సంపాదకీయం

మాదక బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదక ద్రవ్యాలను పంపిణీ చేస్తున్న నైజీరియా బీభత్సకారులు మరోసారి పట్టుబడడం ఆశ్చర్యకరం కాదు. పదే పదే హైదరాబాద్‌లో మాత్రమే కాక దేశంలోని అనేకచోట్ల నైజీరియా తదితర ఆప్రికా దేశాలకు చెందిన మాదక ముఠాలవారు పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో మరో ఏడుగురు నైజీరియా మాదక ఉగ్రవాదులను పోలీసులు బుధవారం పట్టివేయడం అందువల్ల ఆశ్చర్యం కాదు. ఏళ్ల తరబడి ఇలాంటి మాదక చోరులు పట్టుబడుతున్నప్పటికీ కొత్తవారు దేశంలోకి ఎలా చొరబడుతున్నారన్నదే విస్మయకరమైన పరిణామం. గోవాలోను ఇతరచోట్ల ఏళ్ల క్రితమే నైజీరియా మాదక ముఠాలు పట్టుబడిన తరువాత కూడ ఇలాంటివారు దేశంలోకి చొరబడకుండా ఎందుకని నిరోధించలేకపోతున్నాము? బుధవారం పట్టుబడిన ముఠావద్ద డెబ్బయి మూడు గ్రాముల ‘కొకాయిన్’మాదకం, ఐదు గ్రాముల ‘బ్రవున్ సుగర్’ మత్తు పదార్థం లభించాయట. ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలలో తిరుగుతూ ఈ మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయించారట. గోవాలో నైజీరియా తిండి పదార్థాలను అమ్మే దుకాణాలను నడిపిన ముఠా సభ్యులు ఆ తరువాత ఈ మాదక వ్యాపార రంగంలోకి దిగిపోయారు. ముఠాసభ్యులు కొందరు బట్టల వ్యాపారులుగా కూడ చెలామణి అయ్యారట. ఈ వ్యాపారాలలో నష్టాలు వచ్చినందువల్ల మాదక పదార్థాలను అమ్మడానికి రవాణా చేయడానికి ఈ నైజీరియన్లు పూనుకున్నాట. ఇది పోలీసులకు నిందితులు చెప్పిన మాట. కానీ పథకం ప్రకారం మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి బట్టల వ్యాపారం, టిఫిన్ సెంటర్లను ఫాస్ట్ఫుడ్ సెంటర్లను నడపడం ముసుగు కావచ్చు. బట్టల వ్యా పారం చేయడానికి మాత్రమే నై జీరియానుండి వచ్చి ఉండినట్టయితే నష్టం రాగానే మరో వ్యా పారం మొదలు పెట్టి ఉండేవా రు. మాదక వాణిజ్యానికి పూనుకోరు. బట్టల వ్యాపారులకు, తిం డి వర్తకులకు మాదక ద్రవ్యాలు ఎలా లభిస్తాయి? విస్తృతమైన వందల మంది పనిచేస్తున్న ముఠాలలో వీరు సభ్యులు కావచ్చు. పట్టుబడుతున్న వారు అతికొద్ది మంది, పట్టుబడనివారు ఎన్ని వందలమంది? ఈ మాదక పదార్థాలు హైదరాబాద్‌లోనో గోవాలోనో పుట్టుకొని రావడంలేదు. బయట దేశాలనుంచి సముద్ర మార్గం ద్వారాను, గగన మార్గం ద్వారాను వచ్చి పడుతుండవచ్చు. పాకిస్తాన్ నుంచి చైనా నుండి బంగ్లాదేశ్ నుండి చొరబడుతున్న వారు భూమార్గం గుండా కూడ మాదక విషాలను మనదేశంలోకి చేరవేస్తుండటం చరిత్ర..సముద్ర తీరంలో మన నౌకాదళాల గస్తీ బృందాలు నిరంతరం నిఘాను కొనసాగిస్తున్నారు. విమానాశ్రయాలలో పటిష్టంగా కూలంకషంగా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ దేశమంతటా మాదక ద్రవ్యాల బట్టీలు, గిడ్డంగులు ఎలా ఏర్పడిపోతున్నాయి?
మనదేశంలోని అసాంఘిక శక్తులు వివిధ ముఠాలుగా ఏర్పడి వివిధ రకాల నేరాలు జరుపుతున్నారు. వాటిలో మాదక పదార్థాల దొంగరవాణా ఒకటి. విదేశాలకు చెందిన ముఠాలు మాదక పదార్థాల సరఫరా మాత్రమే చేయడం లేదు. అనేక ఇతర నేరాలను కూడ కొనసాగిస్తున్నారు. ఈ స్వదేశీయ, విదేశీయ నేరస్థుల ముఠాల మధ్య అనుసంధానం ఏర్పడి ఉండడం కూడ దేశ భద్రతకు విఘాతకర విపరిణామం. మనదేశంలోని యువజనులను ఈ విపరిణామం పెడదారి పట్టిస్తోంది. వందల వేల సంఖ్యలో దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ లైంగిక బీభత్స ఘటనలను జరుగుతున్నాయి. ఇలా లైంగిక బీభత్సకారులుగా యువజనులు వికృతం కావడానకి పూర్వరంగం వారు మద్యపానానికి, ధూమపానానికి మాంస భక్షణకు గురి అవుతుండడం. వ్యాపారం, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వహణ, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వహణ, కళ, క్రీడ, చివరికి సమాజ సేవ వంటి ముసుగులను తగిలించుకున్న అసాంఘిక శక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో మాత్రమే కాదు, దేశమంతటా విస్తరించి ఉన్నారు. మన సమాజపు భౌతిక, మానసిక, బౌద్ధిక, సాంస్కృతిక భద్రతను ఛిద్రం చేస్తున్న ఇలాంటి నేరస్థులను మొగ్గ దశలోనే పసికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజలు విఫలమవుతున్నారు. ఉదయ్ కిరణ్ అనే చలనచిత్ర కళాకారుడు గత మార్చిలో మద్యం తాగి ఒక హోటల్లో బట్టలిప్పి నృత్యం చేశాడట.. అతణ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అతడు మాదక ద్రవ్యం రవాణా అభియోగాలకు, లైంగిక బీభత్స అభియోగాలకు గురి అయ్యాడు. ఒక సాంఘిక వ్యతిరేక చర్యతో మరో సాంఘిక నేరం ముడివడి ఉన్నదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతటా అసంఖ్యాక సాక్ష్యాలు పుట్టలుగా పగులుతున్నాయి, గుట్టలుగా పెరుగుతున్నాయి.
నైజీరియానుంచి వీసాలు తీసుకొని దేశానికి వస్తున్న వారు తమ ప్రయాణం గడువు ముగిసిన తరువాత ఇక్కడ ఉండిపోతున్నారట. భాగ్యనగరంలో ఇలాంటి వారు దండిగా ఉన్నారని గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రముఖంగా ప్రచారమైంది. వీరి మాదక ద్రవ్యాల వ్యాపారానికి రాజధాని మహానగరం మార్కెట్‌గా మారిందన్నది అప్పుడు జరిగిన ప్రచారం. మొత్తం అందరినీ ఏరివేయడంలోను, అరికట్టడంలోను ప్రభుత్వాల నిఘా విఫలవౌతోందనడానికి ఇది కూడ ఒక ఉదాహరణ. నైజీరియన్లు మాత్రమే కాదు, మరో ఆఫ్రికా దేశమైన సోమాలియా నుంచి కూడ ఈ మాదక వర్తకులు దిగుమతి అవుతున్నారు. పట్టుబడుతున్నారు. సోమాలియా సముద్రతీరం ఓడదొంగల స్థావరాలకు ఆలవాలం. ఈ ఓడదొంగలకు జిహాదీ ముఠాలకు మధ్య అనుసంధానం ఏర్పడి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగమైన ఐఎస్‌ఐ ఈ బీభత్స అనుసంధానాన్ని ఏర్పాటు చేసింది. సోమాలియానుం చి వచ్చిపడుతున్న మాదక విక్రేతలలో ఎంతమంది జిహాదీలు ఉన్నారన్నది సహజంగా ఉదయించే ప్రశ్న. గత సెప్టెంబర్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టయిన ఒక ఆఫ్రికా మహిళ శరీరంలో దాదాపు ముప్పయి లక్షల రూపాయల విలువ చేసే నాలుగు వందల గ్రాముల ‘కొకాయిన్’ తిత్తులు నిక్షిప్తమై ఉన్నట్టు వైద్యులు కనిపెట్టారు. వీటన్నింటినీ బయటకి లాగడానికి రెండు మూడు రోజులు పట్టిందట. ఇలా మహిళ తన శరీరంలో మాదక ద్రవ్యాలను నిక్షిప్తం చేసి అక్రమంగా రవాణా చేయడం అత్యంత జగుప్సాకరం. ఇంతకంటె భయంకరమైన జగుప్సాకరమైన పద్ధతులలో కూడ మత్తు విషాలు దేశంలోకి రవాణా అవుతున్నాయట...మానవ రూపంలోని పిశాచాలు విస్తరిస్తున్నాయి మరి.
ఇలామాదక బీభత్సం సృష్టిస్తున్న ఆఫ్రికన్లకు, పర్షియా సింధుశాఖ దేశాల వారికి యువతులను కట్టబెడుతున్న ముఠాలు కూడా హైదరాబాద్ లోను, దేశంలోను ఏర్పడి ఉన్నాయి. పెళ్లిళ్ల పేరుతో యువతులను బాలికలను అమ్మివేస్తున్నారు. ఇలా అమ్మే వికృతి మనదేశం వారికి శాతాబ్ది క్రితం వరకు తెలియని దురాచారం. శతాబ్దుల పాటు అరబ్ దేశాల జిహాదీలు, ఐరోపా ఓడ దొంగలు మాత్రమే ఇలా యువతులను బానిసలుగా అమ్మే ఘోరాలను జరిపారు. ఈ వికృతి మనదేశానికి కూడా దాపురించడం మన సంస్కృతిపై విదేశీయ అసాంఘిక శక్తులు చేస్తున్న దాడిలో భాగం..నైజీరియన్ల బెడద మనదేశంలో అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. 2013 నవంబర్‌లో గోవా ప్రభుత్వం వీసాలు లేకుండా దేశంలో చొరబడిన దాదాపు నలబయి మంది నైజీరియా పౌరులను అరెస్టు చేసింది. ఈ నేరస్థులందరినీ విడిచిపెట్టి తమ దేశానికి పంపించాలని నైజీరియా ప్రభుత్వం కోరింది. కానీ తమ దేశాలవారు మనదేశంలో ఇలా చొరబడకుండా ఆఫ్రికా ప్రభుత్వాలు నిరోధించడం లేదు..