశాలుండే మేకిన్ ఇండియా, చిన్న చిన్న వ్యాపారస్థులకు రుణాలిచ్చే ముద్రా బ్యాంకు, మహిళా సాధికారత, జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఇంకా విమర్శిస్తూనే ఉంది. గ్యాస్ సబ్సిడీని వదులుకొమ్మని ధనవంతులను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తాను 60 నెలల సమయమడిగారు. కానీ 18 నెలల్లో ఏం చేశారు? నల్లధనాన్ని ఏం చేశారు? అంటూ విమర్శిస్తోంది కాంగ్రెస్. కానీ ఒక్క విషయాన్ని గమనించాలి. అభివృద్ధే తన ఎజెండాగా రోజుకి 20 గంటలు శ్రమించే నరేంద్ర మోదీని ఎంతగా విమర్శిస్తే ప్రజలు ఆయన్ను అంతగా ఆదరిస్తారు. బిహార్‌లో నితీష్ వల్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. కానీ ఓట్ల శాతం తగ్గింది. భాజపా ఓట్ల శాతం పెరిగింది. కొన్ని పత్రికలూ ఛానళ్లూ తమ చేతిలో ఉన్నాయికదా అని మోదీని తెగ విమర్శించకుండా, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు తగిన సలహాలను, సూచనలను ఇస్తూ తోడ్పడకుంటే కాంగ్రెస్ ముక్త భారత్ ఇంక సమయం వచ్చిందని ప్రజలు అనుకునే రోజు త్వరలోనే రావచ్చు.
-దుర్భా శంకరనారాయణ, విజయవాడ
అసెంబ్లీని సంస్కరించే నాటకాలు రావాలి
అసెంబ్లీ కార్యకలాపాలను సంస్కరించే నాటకాలు, ప్రస్తుత తరుణంలో రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేసిన సూచనలు, సలహాలు అత్యంత ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 7,8 తేదీల్లో చిలకలూరిపేటలో నిర్వహించిన నాటక పోటీల్లో బుద్ధ ప్రసాద్ పైవిధంగా సూచించడం సమజసంగా ఉన్నది. శాసనసభలో వ్యక్తిగత నిందారోపణలు, వాకౌట్లు వంటివి తప్ప ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదు. శాసన సభను నిర్వహించే రోజులు తక్కువగా ఉన్నాయి. గొడవలతో సభాపర్వం నిర్వీర్యమవుతోంది. పాతకాలంలో నాటి శాసనసభ్యులు తెనే్నటి విశ్వనాధం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతులచ్చన్న, సి.వి.కె. రావు, టి.వి.ఎస్. చలపతిరావు, వంటి ఉద్దండులు ప్రజా సమస్యలను తమ అనర్గళ వాగ్ధాటితో చర్చించేవారు. ప్రస్తుతం అలాటి శాసనసభ్యులే కరవయ్యారు. ఈ నేపథ్యంలో శాసనసభను సంస్కరించేందుకు ఆవసరమైన నాటకాలు రాయాలని బుద్ధ ప్రసాద్ నాటక కళాపరిషత్తులను సూచించడం అర్థవంతంగా ఉంది. రచయితలు, నాటక కళాపరిషత్తులు అసెంబ్లీ కార్యకలాపాల్లో రావలసిన మార్పుల ఇతివృత్తంగా నాటకాలను రాస్తే బాగుంటుంది.
- వి. కొండలరావు, పొందూరు