సంపాదకీయం

కశ్మీర్‌లో చైనా ‘నడవ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవునుంచి సింకియాంగ్ లోని కష్‌గర్ వరకు చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న పారిశ్రామిక ప్రాంగణ పథం పథకాన్ని దురాక్రమిత కశ్మీర్‌లో అమలు జరపరాదన్నది నాలుగేళ్లకు పైగా మన ప్రభుత్వం చేస్తున్న వాదం. ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రముఖ దేశాల-గ్రూప్ 20- ప్రభుత్వాధినేతల సమావేశం సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్‌తో జరిపిన చర్చలలో కూడ ఈ సంగతి ప్రస్థావనకు వచ్చింది. మన మాటలను చైనా కాని పాకిస్తాన్ కాని పట్టించుకోవడం లేదనడానికి రెండు వేల కిలోమీటర్ల పొడవునా ఈ చైనా పాకిస్తాన్ వాణిజ్యపు నడవ-చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్-సిపిఇసి-లో వివిధ పారిశ్రామిక నిర్మాణాలు ఊపందుకొనడమే సాక్ష్యం! పాకిస్తాన్ దురాక్రమిత జమ్ము కశ్మీర్‌లోని కొంత భాగం చైనా అక్రమ అధీనంలో ఉండడం 1963 నుంచి కొనసాగుతున్న వైపరీత్యం! ఈ దురాక్రమణను క్రమబద్ధీకరణ చేసుకొనడంలో భాగంగా పాకిస్తాన్ చైనాలు ఉమ్మడిగా ఈ కారిడార్ నిర్మాణాలను తలపెట్టాయి. గ్వాడార్ బలూచిస్తాన్‌లో ఉంది. 1948లో బలూచిస్తాన్ ప్రాంతంలోని నాలుగు స్వదేశీయ సంస్థానాలను పాకిస్తాన్ కలుపుకున్నప్పటికీ గ్వాడార్ మాత్రం 1958 వరకు ఓమన్ దేశానికి వలసగా ఉండడం చరిత్ర. అఖండ భారత్‌లోని గ్వాడార్ రేవు పర్షియా సింధు శాఖకు దక్షిణంగా ఉన్న ఓమన్‌లో కలిసిపోవడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం. మళ్లీ బ్రిటన్ మధ్యవర్తిత్వం కారణంగానే ఓమన్ ప్రభుత్వం గ్వాడార్ రేవును పాకిస్తాన్‌కు 1958లో అమ్మిం ది. అప్పటినుంచి ఇప్పటి వరకు బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో ఇమడలేకపోతోంది. సువిశాలమైన భూభాగం ఉన్న బలూచిస్తాన్‌లో జనసాంద్రత చాలా తక్కువగా ఉంది. అందువల్ల టిటెట్‌లోని ప్రాకృతిక సంపదను చైనా ప్రభుత్వం కొల్లగొడుతున్నట్టుగానే బలూచిస్తాన్‌లోని సహజ సంపదను ప్రధానంగా ఖనిజాలను, ఇంధన వాయు నిక్షేపాలను కొల్లగొట్టడం పాకిస్తాన్ ప్రభుత్వ లక్ష్యం. ఇలా కొల్లగొట్టడాన్ని నిరసించిన బలూచీ ప్రజలపై పాకిస్తాన్ సైనిక ప్రభుత్వాలు 1948 నుంచి కూడ దమనకాండ జరిపించాయ. ఈ దమనకాండ ఫలితంగానే ప్రతిక్రియాత్మకంగా బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమం ఇటీవలి కాలంలోమరింత విస్తృతమైపోయింది. పదేళ్ల క్రితం గ్వాడార్ ఓడరేవు అభివృద్ధి చేయడం పేరుతో చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో తిష్ఠవేసింది! బలూచీ ప్రజలు ఈ చైనా తిష్ఠను అప్పటినుంచి ఇప్పటివరకు నిరసిస్తూనే ఉన్నారు. ఈ నిరసన భౌతిక బీభత్సం రూపం ధరించవచ్చునన్నది చైనా ప్రభుత్వం అనుమానం...
సిపిఇసి నిర్మాణం జంట లక్ష్యాలకు ప్రాతిపదిక. మొదటిది పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్-పిఓకెపై చైనా పాకిస్తాన్‌ల పట్టును శాశ్వతం చేయడం, రెండవది బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడంలో పాకిస్తాన్‌కు చైనా సహాయాన్ని వ్యవస్థీకరించడం. గ్వాడార్‌ను యుద్ధనౌకలు తిష్ఠ వేయడానికి, సమర కలాపాలు సాగించడానికి వీలైన సైనిక స్థావరంగా చైనా రూపొందించగలిగింది. పర్షియా సింధుశాఖ, ఓమన్ సింధుశాఖ, యాడెన్ సింధుశాఖ, అరేబియా సముద్ర ప్రాంతాలలో ఓడదొంగలను అరికట్టడం కోసమే గ్వాడార్‌లో తిష్ఠవేసినట్టు చైనా చెప్పిన సాకు. గ్వాడార్ కేంద్రంగా పాకిస్తాన్ చైనా నౌకలు ఉమ్మడి గస్తీ తిరుగుతున్నాయి. కానీ ఈ రెండు దేశాల అసలు లక్ష్యం మన దేశపు పడమటి సముద్ర తీరంపై నిఘా వేసి ఉంచడం. 1947 అక్టోబర్‌నుంచి కూడ మూడో వంతు జమ్ము కశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతోంది. ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల ఈ భూభాగంపై అనేక ఏళ్లుగా చైనా పాకిస్తాన్‌ల ఉమ్మడి పెత్తనం కొనసాగుతోంది. ఎప్పటికైనా మన జమ్ము కశ్మీర్ మొత్తం మన దేశానికి దక్కుతుందన్నది పాకిస్తాన్ భయం. అందువల్ల చైనాను కూడ దురాక్రమిత కశ్మీర్‌లో చేర్చ డం ద్వారా అలా దక్కకుండా చేయాలన్నది పాకిస్తాన్ వ్యూ హం! ఈ వ్యూహం చైనాకు సైతం అనుకూలంగా ఉంది, మన ఉత్తర సరిహద్దులలో తన సైనిక దళాల ఉనికిని పటిష్ఠం చేసుకొనడానికి చైనాకు ఈ ఉమ్మడి వ్యూహం ఉపకరిస్తోంది!
చైనా ప్రభుత్వం టిబెట్‌ను 1959 నాటికి పూర్తిగా దురాక్రమించింది. 1959కి పూర్వం 1949నుంచి కూడ చైనా టిటెట్‌లోను, మన జమ్ము కశ్మీర్‌లోను సమాంతరంగా చొరబడింది. టిబెట్ పూర్తిగా కబ్జా చేసే నాటికి జమ్ము కశ్మీర్‌లో తూర్పు ఈశాన్య ప్రాంతంలోని ముప్పయి తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా కాజేసింది! 1962 నాటి దురాక్రమణ తరువాత జమ్ము కశ్మీర్‌లోని ఈ లడక్ ప్రాంతంపై చైనా వారి తిష్ఠ స్థిరపడింది. జమ్ము కశ్మీర్ ఉత్తరంగా విస్తరించి ఉన్న సింకియాంగ్ ఒకప్పుడు తూర్పు తుర్కిస్తాన్. ఇస్లాం మతం వ్యాపించక పూర్వం ఈ తుర్కిస్తాన్ హూణ దేశంగా ఉండేది, అక్కడ బౌద్ధ వైదిక మతాలు హిందూ సంస్కృతి విస్తరించి ఉండేది. జిహాదీలు హూణ దేశాన్ని ఆక్రమించి తుర్కిస్తాన్‌గా మార్చారు. ఈ తుర్కిస్తాన్‌కు చైనాకు మధ్య శతాబ్దులపాటు సంఘర్షణలు జరిగాయి. క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దం చివరలో చైనా తుర్కిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకుని సింకియాంగ్‌గా పేరు మార్చింది. సింకియాంగ్ అన్నది చైనీయ భాషలోని ఝింజియాంగ్‌నకు పాశ్చాత్యులు పెట్టుకున్న పేరు. ఇలా ఝింజియాంగ్, టిబెట్ రెండు స్వతంత్ర దేశాలు. ఈ రెండింటిని కబళించిన తరువాత వీటిని కలుపుతూ రహదారులను రైలు మార్గాలను నిర్మించడానికై చైనా పూనుకుంది! కానీ ఈ మార్గాలకు మన జమ్ము కశ్మీర్‌లోని లడక్, కారాకోరమ్ ప్రాంతాలు అడ్డువచ్చాయి. అందువల్ల లడక్‌ను చైనా స్వయంగా దురాక్రమించింది. తన అక్రమ అధీనంలోని కారాకోరమ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం 1063లో చైనాకు అప్పగించింది!
ఇలా దురాక్రమిత జమ్ముకశ్మీర్ వివాదాం కేవలం పాకిస్తాన్‌తో మాత్రమే ముడివడి లేదు. పాకిస్తాన్ చైనా దేశాల ఉమ్మడి దురాక్రమణను మనం తొలగించినప్పుడు మాత్రమే జమ్ము కశ్మీర్ సర్వసమగ్రంగా మళ్లీ మనదేశంలో విలీనమవుతుంది. ఈ విలీనాన్ని నిరోధించడంలో భాగంగానే చైనా పిఓకేలోకి ఐదేళ్ల క్రితమే పదమూడు వేలమంది సైనికులను పంపించింది. అప్పుడు కూడ మన ప్రభుత్వం నిరసనలను ప్రకటించి తరువాత ఆ సంగతిని మరచిపోయింది! ఇప్పుడు దాదాపు ఏడువేలమంది చైనీయ ఉద్యోగులు, అధికారులు నిర్విరామంగా గ్వాడార్-కష్‌గర్ నడవలో నిర్మాణాలను సాగిస్తున్నారు. మూడు వందల యాభయి పారిశ్రామిక వాటికలను ఈ రెండు వేల కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వ స్వయంగా జాతీయ శాసనసభలో ఇటీవల ఈ సంగతిని ప్రకటించింది. చైనా ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాలపై దాదాపు మూడు లక్షలకోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. అటు బలూచిస్తాన్‌లోను ఇటు గిల్జిత్ బాల్తిస్తాన్ ప్రాంతాలలోను పాకిస్తానీయులను అధిక సంఖ్యలో నింపడానికి ఈ కారిడార్ దోహదం చేయగలదు. ఇటీవల ఉత్తర కశ్మీర్ ప్రాంతాలయిన గిల్జిత్ బాల్తిస్తాన్‌లలో నిరసనలు చెలరేగడానికి కూడ ఈ కారిడార్ కారణం. నిరసనల వల్ల ప్రయోజనం శూన్యం. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో చైనాకు వ్యతిరేకంగా వివాదాన్ని దాఖలు చేసి కారిడార్‌ను ఆపించడానికి మన ప్రభుత్వం యత్నించాలి.