సంపాదకీయం

బలపడిన బలూచీలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు బ్రహమ్ దహ్ బుగ్తీ మనదేశంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించడం అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి లభించిన వ్యూహాత్మక విజయం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదానికి బలవుతున్న వారందరూ సంఘటితం అవుతున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న బ్రహమ్‌దహ్ బుగ్తీ కుటుంబం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు మూడు తరాలపాటు బలైంది. 1948లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచీస్థాన్ ప్రాంతంలోని నాలుగు సంస్థానాలను బలవంతంగా తమ దేశంలో కలుపుకున్నప్పటినుంచి బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఈ స్వాతంత్య్ర సమర జ్వాలలు నాలుగుసార్లు తీవ్రంగా చెలరేగాయి. 1958లోను, 1962, 1963వ సంవత్సరాలలోను బలూచీ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఈ ఉద్యమాలను పాకిస్తాన్ సైనిక ప్రభుత్వాలు అణచివేశాయి. 1973 నుంచి 1977 వరకు మరోసారి చెలరేగిన స్వాతంత్య్ర సమర జ్వాలలను కూడ పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్పివేసింది. 2004లో మళ్లీ మొదలైన బలూచీ ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగవసారి చెలరేగిన ఉద్యమకాలంలో పదేళ్ల క్రితం బలూచీ సమరయోధుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీని పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం హత్య చేసింది. ఈ హత్యాసమయంలో జనరల్ పరవేజ్ ముషారఫ్ పాకిస్తాన్ నియంత. ముషారఫ్ పదవీచ్యుతి తరువాత యూసఫ్ రజా జిలానీ ప్రధాన మంత్రిత్వంలోని ప్రభుత్వం ముషారఫ్‌పై హత్యాభియోగాన్ని మో పింది. కానీ పౌర ప్రభుత్వం సైనిక ఆధిపత్యానికి లోబడి పనిచేస్తుండడం పాకిస్తాన్‌లోని ప్రజాస్వామ్య నాటక ప్రధాన లక్షణం. అందువల్లనే పాలకులు ఎవ్వరైనప్పటికీ బలూచీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణగదొక్కాలన్న విధానాన్ని సైన్యం అమలు చేస్తూనే ఉంది. అందువల్ల సైనిక దళాల ఆజమాయిషీకి లోబడి తీర్పులిస్తున్న పాకిస్తాన్ న్యాయస్థానాలు పరెవెజ్ ముషారఫ్‌ను నిర్దోషిగా నిర్ధారించాయి. అలా బలూచీస్థాన్ స్వాతంత్య్రం కోసం అమరుడైన నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మనుమడు ప్రస్తుతం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బ్రహమ్‌దహ్ బుగ్తీ..ఆయన నాయకత్వంలోని బలూచీస్థాన్ రిపబ్లికన్ పార్టీ-బిఆర్‌పి- అనేక విదేశాలలో తమ స్వాతంత్య్రం కోసం కృషి చేస్తోంది.
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్రదినోత్సవంనాడు మన ప్రధాని ఎఱ్ఱకోట నుంచి చేసిన ప్రసంగంలో బలూచీస్థాన్‌ను ప్రస్తావించారు. నెలరోజులకు పైగా విశ్వవ్యాప్తంగా బలూచీస్థాన్ గురించి చర్చించడానికి, ప్రచారం కావడానికి ఈ ప్రస్థావన నేపథ్యం. జమ్మూకశ్మీర్‌లో జరగని మానవాధికారాల ఉల్లంఘన జరిగినట్టుగా ఏళ్లతరబడి ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర దేశాలతో తన అబద్ధాలను నమ్మించలేకపోతోంది. కానీ నరేంద్ర మోదీ బలూచీస్థాన్ పేరు చెప్పిన వెంటనే బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. విశ్వవ్యాప్తంగా వినూతన బలం లభిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో సైతం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు నిరసనలు ఎదురుకావడం బలూచీ స్వాతంత్య్ర ఉద్యమానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. అందువల్ల పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకారుల వల్ల బ్రహమ్ బుగ్తీకి ప్రమాదం ఏర్పడింది. ఇలా ప్రమాదం ఏర్పడినందువల్లనే తమ అధినేత బ్రహమ్ బుగ్తీ భారతదేశంలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నాడని బిఆర్‌పి ప్రతినిధి అఝీ జిల్లా బుగ్తీ జెనివాలో తెలపడం పాకిస్తాన్ బీభత్స వ్యూహం విస్తరిస్తోందనడానికి నిదర్శనం. భారత్ మద్దతును ఇవ్వగానే పాకిస్తాన్ భయంకర దమనకాండ నుండి బంగ్లాదేశ్ విముక్త కాగలిగింది. అందు బలూచీస్థాన్ కూడ స్వతంత్య్ర దేశంగా అవతరించడం ఖాయమన్న భయం పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టుకొంది. అందువల్లనే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు బలూచీ నాయకులపై పెద్ద ఎత్తున దాడులు చేయడానికి పూనుకుంటున్నారు. మరోవైపు నరేంద్రమోదీ ప్రసంగం పట్ల హర్షం ప్రకటించిన బలూచీ నాయకులపై పాకిస్తాన్ ప్రభుత్వం దేశద్రోహం అభియోగాలను మోపి న్యాయస్థానాలలో కేసులు పెట్టింది. బ్రహమ్ బుగ్తీని మరో ఇద్దరు ఉద్యమ అగ్రనేతలకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయట. బ్రహమ్ బుగ్తీ మనదేశంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించడానికి ఇదంతా నేపథ్యం. మనదేశపు గుర్తింపు పత్రం తనకు ఇవ్వాలని సెప్టెంబరు నాలుగవ తేదీన అభ్యర్థించిన బుగ్తీ ఇప్పుడు మనదేశంలో స్థిరపడాలని భావిస్తున్నాడు. సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ ఉన్న పరిణిత ప్రజాస్వామ్యమైన మనదేశం తమకు సురక్షితమైనదని బలూచీ ఉద్యమకారులు భావించడం సహజం...
మనదేశంతో బలూచీస్థాన్ అనుబంధం ఇప్పటిది కాదు. అతి ప్రాచీన కాలం నుండి బలూచీస్థాన్ భారతదేశంలో భాగం. భారతీయ సంస్కృతిని ఆ తరువాత పాశ్చాత్యుల దురాక్రమణ సమయంలో బలూచీస్థాన్ అనేకమైన ముక్కలుగా మారింది. బలూచిస్థాన్‌లో గ్వాదార్ ఓడరేవు ఓమన్ దేశపు ఆధీనంలోకి పోయింది. లక్షా ముప్పయివేల చదరపు మైళ్ల బలూచీస్థాన్ అఖండ భారత్‌లోని పశ్చిమ ప్రాంతం. బలూచీస్థాన్‌కు పశ్చిమంగా ఒకప్పటి పారశీక దేశమైన ఇరాన్ నెలకొని ఉంది. మతం ప్రాతిపదికగా అఖండ భారత్‌ను విభజించాలన్న ముస్లీంలీగ్ ప్రతిపాదనను బలూచీస్థాన్ ప్రజలు సమర్థించలేదు. వాయువ్య సరిహద్దు ప్రాంతం ప్రజలు సమర్థించలేదు. అందువల్లనే బలూచీస్థాన్ లేని పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసుకొనడానికి ముస్లీంలీగ్ అధినాయకుడు మహమ్మదాలీ జిన్నా సిద్ధపడినాడు. అఖండ భారత్ దేశ విభజనను బలూచిస్థాన్, వాయువ్య సరిహద్దు ప్రాంతం ప్రజలు వ్యతిరేకించడం ఇలా చారిత్రక సత్యం. కానీ 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడిన తరువాత జిన్నా విధానం మారిపోయింది. బలూచీస్థాన్‌లోని నాలుగు సంస్థానాలను బెదిరించి పాకిస్తాన్‌లో కలుపుకున్నాడు. ఒక సంస్థానాన్ని సైనిక చర్యద్వారా స్వాధీనం చేసుకున్నారు. 1958గ్వాదార్ ఓడరేవును ఓమన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు అప్పగించింది..
టిబెట్‌లోని అపారమైన ప్రాకృతిక సంపదను చైనా కొల్లగొతున్నది. బలూచీస్థాన్‌లోని ప్రాకృతిక సంపదను పాకిస్తాన్ కొల్లగొడుతోంది. అంతేకాదు పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధు ప్రాంతాల వారు అధిక సంఖ్యలో వెళ్లి బలూచీస్థాన్‌లో స్థిరపడి పెత్తనం చేయడానికి వీలుగా పాకిస్తాన్, చైనాలు ఉమ్మడిగా రంగాన్ని సిద్ధం చేశాయి. గ్వాదార్ సింకియాంగ్ లోనే కష్‌గర్ వరకూ పాకిస్తాన్ పొడవునా చైనా ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని కూడ బలూచీ ప్రజలు నిరసిస్తున్నారు. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాలు కూడ బలూచీ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతునిస్తున్నాయి.