సంపాదకీయం

‘సేంద్రియ’ సంక్షేమం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంద పెట్టడం- అన్న మాటలు మరుగున పడిపోతుండడానికి కారణం సేంద్రియ వ్యవసా యం మరుగున పడిపోతుండడం. గ్రామీణ ప్రాంతాలలో ‘మంద’లు కనుమరుగై పోయాయి. ‘మంద’లే లేనప్పుడు మాటలు ఎలా గుర్తుంటాయి? తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ‘మందల’కు జీవం పోస్తుండడం మంచి పరిణామం. లక్షలాది గొర్రెలను పల్లెపట్టుల పచ్చిక బీడులలో ‘కాపరులు’ మేపగల కమనీయ దృశ్యాలు పునరావిష్కృతం కాబోతున్నాయి. పశుపాలన మనదేశంలో అనాదిగా ప్రశస్తమైన వృత్తి, పవిత్రమైన వృత్తి. కొర్రన్నం గొర్రెల పెరుగుతో భుజించడం శరీర పరిపుష్టికి, మానసిక తుష్టికి మేలైన మార్గం. పశువులు, మనుషులు, వృక్షాలు, లతలు ఒక్క వైవిధ్యం కాదు, అసంఖ్యాక వైవిధ్యాలు కలసి ప్రకృతి పరిఢవిల్లుతోంది, సృష్టి శోభిల్లుతోంది. ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం సృష్టిగత సహజ సమన్వయం. అందువల్లనే అన్ని వైవిధ్యాలను పరిరక్షించాలనడం భారతీయ జీవన విధానమైంది. ఈ వైవిధ్యాలు పరస్పర పోషకాలు, పరస్పరాశ్రయాలు కూ డ. చెట్లు, అడవులు, పొలాలు, పశువులు, మందలు, మానవులు ఒకేచోట నిరంతరం నెలకొని ఉండడం ఆరోగ్యకర జీవనం. ఆధునికులు భూమిని అభివృద్ధి చేయడం పేరుతో చెట్లను నరికేశారు, పశువులను చంపేశారు, కేవలం మానవులు మిగిలిన చోట సిమెంటు కట్టడాలు, కాలుష్యపు వాటికలు విస్తరించిపోవడం ‘అభివృద్ధి’- డెవలప్‌మెంట్-గా చెలామణి కావడం ఆధునిక నాగరికత పేరుతో మన నెత్తికెక్కింది. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ పేరుతో జరుగుతున్న తైతక్కలాట వల్ల ఈ ‘కృత్రిమ అభివృద్ధి’ మరింతగా విస్తరిస్తోంది. చెట్లు, పొలాలు, పశువులు, పాలు, నీళ్లు సమృద్ధిగా ఉన్న ప్రాం తాన్ని చూడగానే ము క్కులను చిట్లించి ‘డెవలప్’ కాలేదు- అని ‘రసాయన’ జీవులు అభినయించడం నిరంతరం దృశ్యమానం అవుతోంది! పేడ, పచ్చిక కనిపించరాదు, ‘సిమెంటు గోడ’, నోరుపట్టని ‘పిజ్జా’ మాత్రమే కనిపించాలని ‘ప్రపంచీకరణ’ వేత్తల ప్రగతి సూత్రం! ఇలాంటి ‘డెవలప్’ అయిన చోట గొర్రెలు, ఆవులు మేస్తూ కనిపించవు.. గొర్రె మాంసం, ఆవు మాంసం మాత్రమే అమ్ముడుపోతూ కనిపిస్తాయి. పాలు, నీరు దొరకవు.. మద్యం, శీతల పానీయం మాత్రమే లభిస్తాయి.
ఈ కృత్రిమ అభివృద్ధికి కృతక ప్రగతికి విరుగుడుగా సహజ ప్రగతి పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించడం అభినందనీయం. నాలుగు లక్షల కుటుంబాలకు చెందిన ‘కుర్మ’- యాదవ- కులవృత్తుల వారికి ఎనబయి నాలుగు లక్షల గొర్రెలను పంపిణీ చేయాలన్న బృహత్ పథకం యావత్ భారత్‌లోను బహుశా అభూత పూర్వమైనది. ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం ఇన్ని లక్షల గొర్రెలను కొనుగోలు చేయడం గ్రామవికాసం పట్ల, ప్రాకృతిక సేంద్రియ వ్యవసాయ పునరుద్ధరణ పట్ల నిష్ఠకు నిదర్శనం. మేపుకునే యాదవులకు ఈ గొర్రెలను డెబ్బయి ఐదు శాతం రాయితీపై సమకూర్చడం కూడ వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభ్యుదయం పట్ల మమకారానికి నిదర్శనం. ఇన్ని లక్షల గొర్రెలను ఒకేసారి ఎలా సృష్టించగలరన్న అనుమానం కలగడం సహజం. భూమిని కాని, ఆర్థిక సహాయాన్ని కాని పంపిణీ చేయవచ్చు. కాని కొన్ని లక్షల గొర్రెలు పుట్టి పెరగాలి. అందుకు సమయం పడుతుంది. ఈ సందేహానికి సమాధానం- దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వం గొర్రెలను కొనుగోలు చేయడం. ఈ ఎనబయి నాలుగు లక్షల గొర్రెలు రెండేళ్లలో రెట్టింపు అవుతాయట. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ‘మందపెట్టే’ పద్ధతి మళ్లీ విస్తరించ గలదు. ఒక ఎకరం లేదా రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో యాబయి లేదా వంద గొర్రెలను రాత్రంతా ఉంచడాన్ని ‘మంద పెట్టడం’ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా మంద పెట్టడాన్ని వేఱు వేఱు పేర్లతో పిలుస్తున్నారు. కానీ మంద పెట్టడం వల్ల వ్యవసాయ భూమి సారవంతం అవుతుంది. రాత్రంతా గొర్రెలు ఆ భూమిపై విసర్జించే ‘పేడ’ సహజమైన ఎరువు..
ఇలా గొర్రెల పెంపకం కేవలం పెంచుకునే వారికి మాత్రమే ప్రయోజనకరం కాదు.. వ్యవసాయం ‘సేంద్రియం’ కావడం విస్తృత ప్రయోజనం. రసాయన ఎరువులను, క్రిమి సంహార విషాలను వర్ధమాన దేశాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంపన్న దేశాల వారు తమ దేశాలలో మాత్రం ఈ ‘రసాయనపు విషాలు’ అవసరం లేని ‘సేంద్రియ’ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రాకృతికమైన ఆకులు, పేడ ఉపయోగించడం ద్వారా భూమిని పండించడం మన దేశంలో అనాది వ్యవసాయం. గత కొన్ని దశాబ్దులుగా ఈ పద్ధతి అణగారి పోయింది, అంతరించి పోయింది. ఆవులను, అడవులను, పశువులను, పచ్చదనాన్ని నిర్మూలించడం ఇందుకు కారణం. రసాయనపు ఎరువుల వల్ల, క్రిమి సంహారక విషాల వల్ల వ్యవసాయ భూమి నిస్సారమై పోతుంది. ఎరువులు, క్రిమిసంహారక వి షాల దుష్ప్రభావం వల్ల ఈ వ్యవసాయ ఉత్పత్తులను భోంచేస్తున్న జనం వివిధ రకాల రుగ్మతలకు గు రవుతున్నారు. రసాయనాల కాలుష్యం వల్ల పరిసరాలు ప్ర కృతి కూడ దెబ్బతిని పోతున్నాయి. కొత్తగా వచ్చి పడిన ‘మహా సంకర’ జాతి ‘బిటి’ పంటల వల్ల భూమి మరింతగా దెబ్బతింటోంది. ఈ వైపరీత్యాల నుంచి విముక్తి కలగాలంటే సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడం అనివార్యం. ఆవుపేడ, పశువుల పేడ, పచ్చి ఆకులు సేంద్రియ వ్యవసాయానికి అనివార్యం. ‘ఎర’- వానపాము-లు భూమిని నిరంతరం దున్ని పరిపుష్టం చేయగల వ్యవసాయ మిత్రులు. ఈ వానపాములకు పేడ వాసన, ఆకుల వాసన అత్యంత ఇష్టం. కానీ విష రసాయనపు ఎరువుల వాసన తట్టుకోలేక ‘ఎర’లు దూరంగా భూగర్భంలోకి ముప్పయి అడుగుల లోతునకు పారిపోతున్నాయట! ఫలితంగా వానపాములు లేని భూమి పైపొరలు నిస్సారమైపోయి క్రమంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి.
రసాయనపు ఎరువులకు, క్రిమి సంహారాలకు స్వస్తి చెప్పి, సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కృషి జరుగుతోంది. కేరళలో కొన్ని తాలూకాలు సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలుగా మారాయి. సిక్కిం రాష్ట్రం మొత్తం ‘సేంద్రియ’మైంది. ‘హరిత హారం’ ద్వారా, గొర్రెల పెంపకం ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ జరుగగలదు. గొర్రెలతో పాటు యాదవులకు దేశవాళీ ఆవులను కూడా పంపిణీ చేసినట్టయితే సేంద్రియ లక్ష్యం మరింత పరిపుష్టం కాగలదు. దేశవాళీ ఆవులు గోసంతతి వల్ల పాడిపంటలు మరింత వృద్ధి చెందగలవు. యదుకుల కృష్ణుడు గోపాలకుడు.. పరమశివుడు పశుపతి!!