సబ్ ఫీచర్

వయోజన విద్యపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువుకున్నవారైతే ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా వుంటుంది. చదువుకున్న తల్లిదండ్రుల వల్ల పిల్లలకు వచ్చే చదువులో అర్థంకాని అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వుంటుంది. పిల్లలకు ప్రాథమిక దశలోనే ఏ సబ్జెక్టుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారో దాన్ని గమనించి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించే అవకాశం వుంటుంది. ప్రాథమిక విద్య ప్రమాణాలు పెరగటానికి తల్లిదండ్రుల చదువుకూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రుల చదువుకు, పిల్లల చదువుకు సంబంధం లేదనుకుంటే పొరపాటే అవుతుంది. అందుకే వయోజన విద్యపై కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని పెట్టవలసి ఉంది. ఈ రకమైన పని మన దేశంలో జరిగినా వయోజన విద్యా కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోకపోవటంవల్ల వయోజన విద్య అంటే సంతకాలు చేయటం వరకే అనే దశకు వచ్చింది. ఆ ప్రభావం కూడా మన స్కూలుపై వుంటుంది.
తల్లి గర్భంలో మొదట బిడ్డ రూపంలో పెరిగే అంగం మెదడు మాత్రమే. అందుకే క్యూబాలో విద్యారంగాన్ని వైద్యరంగంతో కలిపి అనుసంధానం చేసి చూస్తారు. విద్యార్థి ప్రగతి తల్లిదండ్రుల నేపథ్యంపైన ఆధారపడి ఉండటం కూడా సహజమే. అమెరికాలో విద్యాబుద్ధుల వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటని అనేక సర్వేలు నిర్వహించారు. విద్యార్థి విద్యావికాసం 47 శాతం తల్లిదండ్రుల చైతన్యం పైననే ఆధారపడి ఉంటుంది. 33శాతం టీచర్లపై ఆధారపడి ఉంటుంది. 20శాతం విద్యార్థి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఏ తల్లిదండ్రులైతే పిల్లల బుద్ధుల ఎదుగుదలలో శ్రద్ధతీసుకుంటారో ఆ పిల్లలు తరగతి గదిలో చురుకుగా ఉంటారు. లాటిన్ అమెరికన్ దేశాలలో ప్రాథమిక విద్యలో విద్యార్థుల ఎదుగుదలను పెంచడానికి వయోజన విద్యపైన దృష్టిని కేంద్రీకరించటం జరిగింది. తల్లిదండ్రుల చదువు పిల్లల్లో ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చాలామంది పిల్లలు ఈ తరానికి చెందిన ఫస్ట్‌లెర్నర్స్‌గా చూడాలి. ప్రాథమిక విద్యను విజయవంతం చేయడానికి వయోజన విద్య చాలా సమర్థవంతమైన పాత్రను నిర్వహించింది. చదువుకున్న తల్లిదండ్రులు లేని పక్షంలో ఆ లోటును భర్తీచేసేందుకు కృషిచేయాలి. హర్యానాలో పంచాయతీ బోర్డు సభ్యులుగా పోటీచేయాలంటే కనీస విద్యా అర్హతలను 10 తరగతి చదివి ఉండాలని నిబంధన పెట్టారు. ఇది సంభవం కావాలంటే సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలి. తల్లిదండ్రుల చదువు ప్రభావం విద్యార్థిపై ఎంతో ప్రభావం చూపుతుంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఒక సందర్భంలో విద్యాకమిటీలు వేయాలని సూచనలు చేయటం జరిగింది. కానీ ఆ విద్యాకమిటీలు ఉపాధ్యాయులపై పెత్తనం కమిటీలుగా మారే ప్రమాదం ఉందని, ఇది విద్యాకార్యక్రమానికి విఘాతం కలిగిస్తుందని విరమించుకోవటం జరిగింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా వయోజన విద్యను మరలా ప్రారంభిస్తే బాగుంటుందని మన విద్యావేత్తలు అంటున్నారు.
విద్యార్థులు పై తరగతులకు పోయినా కొద్ది తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువవుతుంది. ఉపాధ్యాయులు కనీసం నెలకొక్కసారైనా విద్యార్థుల ఇళ్లల్లోకి వెళ్లి తిరిగి రాగలిగితే విద్యాప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని హైదరాబాద్‌లోని నురుప్‌తుంగ హైస్కూల్‌లో కృపాచారి అనే టీచర్ చేశారు. నారాయణ్‌ఖేడ్‌లో ఇలాంటి పనినే శంకరప్ప అనే టీచర్ చేశారు. ఆ ప్రభావంతో మేము భువనగిరిలో చేశాం. ధర్మభిక్షం లాంటి నాయకుడు సూర్యాపేటలో హాస్టల్ పెట్టి పిల్లలను చదివించారు. తల్లిదండ్రుల జోక్యం ఒక మోతాదులోనే ఉండాలి కానీ ఎక్కువగా ఉపాధ్యాయుల జోక్యమే ఉంటే బావుంటుంది. ఎక్కువ జోక్యం చేసుకునే తల్లిదండ్రులు హెలికాప్టర్ పేరెంట్స్ అంటారు. తల్లిదండ్రుల సూపర్‌విజన్ అవసరమే కానీ మరి అది మితిమీరకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యారంగం తగు సూచనలు చేయాలి.

- చుక్కా రామయ్య