సబ్ ఫీచర్

సెల్ టవర్లు ఆరోగ్యానికి హానికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్‌ఫోన్లు జేబులో పెట్టుకుంటే గుండెకు ఇబ్బంది కాబట్టి ప్యాంటు బెల్టుకు సంచిలా తయారుచేసి ఇప్పుడు పెట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్ వల్లనే, దాని రేడియేషన్ వల్లనే గుండెకు ప్రమాదముందంటే, దానికంటే కొన్ని వేల రెట్లు ఉండే సెల్ టవర్లవలన చాలా ప్రమాదముంటుందని మనం సులువుగానే గ్రహించవచ్చు. మొత్తం భారతదేశంలో ఈ టవర్లు రకరకాలుగా వున్నాయి. ఎఫ్‌ఎం టవర్లు-500, టీ.వి.టవర్లు- 1000, సెల్ టవర్లు- 4,50,000. ఈ లక్షలాది టవర్లన్నీ రేడియేషన్ ద్వారా జనాన్ని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఈమధ్య సెల్‌ఫోన్లు, టవర్ల విషయాలలో చాలా మార్పులతో నిబంధనలు వచ్చాయి. వాటిపై జనాలకు అవగాహన లేకపోవడం వల్లనే ఇంకా అలాగే పాత పద్ధతులతోనే కొనసాగుతున్నాం. మారిన కొత్త నిబంధనలలో కొన్ని మనం పరిశీలించినట్లయితే ఇటుపైన ఉత్పత్తిఅయ్యే సెల్‌ఫోన్లపై రేడియేషన్ ఫ్రీక్వెన్సీని తప్పక వ్రాయాలి. సెల్‌టవర్ల నిర్మాణం విషయంలో ప్రజలు నివసించే ప్రదేశానికి కనీసం 35 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే 100 మీటర్ల దూరంలో కనీసం ఒక్క పాఠశాల కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శాస్ర్తియంగా చూస్తే సెల్‌టవర్ ఏంటెన్నాకు 50 మీటర్లు నుండి 300 మీటర్ల దూరం వరకూ చుట్టూ హైరేడియేషన్ జోన్‌గాను (డార్క్‌బ్లూ జోన్) పిలుస్తారు. ఆ ప్రాంతంలో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండడంవలన ఆ పేరు పెట్టడం జరిగింది.
రేడియేషన్ ఫ్రీక్వెన్సీ పరిమితులు వివిధ దేశాలలో రకరకాలుగా ఉన్నాయి. భారతదేశంలో 1998లో నిర్ణయించిన లిమిట్ 9.2 డబ్ల్యు/ఎం2 , బెల్జియం- 1.2 డబ్ల్యు/ఎం2, న్యూజిలాండ్- 0.5 డబ్ల్యు/ఎం2, పోలెండు, చైనా, ఇటలీ- 0.1 డబ్ల్యు/ఎం2, స్విట్జర్‌లాండు - 0.095 డబ్ల్యు/ఎం2, జర్మనీ- 0.09 డబ్ల్యు/ఎం2, రష్యా- 0.02 డబ్ల్యు/ఎం2, ఆస్ట్రియా-0.001 డబ్ల్యు/ఎం2 ఆస్ట్రేలియా- 0.00001 డబ్ల్యు/ఎం2 ఈ విషయాల్ని పరిశీలించినట్లయితే అన్ని దేశాలకంటే మన భారతదేశంలోనే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ లిమిట్ అత్యంత ఎక్కువగా అంటే 9.2 డబ్ల్యు/ఎం2 ఉంది. మన దేశంలోనే రూల్స్ టవర్లకు చాలా అనుకూలంగానూ, ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకంగానూ ఉన్నాయ. ఈ సెల్‌టవర్ రేడియేషన్ ప్రభావంవల్ల కలిగే అనారోగ్యం, మిగతా రోగాల లాగ వెంటనే తెలియవు. ఆఖరిస్థాయిలో మనకు తెలిసేసరికి మందులు కూడా పనిచేయని పరిస్థితికి వెళ్ళే ప్రమాదముంది. ఏదైనా సెల్‌టవర్‌కు ఒక మీటర్ దూరంలో ఒక మనిషి ఒక గంటసేపు నిలబడితే తన శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరుగుతుంది. అదే నాలుగు గంటలు నిలుచుంటే 8 డిగ్రీల వృద్ధి కనిపిస్తుంది. మానవుడి శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4్య ఫారెన్‌హీట్ కాబట్టి అంతటి తీవ్ర ఉష్ణోగ్రతలో మనిషి ఉండలేడు. సెల్‌టవర్ల వల్ల మనకు వచ్చే ప్రధానమైన అనారోగ్యాలు నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి జబ్బులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, రక్తప్రసరణకు సంబంధిత అనారోగ్యం. కిడ్నీలు, కాలేయం, ఊపిరి తిత్తులలో ట్యూమర్లు, కాన్సరు లాంటి రోగాలుకూడా ఈ సెల్‌టవర్ల రేడియేషన్‌వలన వస్తున్నట్లు నిరూపణ అయింది. పక్షులు, ఈగలు, పిచ్చుకలు, చెట్లు లాంటివి నూటికినూరు శాతం కనిపించటం లేదన్నది సర్వేలో తేలిన అంశం. ఒక రోజులో ఈ టవర్ వలన ఉత్పత్తి అయ్యే రేడియేషన్ ఒక మనిషిని 19 నిమిషాలు ఒక పొయ్యిమీద కూర్చోబెట్టినంత ఉన్నదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే ప్రొఫెసర్ గిరీష్‌కుమార్, ఐఐటి బొంబాయివారి ఉద్దేశ్యంలో మరో రెండు సంవత్సరాలలో సుమారు ఒక కోటి మందికి పైగా ఈ రేడియేషన్‌లకు బలిపశువులవుతారంటున్నారు.
దీనికి పరిష్కారమార్గాలు కూడా ఉన్నాయి. సెల్‌టవర్ల సేఫ్ రేడియేషన్ లెవెల్ 0.01 డబ్ల్యు/ఎం2 కు తగ్గించాలి (ప్రస్తుతం 9.2 డబ్ల్యు/ఎం2 ఉన్నది) దీనివలన తాత్కాలికంగా మన మొబైల్‌ఫోన్లు ఇబ్బందిపెడతాయి. తర్వాత మరో 2 సంవత్సరాలలో ఈ స్థాయి 0.0001 డబ్ల్యు/ఎం2కు కూడా తగ్గాలి. తక్కువ రేడియేషన్‌తో ఎక్కువ టవర్లు రావాల్సి ఉంది. 24 గంటలూ ఈ సెల్‌టవర్లు పర్యవేక్షణ యాజమాన్యంచేస్తూ ఉండాలి. ఏంటిన్నా నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ దిశ జనావాసాల వైపు లేకుండా, చెట్లు, పక్షులు లేనివైపు ఉండేటట్లు చేసుకోవాలి. ‘రెడ్యూస్ ది పవర్ ఆర్ రిమూవ్ ది పవర్’అన్న నినాదంతో జనాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.

- డా.యం.వి.ఆర్.కృష్ణాజీ