సంపాదకీయం

జలాంతర్గాములకు చిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భద్రతా కుడ్యంలో కనిపించిన మరో కన్నం ఇది. క న్నం ఇప్పుడు కనిపించింది కాని రంధ్రాన్ని ఏళ్లక్రితమే ఏర్పాటుచేసారు. ఏర్పాటు చేసిన వారు మన దేశంవారు కాదన్న ది మన నౌకాదళం వారు చేసిన మహా నిర్ధారణ. విదేశీయులు ఈ మన భద్రత గోడను తవ్వి రంధ్రం ఏర్పాటు చేశారట! ఈ రం ధ్రం చిన్నది కాదు, ఇరవై రెండు వేల నాలుగు వందల పేజీల రక్ష ణ రహస్యాలను విదేశీయులు మోసుకెళ్లగలిగినంత పెద్దది. ఫ్రా న్స్‌కు చెందిన ఒక బహుళ జాతీయ వాణిజ్య బృహత్ సంస్థ డీసీయెనె్నస్స్ సాంకేతిక వ్యూహాత్మక సహకారంతో మన ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన జలాంతర్గాముల సమర పాటవం గురించి, స్వరూప స్వభావాల గురించి ఈ ఇరవై రెండు వేల నాలుగు వం దల పేజీల దస్త్రాలలో నిక్షిప్తమై ఉందట! జలాంతర్గామి సముద్ర గర్భంలో పయనించి శత్రువుల దాడిని ప్రతిఘటించగల రహస్య రక్షణ వాహనం. అందువల్ల దాని సమర పటిమ దాని రహస్య వి చారణ-శత్రువులు గుర్తించలేని రీతిలో పయనించడం-గరిమితో ముడివడి ఉంది. మన ప్రభుత్వం ఈ ఫ్రాన్స్‌కు చెందిన సంస్థతో అనుసంధాన ప్రక్రియ ద్వారా నిర్మించతలపెట్టిన స్కార్పెనెస్ ముద్రాంకితమైన మరింత రహస్య చారకమైన-స్టెల్త్-జలాంతర్గాముల సమాచారం ఏళ్ల క్రితమే రహస్యంగా బయటికి పొక్కిపోయిందన్నది ఇప్పుడు నిర్ధారణ జరిగిన రహస్యం...1999 జూ లైలో మన ప్రభుత్వం ఈ జలాంతర్గాముల నిర్మాణ ప్రక్రియకు అంకురార్పణ జరిపింది, ఫ్రాన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పదిహేడు ఏళ్ల జలాంతర్గాముల స్వరూప స్వభావా ల-డిఎన్‌ఏ-గురించి వేల పుటల రహస్య సమాచారం రూపొందింది. ఇలా రూపొందుతున్న స మయంలోనే మొత్తం రహస్యాలను బయటికి పొక్కించే స మాంతర ప్రక్రియ కూడ మొదలైందన్నది ఇప్పుడు జరిగిన ని ర్ధారణ. ఈ ఇరవై రెండు వేల నా లుగువందల పేజీల సమాచారం ఆస్ట్రేలియన్ అన్న పత్రిక వారు సంపాదించి బయటపెట్టారు. అందువల్ల రహస్య సమాచారం 2011 నాటికే అంతర్జాతీయ బహిరంగ రహస్యం అయిపోయింది. ఈ ఐదేళ్లలో ఇలా రహస్యాలు బయటికి పొక్కిన విషయం కూడ మన రక్షణ నిఘా వారికి తెలియకపోవడమే విచిత్రమైన వ్యవహారం. ఇప్పుడు ఆస్ట్రేలియన్ అన్న పత్రిక ఈ రహస్యాన్ని బయటపెట్టే వరకు మన రక్షణ నిఘా నిద్రపోయిందన్నది ఆందోళన కలిగిస్తున్న అతి పెద్ద ప్రమాదం. మనం కళ్లు మూసుకొని ఉన్నాము కనుక మనం ఇతరులకు కనిపించము అన్నరీతిలో మన రక్షణ నిఘా వ్యవహరించిందన్నది స్పష్టం! ఇప్పుడు బయటికి పొక్కిన సమాచారం 2011 నాటికి రూపొందినందువల్ల ఈ ఐదేళ్లలో జరిగిన మార్పు లు బయటికి పొక్కలేదన్న విచిత్ర వాదాన్ని నౌకాదళం వినిపిస్తుండడం విస్మయకరం...
ఈ బయటికి పొక్కించిన దుశ్చర్య మనదేశంలో ప్రారంభం కాలేదన్నది నౌకాదళానికి ఊరట కలిగిస్తున్న విచిత్ర సంతృప్తి! మన దేశంనుండి పొక్కలేదు కనుక మన నౌకాదళం కాని, రక్షణ శాఖలోని దోషులు లేరన్నది నౌకాదళం ఉన్నతోన్నత అధికారు లు మాటలలోని ధ్వని. ఇందుకు ధ్రువీకరణగా నౌకాదళం వారు అనేక వివరాలను ప్రచారం చేస్తున్నారు. ఈరహస్యాలు బయటి దేశాల ద్వారానే బయట పొక్కాయన్నది ధ్రువపడిన వాస్తవం. కానీ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? జరిగిన నష్టం గురించి ఆందోళనకు గురి కావాలి, నివారణ చర్యలకు నిరోధ చర్యలకు పూనుకోవాలి! కానీ నేరస్థులు విదేశీయులన్న సంతృప్తి వల్ల జరిగిన నష్టం పూడిపోతుందా? ఇలా సమాచారం బయటికి పొక్క డం గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు జరిపిస్తుందట! అందువల్ల సమాచారాన్ని బయటపెట్టిన విదేశీయులకు ఉప్పు అందించిన స్వదేశీయులు ఎవరైనా ఉన్నారా? అన్నది కూడ దర్యాప్తులో మాత్రమే వెల్లడి కావలసి ఉంది. అందువల్ల విదేశీయుల ద్వారా మాత్రమే విదేశాలనుంచి సమాచారం ప్రపంచానికి వెళ్లడయిపోయిందన్న నిర్ధారణ ఇప్పుడే చేయడం సరికాదు! ఫ్రాన్స్ కంపెనీ ప్రధాన దోషి కావచ్చు గాక...వెల్లడైన సమాచారం మొత్తం 2011 నాటికి రూపొంది ఉందట! అందువల్ల బయటికి పొక్కింది కేవలం పాతబడిన సమాచారం అన్నది నౌకాదళం వారి మరో ఆత్మవంచకమైన సంతృప్తి! ఈ ఐదేళ్లలో జలాంతర్గాముల నిర్మాణ రీతిలోను స్వరూప స్వభావాలలోను చాలా మా ర్పులు జరిగాయట! అందువల్ల కొత్త సమాచారం మాత్రం సురక్షితంగానే ఉందన్నది నౌకాదళం వారి నిర్ధారణ! 2011 వరకు జరిగిన నిర్మాణ ప్రగతిని గూర్చి సమాచారం సేకరించగలిగిన ఆ విదేశీయులు ఆ తరువాత మాత్రం మనసును మార్చుకుని మన రహస్యాలను సేకరించే కార్యక్రమానికి స్వస్తి చెప్పి ఉంటారా? 2011 తరువాత జరిగిన జలాంతర్గామి నిర్మాణం మార్పుల సమాచారం సైతం ఆ విదేశీయులకు అందలేదని ఎలా నిర్ధారించగలం? అంది ఉన్నప్పటికీ వారు ఇప్పుడు బయటపెట్టలేదేమో? 2011 నాటికి రూపొందిన సమాచారాన్ని ఐదేళ్ల తరువాత మాత్రమే ఆ విదేశీయులు ఆస్ట్రేలియన్ పత్రికకు అందచేసారు. అందువల్ల తరువాత కూడ వారు, ఆ విదేశీయులు మన రక్షణ సమాచారాన్ని సేకరించి ఉండినట్టయితే దాన్ని భవిష్యత్తులో బయటపెట్టరన్న హామీ ఏమీ లేదు...
మొత్తం ఇరవై నాలుగు జలాంతర్గాముల-సబ్‌మెరైన్స్- నిర్మా ణం కోసం మన ప్రభుత్వం 1999 జూలైలో మన ప్రభుత్వం ఈ ఫ్రాన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందట! మొదటి దశలో 2012 నాటికి పనె్నండు జ లాంతర్గాముల నిర్మాం పూ ర్తి కావలసి ఉండేది. కానీ 2012 నాటికి ఆరు జలాంతర్గాముల నిర్మాణపు నమూనాలు మాత్రమే రూపొందా యి. అందువల్ల ముప్పయి ఏళ్లలో-2000-2030- పూర్తి కావలసి ఉన్న జలాంతర్గాముల నిర్మాణ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందన్నది స్ప ష్టం కాలేదు. 2016 డిసెంబర్ నాటికి ఆరింటినీ రక్షణ కలాపాలకు వినియోగించడం ఆరంభం అవుతుందట! ఇప్పుడీ బయటికి పొక్కిన సమాచారం వల్ల ఇది సంభవం కాకపోవచ్చు. రక్షణ నిర్మాణాల విషయంలో సైతం సమయపాలన జరగకపోవడం ప్రభుత్వపు పని తీరును ఆవహించిన అలసత్వానికి దర్పణం! ఇలా రహస్యాలు బయటికి పొక్కడానికి ప్రస్తుత ప్రభుత్వం కారణమని కాంగ్రెస్ వారు అందిపుచ్చుకోవడం రామాయణంలోని మరో పిడకలవేట! 2011 నాటికే సమాచారం బయటికి పొక్కిం ది. అప్పుడు కేంద్రంలో అధికారం చెలాయించింది కాంగ్రెస్ వా రే...
వాణిజ్య బహుళ జాతీయ సంస్థలకు రక్షణ రంగ భాగస్వా మ్యం కట్టబెట్టడానికి ఏళ్ల తరబడి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ ఫ్రాన్స్ డీసీయెనె్నస్స్ సంస్థ రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టలేదు. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుతోంది. అయినప్పటికీ విదేశీయులకు ఈ రహస్యాలు వెల్లడైపోయాయి. అలాంటప్పుడు విదేశీయ సం స్థలు రక్షణ రంగంలో పెట్టుబడులను పెట్టి ఆయుధాలను, వాహనాలను, నిర్మించి పెట్టినట్టయితే మొత్తం మన రక్షణ స్వరూపం ప్రపంచానికి వెల్లడికాకుండా ఉంటుందా? రక్షణ రంగంలో విదేశీయ ప్రత్యక్ష నిధుల-ఎఫ్‌డిఏ-కు ప్రవేశం కల్పించాలన్న విధానానికి ప్రభుత్వం ఇప్పుడైనా స్వస్తి చెప్పాలి! ఆస్ట్రేలియన్ పత్రికకు చేరిన రహస్యాలు చైనాకు పాకిస్తాన్‌కు చేరి ఉండవచ్చునన్న సందేహం అతార్కికం కాజాలదు. మన దేశానికి ప్రస్తుతం దిగుమతి అయిన పదమూడు జలాంతర్గాములున్నాయి. అరిహంత అన్న ఒకే ఒక అణు జలాంతర్గామి ఉంది. చైనాకు యాబయి ఆరు జలాంతర్గాములున్నాయట. వీటిలో ఐదు అణు జలాంతర్గాములు...