సంపాదకీయం

సింగూర్ భూమికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్రాంతంలో సేకరించిన భూమిని తిరిగి యజమానులకు అప్పగించాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చెప్పిన తీర్పు వ్యవసాయానికి లభించిన చారిత్రక విజయం. హరిత శోభకు ప్రతీక అయిన వ్యవసాయానికి, హరిత హననానికి దోహదం చేస్తున్న అక్రమ పారిశ్రామిక విస్తరణకు దేశమంతటా కొనసాగుతున్న పోరాటాల గతిని ప్రభావితం చేయగల ఈ సర్వోన్నత సంచలన న్యాయ నిర్ణయం అధికాధిక ప్రజలకు హర్షం కలిగిస్తున్న పరిణామం. సింగూర్ అనగానే గుర్తుకు వచ్చేది పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు, సిపిఐఎం ఆధ్వర్యంలోని వామపక్ష కూటమి ప్రభుత్వానికి మధ్య ఐదేళ్లు నడిచిన పోరాటం. నిరుపేదల, వేలాది చిట్టి కమతాల యజమానుల వ్య వసాయ భూమిని లాక్కొని ‘టాటా మోటార్స్ నానో’ చిన్నకార్ల ఉత్పత్తి సంస్థకు కట్టబెట్టడానికి మార్క్సిస్టు ప్రభుత్వం నిర్ణయించడం సమరానికి శ్రీకారం. ప్రజల తరపున సింగూర్‌లో బలవంతపు సేకరణకు గురైన 997 ఎకరాల వ్యవసాయ భూమి యజమానుల తరపున తృణమూల్ కాంగ్రెస్ నడిపిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ప్రపంచీకరణ వేత్తలకు సింహస్వప్నం. ఈ స్వప్నం వాస్తవం కావడం మమతా బెనర్జీకి బెంగాల్‌లో అధికారాన్ని కట్టబెట్టిన చారిత్రక విజయం. సింగూర్ అనగానే పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ కూడ వెంటనే స్ఫురిస్తుంది. సింగూరులో టాటా కార్ల సంస్థకోసం వెయ్యి ఎకరాలను మాత్రమే సేకరించిన వామపక్ష కూటమి ప్రభుత్వం మిడ్నపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో పదివేల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించడానికి పూనుకొంది. ఈ నందిగ్రామ్ భూమిని ప్రత్యేక ఆర్థిక మం డలం-సెజ్-గా ఏర్పాటు చేసి ర సాయనాల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలన్నది లక్ష్యం. ఇండొనేసియాకు చెందిన ఒక బహుళజాతి వాణిజ్య సంస్థకు ఈ నందిగ్రామ్ భూమిని కట్టబెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కూడ తృణమూల్ కాంగ్రెస్ కార్యక్తలు, ప్రజలు అడ్డుకున్నారు. అయితే సింగూర్ కంటె నందిగ్రామ్‌లో అనేకరెట్లు ప్రభుత్వ హింసాకాండ జరగడం చరిత్ర. పోలీసులతోపాటు మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు సైతం ప్రజలను బీభత్సకాండకు గురిచేశారు. 2007 మార్చి 14న నందిగ్రామ్ వ్యవసాయ సీమలు పచ్చదనాన్ని కోల్పోయి రైతుల ఉద్యమకారుల రక్తంతో ఎర్రబారాయి. పోలీసులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో పదునాలుగు మంది మరణించగా, దాదాపు డెబ్బయిమంది క్షతగాత్రులు కావడం చరిత్ర...సింగూర్, నందిగ్రామ్ ఇలా చరిత్రలో ప్రజావ్యతిరేక ప్రభుత్వ దమనకాండకు శాశ్వత ప్రతీకలుగా నిలిచిపోయాయి. ఈ రెండు ప్రజావ్యతిరేక చర్యలవల్ల బెంగాల్‌లో వామకూటమి పరాజయంపాలైంది. 2011లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 1977 నుంచి ఆగిన మార్క్సిస్టు పాల న ముగిసింది.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడం వాణిజ్య ప్రపంచీకరణ కర్తలకు గొప్ప గుణపాఠం...
ఈ గుణపాఠాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు మరోసారి ధ్రువీకరించింది. దేశమంతటా భూమిని విచ్చలవిడిగా సేకరించి ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకోవలసిన గుణపాఠం ఇది. 1894 నాటి, బ్రిటన్ సామ్రాజ్యవాదులు రూపొందించిన, భూమి సేకరణ చట్టం అమలులో ఉం డిన సమయంలోనే పశ్చిమ బెంగాల్‌లోని వామకూటమి ఫ్రభు త్వం సింగూర్ వద్ద భూమిని సేకరించింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సెజ్ శాసనం కూడ అమల్లోకి వచ్చిం ది. సర్వోన్నత న్యాయస్థానం పదేపదే గుర్తు చేసిన తరువాత, హెచ్చరించిన తరువాత మాత్రమే 2013లో కేంద్రం కొత్త భూమి సేకరణ చట్టాన్ని రూపొందించింది. కొత్త చట్టం ప్రకారం 1984నాటి చట్టం రద్దయింది. కొత్తచట్టం ప్రకారం ఒక గ్రామానికి లేదా పంచాయతీ విభాగానికి చెందిన డెబ్బయి శాతం భూమి యజమానులు అనుమతి నిచ్చిన తరువాత మాత్రమే సార్వజనహితంకోసం ప్రభుత్వాలు వ్యవసాయ భూమిని సేకరించడానికి వీలుంది. ప్రభుత్వేతర సంస్థలకు కట్టబెట్టడం కోసం భూమిని సేకరించినట్టయితే ఎనబయిశాతం భూమి యజమానులు తమ అంగీకారాన్ని తెలుపవలసి ఉంది. అయితే ఒక ప్రభుత్వేతర సంస్థ-కంపెనీ- కోసం భూమిని సేకరించడం ప్రజాహిత సాధనలో భాగం కాదన్నది బుధవారం సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు. 2006లో బెంగాల్ ప్రభుత్వం సేకరించిన నాటికి 1894నాటి చట్టమే అమల్లో ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు ఇప్పుడు చేసిన ఈ నిర్థారణ కొత్త సేకరణ చట్టం క్రింద జరిగే సేకరణలకు వర్తిస్తుందా? అన్నది స్పష్టం కావలసి ఉంది. వర్తించినట్టయితే ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకోసం ప్రభుత్వాలు వేల, లక్షల ఎకరాల భూమిని సేకరించే వైపరీత్యం తొలగిపోతుంది...
ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు, ప్రధానంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు స్వీయ లాభం పరమావధిగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు ప్రజాసేవ చేయడంలేదు. అందువల్ల ఈ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఎందుకని భూమిని సేకరించిపెట్టాలన్నది దేశ ప్రజలను నిరంతరం వేధిస్తున్న సమస్య. ఈప్రభుత్వేతర సంస్థలు తమకు అవసరమైన భూమిని న్యాయమైన ధరలను చెల్లించి యజమానులను ఒప్పించి తమంత తాము కొనుక్కోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వేతర వాణిజ్య పారిశ్రామిక బృందాలకు ప్రతినిధులుగా మారడమే వివిధ వైపరీత్యాను సృష్టిస్తున్న స మస్య. సింగూర్‌లో జరిగిన భూమి సేకరణ ఒక ఉదాహరణ మాత్రమే. 2006లో తమ చిన్నకార్ల కర్మాగారాన్ని సింగూర్‌లో ఏర్పాటు చేయాలని టాటా సంస్థ నిర్ణయించింది. 2006 డిసెంబర్ నుంచి పశ్చిమ బెం గాల్ ప్రభుత్వం భూమి సేకరణ మొదలు పెట్టింది. సమాంతరంగా మమతా దీదీ నాయకత్వంలో సేకరణ వ్యతిరేక ఉద్యమం మొదలైపోయింది. 2008 జనవరిలో కలకత్తా హైకోర్టువారు ఈ సేకరణను సమర్థించారు. ఫలితంగా భూమిసేకరణకు వ్యతిరేకంగా మమతమ్మ సింగూర్‌లో నిరవధిక నిరనస ఉద్యమం ఆరంభించింది. ప్రజాగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లడంతో టాటా వారు తమ కార్ల ఉత్పాదక కర్మాగారాన్ని సింగూర్‌లో ఏర్పాటు చేయరాదని నిర్ణయించుకున్నారు. కానీ భూమి మాత్రం మళ్లీ రైతులకు దక్కలేదు. 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలను రైతులకు తిరిగి అప్పగించాలని నిర్ణయించింది. ఈ తిరిగి అప్పగింతను వ్యతిరేకిస్తూ టాటా కంపెనీ న్యాయస్థానానికెక్కింది. దానివల్ల రైతులకు ఇప్పుడు మరింత విస్తృత ప్రయోజనం చేకూరింది. టాటా యజమానులు నాలుకలు కరుచుకోవాలి.
బలవంతంగా సేకరించిన నాలుగువందల ఎకరాలను రైతులకు తిరిగి ఇస్తామని, మిగిలిన ఆరువందల ఎకరాలలో టాటావారు ఫ్యాక్టరీని కట్టుకోవచ్చని 2011 మే 20న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కానీ టాటావారు మొత్తం వెయ్యి ఎకరాలు తమకే దక్కాలన్న అత్యాశకు పోయారు. దురాశ దుఃఖమునకు కారణమైంది. మొత్తం భూమిని రైతులకు అప్పగించాలని సర్వోన్నత న్యాయమూర్తులు వి. గోపాలగౌడ, అరుణ మిశ్రాలు చెప్పిన తీర్పు బహుళ జాతీయ వాణిజ్య విధానకర్తలకు చెంపపెట్టు. రైతులు తాము పొందిన పరిహారపు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి కాని, టాటా సంస్థకు కాని చెల్లించేపనిలేదు. ఎందుకంటె వారు పదేళ్లపాటు భూమికి, వ్యవసాయానికి దూరమయ్యారు...ఇదీ సర్వోన్నత న్యాయ నిర్ణయం.