సబ్ ఫీచర్

గుర్తింపునకు నోచని చాత్తాద వైష్ణవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులే- చాత్తాద శ్రీవైష్ణవులు. వీరు 11వ శతాబ్దానికి ముందే వున్నట్లు లిఖిత శాస్త్రాలలో పరిచయం. చాత్తాద శ్రీవైష్ణవులు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలో సర్వత్రా వ్యాపించి వున్నారు. ద్రవిడ దేశంనుండి ఆరువందల సంవత్సరాల క్రితం, ఆంధ్ర, తెలంగాణాలోని పలు ప్రాంతాలలో వైష్ణవ ధర్మం పాటిస్తూ పల్లెవాసుల్లో ధార్మిక చింతన కలిగించడానికి వచ్చి స్థిరపడినట్లు తెలుస్తోంది. పల్లెలలో వీరు అనాదిగా దేవాలయాలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరు దాదాపు 15 లక్షలకు పైగా వున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. ద్రవిడ దేశంలో ‘చాత్తాద వైష్ణవులు’ ఆస్తులు, సంపదలుండి ధర్మకర్తలుగా, ఆలయాల్లో సేవకులుగా, పురోహితులుగా వివిధ పనులుచేస్తూ -‘అయ్యన్’, ‘అయ్యంగార్’లుగా ప్రజలచే పిలువబడినారని, తెలుగు రాష్ట్రాలలో నైజాం కాలానికి పూర్వమే వీరు ‘అయ్య’, ‘అయ్యగారు’, పంతులుగా ఆదరించబడినారని తెలుస్తుంది. నాడు చాత్తాద శ్రీవైష్ణవులు - ‘వీధి బడిపంతులుగా పల్లెపిల్లలకు పాఠాలు చెబుతూ, గుడిలో పూజారులుగా, ఊరి పురోహితులుగా ఆయుర్వేద వైద్యులు(డాక్టర్స్)గా వుండి ఊరి మిరాశీ, ఇనాం భూములు కలిగి వుండేవారు. వైష్ణవత్వం స్వీకరించిన బ్రాహ్మణులలోని కొందరు శిఖ, ముడిని కూడ త్యజించి- గురుపరంపరను అనుసంధానం చేసుకొని ‘అష్టాక్షరీ’నే ఎంతో ప్రేమతో జపించేవారని తెలుస్తుంది.
చాత్తాదులలో జీయర్‌లు, సాతానీలు, పరవస్తు దాసరులు, తిరుతోపులనేవారు వుండేవారని తెలుస్తోంది. వీరిలో పాండిత్యము, కవిత్వము, శాస్తజ్ఞ్రానం కలిగి మెప్పుపొందిన వారు అనేకులు. నేటికి గుట్టలపై వున్న నరసింహ, వెంకటేశ్వర, రామాలయాలలో పరంపరానుగతంగా అర్చకత్వంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా నిర్వహించే పరీక్షలలో ‘చాత్తాద శ్రీవైష్ణవ ఆగమము’ ప్రత్యేకించబడుట విశేషము. ఒక ప్రత్యేకత సంతరించుకొన్న వర్గంగా ఏర్పడి నేటికిని నిలచియున్న చాత్తాద శ్రీవైష్ణవులకు ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఇప్పటికి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం కలిగించడం లేదు. ద్రవిడ దేశంనుండి వచ్చిన వీరిలో చాలామందికి పల్లెలు పాడవడం వల్ల పట్నాలకు వలస వచ్చి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సొంత గూడు లేకున్నా, అర్థాకలితో బాధపడుతున్నా, దొరికిందే పదివేలని కొని బ్రతుకీడుస్తున్నారు. రాజకీయ పార్టీల వారు వీరిని తమ ఎదుగుదలకు వాడుకుంటున్నారే తప్ప శాసనసభలో కాని శాసన మండలిలో కాని తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం.
చాత్తాద శ్రీవైష్ణవులలో సంఖ్యాబలమధికముగా ఉన్నప్పటికీ ఆర్థిక అసమానతలవలన వెనుకబాటుతనము ఎక్కువగా వుంది. 19వ శతాబ్దములోనే వీరు కొందరి ప్రమేయంతో ‘నైజాం జమానా’లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వచ్చారు. అట్టి వీరిని ప్రోత్సహించదలచిన నాటి కొందరు పెద్దలు ప్రభుత్వ గెజిట్‌లో - ‘చాత్తాదశ్రీవైష్ణవ (సాతాని)’ బి.సి- ‘డి’ గ్రూపు- 28 నెం.లో చేర్చారు కాని దానివలన పెద్దగా ఎవరూ ఉద్యోగ లబ్ధిని పొందినది లేదు. పలుమార్లు బి.సి ‘ఏ’లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాని దీనిపై ‘చాత్తాద శ్రీవైష్ణువులలోనే’ ఏకాభిప్రాయం లేదని తెలుస్తున్నది. వీరిలో పట్టణ ప్రాంతాలలో యాజ్ఞీకి, ఆచార్యత్వం సిద్ధించుకొన్నవారు వలదని, కొందరేమో కావాలని పరస్పర భిన్నంగా మాట్లాడుతున్నారు. ఏదిఏమైనా వీరి అభివృద్ధికోసం- వైదిక బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వలే- ‘‘చాత్తాద శ్రీవైష్ణవ ఫెడరేషన్’కూడ నెలకొల్పి వారి వివాహ, ద్రావిడ విద్య, చాత్తాద శ్రీవైష్ణవ ఆగమశాస్త్ర అవగాహన, ఆర్థిక స్థిరతకోసం పల్లెలలో, పొలాలు, పట్నంలో ఇళ్ళస్థలాలు మొదలగు వాటిని సమకూర్చి వారి అభ్యున్నతికి తోడ్పడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. ‘సమాజంలో స్వాములుగా దర్శనమిస్తూ, ‘అయ్య’లుగా పిలువబడుతున్న చాత్తాద శ్రీవైష్ణవులను ఆదరించడం వల్ల పల్లెప్రగతి, జనచైతన్యం, మనోవికాసం తథ్యమన్నది మరువరాని సత్యం.

- కూర్మాచలం వేంకటేశ్వర్లు