ఉత్తరాయణం

హెల్త్ కార్డులకు మోక్షమెప్పుడో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ఉద్యోగస్తులకు, పెన్షనుదారులకు ఐదారు నెలలక్రితమే హెల్త్‌కార్డులు ఇచ్చినప్పటికీ వానికి ఇంతవరకూ మోక్షానికి నోచుకోలేదు. ఇంతవరకు ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆ కార్డులకు విలువ ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరిపాలనకు విలువలేనపుడు సా మాన్యుని గతేమిటి? కావున ముఖ్యమంత్రిగారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకొని సంబంధిత వివిధ ఆసుప త్రుల యాజమాన్యాలకు తక్షణమే ఉత్తర్వులు జారీచేసి నిరాశకు గురైన ఉద్యోగస్తులను, పెన్షనుదారులను ఆదుకొని ఆదర్శంగా ఉండగలరని పదే పదే కోరుతున్నాం.
- సామినేని ప్రకాశరావు, హైదరాబాద్

భావస్వేచ్ఛకు పరిమితి ఉండాలి
రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛ తరచుగా దుర్వినియోగానికి గురవుతోంది. దేశ సార్వభౌమాధికారం, రాజ్యాంగం విలువలు, సర్వమత సమానత్వం వంటి అంశాలపై ఈమధ్య ఇష్టారాజ్యంగా మాట్లాడడం, పత్రికా ప్రకటనలు యివ్వడం, సోషల్ మీడియాలో కారుకూతలు కూయడం అలవాటైపోయింది. దీనికి పరాకాష్ట జె.ఎన్.యు సంఘటన. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు ప్రతిస్పందిస్తే వారిపై యాజమాన్యం చర్యలు తీసుకుంటే తప్పేమిటి? ఉగ్రవాదులు, శత్రు దేశాలకు అనుకూలంగా నినాదాలు చెయ్యడమేమిటి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్నందుకు విపక్షాలు అరిచి, గీపెట్టి, రాద్ధాంతం చేయడం అసంబద్ధం. భావస్వేచ్ఛకు పరిమితులు చాలా అవసరం. దేశ భద్రతపై, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా విద్యార్థుల భావజాలం వుండడం చాలా ప్రమాదకరం. అసమాన త్యాగానికి నిదర్శనమైన భారత సైనికులను అవమానపరిచే విధంగా ప్రవర్తించే వారిపై ఏ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

రైల్వేవారి దోపిడీ
రైళ్ళల్లో రిజర్వేషన్ చేయించుకున్న బెర్తులను ఏ కారణం చేతనో కాన్సిల్ చేసుకుంటే మొత్తం టిక్కెట్ ధరలో తొంభై శాతం కోత కోసి మిగిలిన ముప్ఫైశాతం చెల్లిస్తున్నారు. ప్రిమియమ్ రైళ్ళల్లోనూ, తత్కాల్ టిక్కెట్లను కాన్సిల్ చేస్తే వచ్చేదేమీ ఉండదు. పండుగ సీజన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్టు పది నుంచి ఇరవైకి పెంచుతున్నారు. రైళ్ళలో సేఫ్టీ కరువవుతున్నది. టాయిలెట్లు శుభ్రంగా ఉం డవు. సగం దూరం పోయాక అందులో నీళ్ళుండవు. రైలు పెట్టెలు తుప్పుపట్టపోయుంటాయి. రిజర్వేషను కంపార్టుమెంట్లలో అనధికార ప్రయాణికులు ఎక్కువవుతున్నారు. ప్రయాణికుల ముక్కుపిండి వసూలుచేస్తున్న డబ్బంతా ఏమవుతున్నది?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

పక్షపాత నిర్ణయాలు
యంపి గాని ఎమ్మెల్యే గాని పార్టీ మారితే అది చెల్లని విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని ఒక పాఠకుడు అ న్నారు. అయితే రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మంది సమ్మతి దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం శాసనసభల ఆమోదం ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యంకాదు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసే చట్టం రాజీవ్‌గాంధీ తెచ్చారు గాని దానిలో కావాలనే రెండు లొసుగులు పెట్టారు. నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కి ఇచ్చి, గడువు నిర్ణయించలేదు. స్పీకర్ పాలక పార్టీవాడే ఉంటాడు. అందువల్ల పక్షపాత నిర్ణయాలే వచ్చి పార్టీలు మారడం యదేచ్ఛగా సాగుతోంది.
- శాండోప్రచండ్, శ్రీనగర్

అనుచిత వత్తాసు
రాష్టప్రతి మళ్లీ అన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఆయన మళ్లీ మళ్లీ అంటూనే వున్నారు. ఆయన కాదు, ఆయనలోని కాంగ్రెస్ ఆత్మ అలా అనిపిస్తోందేమో. ఓ వంద మంది రాజకీయ ప్రేరితులు వినతిపత్రం సమర్పిస్తే అది నిజమని నమ్మేసి వత్తాసు పలకడం ఏమిటి? దేశ ప్రతినిధిగా ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతున్నదని ఆయన బాకా ఊదడం ఏమిటి? న్యాయమూర్తి స్థానంలో ఉన్న ఆయన రెండు వైపులా వినాలి కదా. అది మానేసి ఉపన్యాసాలివ్వడం ఏమిటి?
- శాండీ, కాకినాడ

ప్రత్యక్ష ప్రసారాలు వద్దు
టి.విలో అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు చూపకపోవటమే మంచిది. అధికార ప్రతిపక్షాలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాయి. తమ ఆవేశకావేశాలు టీ.విలలో ప్రజలు చూస్తున్నారనే ఆనందంలో అన్ని పార్టీలవారు అయినదానికి కాని దానికి పిచ్చిపిచ్చి విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అందువల్ల ఈ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం వున్నది.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ