ఉత్తరాయణం

చట్టసభల్లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు కేటాయించాలి, ఏ జిల్లాకి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లుండాలి, ఇటువంటివి నిర్ణయించేది వారే. విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలి? ఏ జిల్లాలో ఎన్ని పాఠశాలలుండాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, ఫలితాలు ఎవరు ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత కటాఫ్ మార్కులు ఉండాలి, ఉపాధ్యాయులకు ఎంత జీతాలు ఇవ్వాలి, ఇటువంటివన్నీ నిర్ణయించేది వారే. ఇక్కడ ‘వారు’ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. అందరూ కూడ విద్యార్థుల భవిష్యత్ గురించి అనేక నిర్ణయాలు తీసుకుంటారు. హాజరు, సమదుస్తులు (యూనిఫామ్), స్టడీ అవర్స్ ఇలాంటి వాటి గురించి ఎన్నో నియామాలు పొందుపరచారు.
విద్యార్థుల కోసం ఇటువంటి చట్టాలు, నియమాలు నిర్ణయిస్తూ వారి భవిష్యత్తుని తీర్చి దిద్దుతున్నాం అనుకుంటున్న పెద్దలున్న చట్టసభల్లో మాత్రం ప్రజా ప్రతినిధుల హాజరు శాతం అంతంత మాత్రంగా ఉంటోంది. కొంతమంది సభ్యుల ప్రవర్తన మరీ ఆక్షేపణీయంగా ఉంటోంది. సభలో నిద్రపోయేవారు కొంతమంది. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాల వల్ల ప్రజలంతా గమనిస్తున్నారు. దానివల్ల ప్రజలకు వారిమీద గౌరవం ఉండదు. కాబట్టి చట్టాలు చేసే సభలలోని సభ్యులైన ప్రజా ప్రతినిధులందరికీ కూడా నియమాలుండాలి. దేశ భవిష్యత్తుని నిర్ణయించే విషయాల గురించి చర్చించే సమయంలో అందరు సభ్యులు సభలో ఉండాలి. ఉన్నా వారి ప్రవర్తన సజావుగా ఉండాలి. సభలో నిద్రపోకూడదు. కనీస హాజరు 90 శాతంగా నిర్ణయించాలి. సభలో వెల్‌లోకి వచ్చి అతిగా ప్రవర్తించిన వారికి ఇంత శిక్ష అని నిర్ణయించాలి. అప్పుడు మాత్రమే వారికి విద్యార్థుల, దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే చట్టాలను చేసే అధికారం ఉంటుంది.
- దుర్భా శంకర నారాయణ, విజయవాడ

నేటి రిజర్వేషన్ విధానం మారాలి
ఇప్పటి రిజర్వేషన్ పద్ధతి చూస్తుంటే, సామాజిక స్థిరత్వంపై పెను ప్రభావం చూపుతాయన్న ఆందోళన కలుగుతోంది. రిజర్వేషన్ సదుపాయం పొందుతున్న కులాల్లో చాలా మంది ప్రస్తుతం సామాజికంగా గౌరవింపబడుతున్నారు. ఇటువంటి వారికి ఇంకా రిజర్వేషన్లు కొనసాగించాలనుకోవడం, సామాజిక సంక్షేమం దృష్ట్యా సముచితం కాదు. బ్రాహ్మణ, వైశ్య వంటి అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది బీదవారున్నారు. ఏవిధమైన రిజర్వేషన్లులేక, ఇతర సదుపాయాలు లేక మరింత వెనుకబడిపోతున్నారు. ప్రభుత్వం కులాన్ని బట్టి కాక ఆర్థిక స్థాయిని బట్టి రిజర్వేషన్ సదుపాయాలు కల్పించాలి. అగ్రవర్ణ నిరుపేద విద్యార్థులు అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
- కావేటి సువర్ణ, క్రిష్టిపాడు, అనంతపురం
పెరిగిన బ్రాండ్ విలువ
స్థూల జాతీయోత్పత్తి, ప్రభుత్వ విధానాలు, అనుమతుల సరళీకరణ, ఇతర దేశాల దృక్పథం వంటి కీలక అంశాల మదింపు ఆధారంగా వంద దేశాలలో గత ఏడాదిలో అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో మన దేశం పదవ స్థానంలో నిలిచిందన్న బ్రాండ్ ఫైనాన్స్ అంతర్జాతీయ సంస్థ వార్షిక నివేదిక క్షేత్రస్థాయిలో మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయని రుజువు చేస్తోంది. బ్రాండ్ విలువ మెరుగుపడడంవల్ల వెలుపలి నుండి పెట్టుబడులు ఊపందుకోవడం, ఎగుమతుల వృద్ధి, పర్యాటక రంగం వృద్ధి, స్టాక్ మార్కెట్‌లో గణనీయమైన హెచ్చు వంటి సానుకూల పరిస్థితులు తలెత్తి భారత్‌తోను నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి. సంస్కరణల పర్వం రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైనా, అవినీతి, అలసత్వం, విధానాల సరళీకరణలో జాప్యం, కీలక ఆర్థిక సంస్కరణలకు గ్రహణం పట్టడంవలన భారత్‌కు మెరుగైన బ్రాండ్ ఇమేజి లభించలేదు. లక్షల, కోట్ల రూపాయల ప్రాజెక్టులు సంవత్సరాలుగా పెండింగ్‌లో వుండి పోయాయి. అవినీతి విశృంఖలంగా రాజ్యమేలింది. అధికారం పగ్గాలు చేపట్టాక మోదీ కీలక సంస్కరణలను చేపట్టడంతోపాటు ప్రతీ ఫైలుపై 15 రోజుల లోపు నిర్ణయం తీసుకోవడం వంటి విధానపరమైన లక్ష్యాలను కూడా నిర్దేశించారు. ఏకగవాక్ష విధానం పరుగులు అందుకుంది.