సంపాదకీయం

సమాజ్‌వాదీ సమరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ములాయం సింగ్ ప్రాధాన్యం ముగింపునకు రావడం కుటుంబ కలహానికి పరాకాష్ఠ. ‘సైకిల్’ గుర్తు ‘సమాజ్‌వాదీ పార్టీ’- సపా- లోని అఖిలేశ్ యాదవ్ వర్గానికి దక్కడం ‘ప్రతీక’ మాత్రమే.. ‘సపా’లో చీలిక ఆధికారికంగా వ్యవస్థీకృతం కావడం ప్రధాన పరిణామం. 1990వ దశకం ఆరంభంలో ‘సపా’ను ఆరంభించిన నాటినుంచి పార్టీ వ్యవహారాలను కుటుంబ వ్యవహారంగా మార్చగలిగిన ములాయం సింగ్ కుటుంబ కలహం కారణంగానే పతనం కావడం ఆశ్చర్యకరం కాదు. కుటుంబ ఆధిపత్యాన్ని పార్టీ నెత్తిన రుద్దిన రాజకీయవేత్తలందరికీ దేశవ్యాప్తంగా ఇలాంటి ‘నిష్క్రమణ’ లేదా పదవీచ్యుతి సంభవించడం చరిత్ర. కొన్ని పార్టీలలో తనయులు, అల్లుళ్లు, బంధువులు సహజంగానే అధినేతకు వారసులయ్యారు. మరికొన్ని పార్టీలలో అసహజంగా అకాలంలో అధినేతలు తొలగిపోవలసి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ‘తెలుగుదేశం’లో, తమిళనాడులోని ద్రవిడ మునె్నత్ర కజగంలో, కర్నాటకలోని ‘సెక్యులర్’ జనతాదళ్‌లో, కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్‌లో, బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్‌లో ఇ లాంటి సహజ, అసహజ పతనాలు గతంలో అధినేతలకు సంభవించాయి. ఇప్పుడు కూడ సంభవిస్తున్నాయి. అందువల్ల ము లాయం సింగ్ నుండి పార్టీ అధినాయకత్వాన్ని అఖిలేశ్ యాదవ్ లాక్కొనడం ఏ మంత ఆశ్చర్యకరం కాదు. కొత్తనీరు వచ్చి పాత నీటిని పారదోలడం కొత్త విషయం కాదు. వయోవృద్ధనేత ఇంత త్వరగా పార్టీలో ప్రాబల్యం కోల్పోవడం మాత్రమే నాటకంలోని ఊహించని మలుపు! ఈ ‘మలుపు’కోసం ఉత్కంఠతో ఎదురుచూసిన ‘కాంగ్రెస్’ సైతం ఇంత త్వరగా ‘సమాజ్‌వాదీ పార్టీ’లో చీలిక ఏర్పడగలదని భావించి ఉండదు. ‘సమాజ్‌వాదీ’ చీలిపోయినట్టయితే అఖిలేశ్ యాదవ్ వర్గంతో పొత్తు పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లో కనీసపు ఉనికిని నిలబెట్టుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం! ఈ వ్యూహం ఫలించే అవకాశాలు మృగ్యమైపోయినట్టు భావించిన లేదా భ్రమించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాధను భరించలేక నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. ‘‘అఖిలేశ్ యాదవ్ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయనున్నట్టు’’ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పదే పదే ప్రకటించడం ‘సమాజ్‌వాదీ పార్టీ’ బద్దలుకావాలన్న ‘కాంగ్రెస్’ ఆకాంక్షకు బహిరంగ సాక్ష్యం. షీలాదీక్షిత్‌ను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడం అభూత పూర్వమైన అపహాస్యం. ఆమె ప్రకటించిన ‘‘ముఖ్యమంత్రి పదవీ పరిత్యాగ సంసిద్ధత’’ కాంగ్రెస్ విషాదంలో ప్రస్ఫుటించిన వినోదం.. అయినప్పటికీ చీలదనుకున్న ‘సపా’ చీలిపోయింది! అఖిలేశ్ వర్గంతో పొత్తు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ ‘ఆశ’ చిగురించింది!
బయట విభేదాలను, వైరుధ్యాలను అభినయించినప్పటికీ ములాయం సింగ్ యాదవ్ ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ‘లోపల’ కలసికట్టుగానే ఉన్నారన్న భావం గత ఆరునెలలుగా వ్యాపించి ఉంది! 2012లో శాసనసభ ఎన్నికల తరువాత ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి కట్టబెట్టడం ఈ వౌలిక ఏకత్వానికి ప్రతీక! గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ 2012లో మరోసారి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు! కానీ, ఆయన కుమారుడికి పట్టం కట్టడం, కుటుంబ వారసత్వం ప్రశాంతంగా బదిలీ కావడానికి చిహ్నం! ములాయం సింగ్ హృదయ పూర్వకంగానే ఈ బదిలీని నిర్వహించాడు. జమ్మూ కశ్మీర్‌లోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడ ఇలా తనయునికి తన జీవిత కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని బదిలీ చేయడం బహుశా ములాయం సింగ్‌కు స్ఫూర్తిని కలిగించి ఉండవచ్చు! ఇలా బదిలీ చేయడం ద్వారా తాను ఉత్తరప్రదేశ్ ‘ప్రాంతీయ’ పరిధి నుంచి పైకి పొడుచుకొనిపోయి జాతీయ నాయకుని ‘హోదా’ను శాశ్వతంగా పొందినట్టు ములాయం సింగ్ నకిలీ అనుభూతికి గురి అయ్యాడు.. ఎప్పటికో అప్పటికి భారతీయ జనతాపార్టీకి, కాంగ్రెస్ కూటమికి భిన్నమైన మూడవ కూటమి నాయకునిగా ప్రధానమంత్రి కావాలన్నది ములాయం సింగ్ 2012లో కన్న పగటి కల. 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఈ కల కరగిపోయింది. నితీశ్‌కుమార్, జయలలిత వంటి వారు మూడవ, నాలుగవ కూటములకు నాయకులుగా ‘అకాండ తాండవం’ చేయడానికి సిద్ధమైపోయారు! ‘ఐదవ’ కూటమిని ఏర్పాటుచేసినా ములాయం సింగ్‌ను ‘నాయకత్వం’కాని, అందని ద్రాక్ష వంటి ప్రధాని పదవీ అభ్యర్థిత్వం కాని వరించే అవకాశం లేదని స్పష్టమైంది. 2014నాటి లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో ‘సపా’ తుడిచిపెట్టుకొని పోయిన తరువాత ములాయం సింగ్ ‘జాతీయ నాయకత్వం’ నుండి ప్రాంతీయ వేదికపైకి పడిపోయాడు, కూలబడిన ములాయం సింగ్‌కు కుమారుడికి ‘‘మార్గదర్శనం’’చేయాలన్న ముచ్చట కలగడం ప్రస్తుత దురవస్థకు అంకురార్పణం..
ఈ ‘ముచ్చట’కు అనుగుణంగానే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన తండ్రి గారిని పార్టీ అధినాయకత్వం నుంచి తొలగించి పార్టీ ‘మార్గదర్శకుని’గా నియమించుకున్నాడు. ‘‘మంచిది.. మార్గదర్శకునిగానే నిన్ను నడిపిస్తాను’’అని ము లాయం సింగ్ ప్రకటించి ఉండినట్టయితే ‘సమాజ్ పా ర్టీ’లో చీలిక ఏర్పడి ఉండేది కాదు! పార్టీ అధ్యక్ష పదవి, మార్గదర్శకుని హోదా రెండూ కావాలని ములాయం సింగ్ భావించడం ఇందుకు ప్రధాన కారణం. మరో ప్రధాన కారణం కుటుంబంలో ఆధిపత్య సమరం! ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్ ఈ ఇద్దరి మధ్య మాత్రమే పోరు జరిగి ఉండినట్టయితే ములాయం సింగ్ ‘మలాము’వలె మెత్తబడిపోయి ఉండేవాడు! రానున్న శాసనసభ ఎన్నికలలో పరాజయం తరువాత కుమారునికి ఉపశమన పరామర్శలు కలిగించడానికి ఉద్యుక్తుడయి ఉండేవాడు.. ఇప్పుడు కూడ ‘ఎన్నికల సంఘం’- ఎలక్షన్ కమిషన్-వారు ‘సైకిల్’ గుర్తును అఖిలేశ్ యాదవ్‌కు కేటాయించిన తరువాత కూడ తండ్రికి, తనయునికి మధ్య వాత్సల్య, గౌరవాదులు తగ్గలేదు. ‘సైకిల్’ గుర్తు తన వర్గానికి లభించిన వెంటనే, తన వర్గం అసలు సిసలు సమాజ్‌వాదీ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నిగ్గుతేలిన వెంటనే- అఖిలేశ్ యాదవ్ పరాజయం పాలయిన వర్గం అధినేత ములాయంను సందర్శించి ఆశీస్సులను పొందాడు. అందువల్ల కుటుంబ రాజకీయ వారసత్వం కొనసాగింపులో కాని, ‘పరిపాలన’ నిర్వహణ స్వరూప స్వభావాలలో కాని ఉభయుల మధ్య ఎలాంటి తేడాలేదన్న వాస్తవం కూడ ప్రజలకు స్ఫురించి ఉంటుంది. గతంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు కాని, ప్రస్తుతం ఐదేళ్లుగా అఖిలేశ్ పాలనలో కాని సమానమైనవి ప్రధానంగా రెండు.. అవినీతి, అరాజకం! తమ వర్గానికి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల, ఎంపీల జాబితాను, పార్టీ ప్రతినిధుల, కార్యవర్గ సభ్యుల జాబితాను అఖిలేశ్ ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ములాయం సమర్పించలేదు. అయిష్టంగానే ‘తండ్రి’ తనయునితో తలపడ్డాడు మరి! వీరిద్దరి మధ్య మాత్రమే అయి ఉంటే ‘కలహం’ మొదట్లోనే ముగిసి ఉండేది. రామ్‌గోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్ వంటి ‘ఉమ్మడి’ కుటుంబ సభ్యులు మంటలను చల్లారనీయలేదు.. ఉభయులకూ ‘కత్తు’లిచ్చి కాళ్లు దువ్విస్తున్నారు..
‘సపా’ చీలిపోకపోయినా శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ పరాజయం పాలై ఉండేది! అఖిలేశ్ ప్రభుత్వానికి ‘అంతటి’ పేరు వచ్చింది! ‘పరివర్తన’ను కోరుతున్న ప్రజలు భాజపాకు విజయం చేకూర్చనున్నారన్నది వెల్లడైన వాస్తవం! ‘చీలిక’ లేకుంటే ‘్భజపా’కు ముగ్గురు ప్రత్యర్థులు- సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ , కాంగ్రెస్. ‘చీలిక’ తరువాత కూడ ‘్భజపా’కు ముగ్గురే ప్రధాన ప్రత్యర్థులు.. అఖిలేశ్- కాంగ్రెస్ కూటమి, ‘బసపా’, ములాయం ‘పీలిక’...