సంపాదకీయం

అంతరిక్షంలో అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ శాస్త్ర విజ్ఞానం అంతరిక్షంలో అనంతంగా విస్తరిస్తుండడం ధ్రువ సమాంతర ఉపగ్రహ ప్రయోగ విజయానికి చారిత్రక నేపథ్యం! అంతరిక్ష విజ్ఞాన ప్రస్థాన పథంలో సహస్రాబ్దులపాటు అగ్రగామిగా ఉండిన మన దేశం గత కొన్ని శతాబ్దాలుగా వెనుకబడిపోయింది! మళ్లీ మన దేశం అంతరిక్ష పరిశోధన పథంలో ‘కథాకథిత’ అగ్రరాజ్యాలతో పోటీపడుతుండడం బుధవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు ఆవిష్కృతమైన అద్భుతం. శ్రీహరికోట ‘్భరత అంతరిక్ష ప్రయోగ కేంద్రం’ సతీశ్ ధవన్ కేంద్రం-షార్-వేదికగా ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. భారతీయ శాస్తవ్రేత్తలు ఆవిష్కరించిన అద్భుతమిది, భారత అంతరిక్ష పరిశోధక సంస్థ-ఇస్రో- ఆవిష్కరించిన అద్భుతమిది, నూట ఇరవై అయిదు కోట్ల భారత జన హృదయాలలో ఆవిష్కృతమైన అద్భుతమిది. ఒకేసారి ఒకే అంతరిక్ష నౌకలో నూట నాలుగు ఉపగ్రహాలు నింగికి దూసుకెళ్లిన క్షణం.. ఆకాశపుటంచులను దాటి అంతరిక్ష ప్రాంగణంలో ప్రవేశించిన క్షణం.. భూ సమాంతర కక్ష్యలో పరుగు తీయడం ఆరంభించిన క్షణం.. భారత చరిత్రలోనే కాదు విశ్వవ్యవస్థ ఇతిహాసంలో సైతం శుభంకర సువర్ణ పరిణామం! ఇన్ని దివ్య స్వరూపాలు-హెవెన్లీ బాడీస్-అకస్మాత్తుగా అంతరిక్షంలో ఆవిర్భవించడం అభూత పూర్వ పరిణామం! మన ధ్రువ స మాంతర ఉపగ్రహ వాహక నౌక-పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్-పిఎస్‌ఎల్‌వి -సి 37-ఇలా అంతరిక్ష అ ద్భుతాన్ని సాధించగలిగింది. భారత కీర్తి పతాకాన్ని, విజయ ధ్వజాన్ని, విజ్ఞాన విప్లవ కేతనాన్ని, జాతీయతా చిహ్నాన్ని సర్వోన్నత స్థాయికి తీసుకుని వెళ్లింది. ఇంతవరకు ఏ దేశం కూడ సాధించలేని విజయం మనకు దక్కడం అంతరిక్ష పయనంలో మనలను అగ్రగాములను చేసిన మహత్తర తేజఃపుంజం! అంతరిక్షం మహా సముద్రం.. అస్మిన్ మహార్ణవేంతరిక్షే-ఈ అంతరిక్షమన్న మహా సముద్రంలో-అసంఖ్యాక సౌర కుటుంబాలు, అసంఖ్యాక బ్రహ్మాండాలు ఉన్నట్టు వేద ఋషులు కోట్ల ఏళ్లకు పూర్వం దర్శించారు, కీర్తించారు. ఉపగ్రహాలు,గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు అనాదిగా అనంతంగా విస్తరించి ఉండడం విశ్వవ్యవస్థ. ఈ వ్యవస్థలో భాగమైన భూగోళం నుంచి సనాతన భారతదేశం నుండి మరో నూట నాలుగు ఉపగ్రహాలు దివ్య స్వరూపాల సరసన చేరడం కలియుగం ఐదువేలనూట పద్దెనిమిదవ సంవత్సరం శుభ దుర్ముఖ మాఘ బహుళ పంచమినాడు సంభవించిన మహా పరిణామం! అనంత విశ్వంలోని మన భూమి అనంత విశ్వంలోని ఇతర దివ్య స్వరూపాలతో నిరంతరం అనుసంధానమై ఉంది. ఈ అనుసంధాన వ్యవస్థలో మరో నూట నాలుగు ఉపగ్రహాలను చేర్చడం మన శాస్తవ్రేత్తలు సాధించిన విజయం, భారత జాతీయ విజయం.
శతాబ్దుల విదేశీయ దురాక్రమణ మన అంతరిక్ష పరిజ్ఞాన, పరిశోధన పాటవాలకు గ్రహణం. ఈ గ్రహణం వదలిన తరువాత కూడ రెండు దశాబ్దులపాటు మన అంతరిక్ష పరిశోధన పునఃప్రారంభం కాలేదు. క్రీస్తుశకం 1960వ దశకం చివరిలో, 1970వ దశకం ఆరంభంలో మన ఇస్రో పరిశోధక ప్రస్థానం మొదలు పెట్టేసరికి రష్యావారి, అమెరికా వారి అంతరిక్ష యాత్రికులు-కాస్మోనట్స్, ఆస్ట్రానట్స్-అంతరిక్షంలో అనేకసార్లు విహరించారు. చంద్రుడి మీదికి, గ్రహాల మీదికి దిగగలిగిన అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. రష్యావారి యూరి గగారిన్ అంతరిక్షంలో విహరించి రాగా అమెరికా వారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద పచార్లు చేయగలిగాడు. మనం పరిశోధనలో ప్రాథమిక దశలోకి అడుగుపెట్టిన సమయంలో అగ్రరాజ్యాలవారు అంతటి అగ్రగాములు. 1970వ దశకంలో మనం ప్రయోగించిన ఆర్యభట్ట ఉపగ్రహం మన విజయ యాత్రలో తొలి మజిలీ! అయితే ఆర్యభట్ట భారత భూభాగం నుంచి అంతరిక్షంలోకి ఎగరలేదు. మన ఉపగ్రహాన్ని రష్యావారి అంతరిక్ష నౌకలో కూర్చోబెట్టి అంతరిక్షంలోకి పంపించాము. 1975 నాటి ఆర్యభట్ట ప్రస్థానానికి బుధవారం నాటి పిఎస్‌ఎల్‌వి ప్రస్థానానికి మధ్య ప్రస్పుటిస్తున్న అంతరం మన విజయానికి కొనసాగుతున్న ప్రమాణం. మన నౌకలలో మన ఉపగ్రహాలను ప్రయోగించే దశను దాటి ఇతర దేశాల ఉపగ్రహాలను మన నౌకలలో ఎక్కించి అంతరిక్షంలోని భూ సమాంతర కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు. బుధవారం నాటి విజయం పరాకాష్ఠ! ఒకే అంతరిక్ష నౌకలో నూట నాలుగు ఉపగ్రహాలు పైపైకి పయనించాయి. వీటిలో మూడు మాత్రమే మనవి! ఇలా నూట ఒక్క విదేశీయ ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్ష యానం చేయించగలిగిన ఘనత కూడ మనది. అమెరికా వారి తొంబయి ఆరు ఉపగ్రహాలు మనదేశం నుండి మన అంతరిక్ష నౌకలో పైకెగరి భూ సమాంతర కక్ష్యలో స్థిరపడడమే అంతర్జాతీయ సమాజానికి అబ్బురం కొలిపిన సంఘటన. భరతమాత వామనాకృతిని వదిలి త్రివిక్రమ తేజంతో విశ్వమంతటా విస్తరిస్తోంది!
మన ఉజ్వల అంతరిక్ష విజ్ఞాన పరంపర ‘సూర్య సి ద్ధాంతం’ అన్న ఖగోళశాస్త్రం ఈ దేశంలో ప్రభవించిన నాటిది! కాలగణనకు అతి ప్రాచీనమైన అతిప్రామాణికమైన కొలమానం సూర్య సిద్ధాంతం! సంవత్సరం ని డివి క్రమంగా తగ్గుతోందని గుర్తించినది మొదట భారతీయులే. ఇందుకు ప్రాతిపదిక సూర్య సిద్ధాంతం. కోట్ల సంవత్సరాలకు పూర్వం మూడు వందల అరవై ఐదు రోజుల ఆరుగంటల పనె్నండు నిముషాలు ఉండిన సౌర సంవత్సరం నిడివి ప్రస్తుతం మూడు వందల అరవై అయిదు రోజుల ఐదు గంటల నలబయి ఎనిమిది నిముషాలకు తగ్గింది! ఎన్ని వేల ఏళ్లలో ఒక నిముషం మేర సంవత్సరం నిడివి తగ్గుతున్నదీ తేల్చినవారు భారతీయులు. గ్రహాల గురించి పాశ్చాత్య దేశాలలో విజ్ఖానం అంకురించిన నాటి కంటె పూర్వం లక్షల ఏళ్లుగా భారతీయులు గ్రహాలను మాత్రమేకాక నక్షత్ర సమూహాలను గుర్తించారు. నక్షత్ర సమూహాల గమనాన్ని గ్రహాల గమనంగా అనుసంధానం చేసి అత్యంత ప్రామాణికమైన ఖగోళ విజ్ఞాన గ్రంథాలను రచించారు. అనాదిగా ఉన్న మన పంచాంగం ఈ ఖగోళ విజ్ఞానానికి కొనసాగుతున్న సాక్ష్యం! కలియుగం మూడు వందల అరవై ఏట-క్రీస్తునకు పూర్వం రెండు వేల ఏడు వందల నలబయి రెండవ ఏట-జన్మించిన భారతీయుడు ఆర్యభటుడు అంతరిక్ష పరిశోధనలో మార్గ దర్శకుడు. ఆర్యభటుని విజ్ఞానం ప్రాతిపదికగానే ఆ తరువాత పాశ్చాత్య దేశాలలో కూడ ఖగోళ విజ్ఞాన ధ్యాస మొదలైంది! కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్ది నాటి-క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి-వరాహ మిహిరుడు, మహాకవి కాళిదాసు, కలియుగం ముప్పయి ఐదవ శతాబ్ది-క్రీస్తు శకం నాలుగవ శతాబ్ది నాటి భట్టోత్పలుడు మొదలైనవారు ఆర్యభటుని విజ్ఞాన పరంపరను కొనసాగించిన ఖగోళ వేత్తలు!
ముందు పుట్టిన చెవుల కంటె వెనుక వచ్చిన కొమ్ములు వాడి-అని అన్నట్టు గత కొన్ని శతాబ్దులలో విజృంభించిన పాశ్చాత్యులు ఆ తరువాత తామే ఖగోళ విజ్ఞానానికి ఆద్యులమని విర్రవీగుతున్నారు! ఇందుకు కారణం మన దేశాన్ని శతాబ్దులపాటు వారు దురాక్రమించడం! భారత్ మళ్లీ ఖగోళ విజ్ఞానంలో తమకంటె అగ్రగామి కాగలదన్నది బుధవారం పాశ్చాత్యులు గుర్తించిన సత్యం. మన చంద్రయానం, మంగళయానం మరింత ముందుకు వెళ్లినప్పుడు ఈ వాస్తవం మరింతగా ప్రస్ఫుటిస్తుంది.