సబ్ ఫీచర్

కఠిన శిక్షలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేధింపులు... మానసిక, శారీరక హింస, ప్రేమ పేరుతో మోసాలు అత్యాచారాలు... ఇవి తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువతులు, విద్యార్థినులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇంటా బయటా కొందరు నేరాగళ్ళ పాశవికతకు ‘బలి’అవుతున్నారు. వేధింపులు జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు సరైన విధంగా స్పందించటం లేదు. ఎస్‌ఐ స్థాయి అధికారి నుంచి డిఎస్‌పి స్థాయి అధికారి వరకు అత్యాచారం జరిగిన కేసుల నమో దు విషయ పరిశీలనకు మగ పోలీసులను వినియోగించటం వల్ల అత్యాచార బాధితులు కుమిలిపోతున్నారు. వేధింపులు, అత్యాచారాలు జరిగాకే పోలీసుశాఖ స్పందిస్తోంది. పోలీసుల వక్రీకరణ బుద్ధివల్ల బాధిత మహిళలపై ప్రశ్నల పరంపర జరుగుతుంది.
తెలంగాణాలోని 10 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రతి రోజు గ్యాంగ్‌రేప్, నాలుగైదు ఏళ్ళ చిన్నారులపై పైశాచిక లైంగిక దాడులు, అత్యాచార య త్నాలు జరుగుతూనే ఉన్నాయి. 2012 సంవత్సరంలో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఈ అకృత్యాలు తగ్గటం లేదు సరికదా అడ్డగోలుగా పెరుగుతున్నాయి. మహిళల రక్షణకు గట్టి నిఘా లేదు. ‘ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినపుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు’ అని గాంధీ మహాత్ముడు సెలవిచ్చాడు. అర్ధరాత్రి కాదు గదా... పట్టపగలే ఆడవాళ్ళు జంటగానో, ఒంటరిగానో వెళ్ళిన సవ్యంగా ఇంటికి వస్తారనే గ్యారంటీ లేదు. భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నా అవి ఈవ్ టీజర్లు, రేపిస్టులకు మేలు చేస్తున్నాయి. మహిళలు రాత్రివేళల్లో, కొంతమేరకు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్న ఫలితం ఉండటం లేదు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 3వేల మంది మహిళలు మృగాళ్ళ చేతిలో హింసకు గురిఅయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లోను, దేశవ్యాప్తంగాను మహిళలు, యువతులు, విద్యార్థినులు చిన్నారి బాలికల వరకు కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. కొందరు యువతులు, బాలికలు ప్రేమ పేరుతో జీవితంపై అవగాహనా లేమితో తప్పటడుగులు వేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసాలకు గురిఅవుతున్నారు. జీవితంలో స్థిరపడకుండా యువకులు చెప్పే మాయమాటలు నమ్మి ఇల్లు విడిచి వెళ్తున్నారు. అక్కడ మోసం, దగా, కుట్ర, శారీరక, మానసిక హింస, మోసాలు, వేధింపులకు బలై మరల ఇంటిదారి పడుతున్నారు. యువకులు చెప్పే అసత్యపు మాటలు నమ్మి పెళ్ళికాకముందే ప్రియుడి చేతికి వశం అవుతున్నారు. పెళ్ళికాకముందే, చిన్న వయస్సుల్లోనే ‘ప్రేమ’లో పడి గత్యంతరం లేక ప్రియుడి ఇళ్ళముందు ధర్నా చేయటం, బైఠాయించటం, పోలీస్‌స్టేషన్లను, మహి ళా సంఘాలను ఆశ్రయిస్తున్నారు.
రాత్రి సమయంలో పార్టీలో చిత్తుగా మద్యం తాగిన యువకులు లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. నేరగాళ్లు పక్కా ప్రణాళికతో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వావి వరుసలు మరుస్తున్నారు. నమ్మిన వారే అత్యాచారాలకు పాల్పడుతున్నా రు. చిన్నారి బాలికల నుంచి 80 ఏళ్ళ వృద్ధులపై ‘మృగా ళ్ళు’ చేతిలో ‘బలి’ అవుతున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ఫోన్ లు చేసి వేధిస్తున్నారు. అశ్లీల మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారు. బినామీ ‘సిమ్’్ఫన్‌లలో ఫోన్‌లు చేసి మహిళలు, విద్యార్థినులను హింసిస్తున్నారు. ఫోన్ నెంబర్లు ఒకరి పేరు మీద ఉంటే మాట్లాడేవారు మరొకరు ఉంటున్నారు. ప్రతి ‘సిమ్’కార్డుపై ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలను కంప్యూటర్‌లో ప్రతినెల ‘అప్‌లోడ్’ చేసే విధంగా పోలీసులు, కేంద్రం చట్ట సవరణ చేయాలి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా అసభ్యమైన, అశ్లీలమైన విషయాలను గృహిణులు, విద్యార్థినులు, బాలికలు, చిన్నారులకు పంపించి, లైంగిక హింసకు పాల్పడుతున్నారు. మరికొందరైతే మహిళలు, యువతులను ఆటబొమ్మల్లా భావించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఆ మధ్య వీణవంక మండల కేంద్రంలో పోలీసు శిక్షణకోసం వెళ్ళిన దళిత యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గ్యాంగ్‌రేప్ చేసి సెల్‌ఫోన్‌లో అత్యాచారాన్ని రికార్డుచేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రవేశపెట్టారు. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన పోలీసులశాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం పట్టింది. పోలీసు ఉద్యోగంకోసం వెళ్ళిన యువతిని ‘బుక్’ కొనిస్తామని చెప్పి ముగ్గురు సహ విద్యార్థులు గుట్టల్లోకి తీసుకొని వెళ్ళినారు. మరో యువతి తప్పించుకొని వచ్చి ఎస్‌ఐకి ఫోన్ చేసి చెబితే ఆయన పట్టించుకోలేదు. పై అధికారులు స్పందించలేదు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘గ్యాంగ్‌రేప్’ సంఘటన జరిగేది కాదు. సామూహిక అత్యాచారం చేసింది ఇద్దరు మైనర్లు కావటం శోచనీయాంశం. ఇంటర్నెట్‌లలో అశ్లీల క్యాసెట్లు చూసి, వారు గ్యాంగ్‌రేప్ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరంచి సామాజిక మాధ్యమాల్లో ‘అప్‌లోడ్’ చేయటం దారుణం. ఒక కానిస్టేబుల్, ఒక ఎస్.ఐని సస్పెండ్ చేసి, తప్పుచేసిన వారిని అరెస్టుచేస్తే బాధితురాలికి న్యాయం జరుగుతుందా?
ప్రయాణ ప్రాంగణాలు, నిర్మానుష్య ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, రైల్వే ప్రాంగణాలు, విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులకు పాల్పడేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ ప్రచారం చేస్తున్నారు. కాని వాస్తవంలో అమలుచేస్తున్నది ఎంత? వేధింపులు, అఘాయిత్యాలకు గురైన యువతులు, మహిళలు నేరుగా ఫిర్యాదు చేస్తే క్షేత్ర స్థాయిలో పోలీసుల స్పందన అంతంత మాత్రంగానే ఉంటున్నదని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయ. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసుల్లో నిందితుల దగ్గరనుంచి లంచాలు తీసుకొని, బాధిత మహిళలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడకుండా నిందతులకు కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులను సర్వీస్ నుంచి తొలగించే విధంగా నిబంధనలు రూపొందించాలి.
వరంగల్ కిట్స్ కాలేజీ దగ్గర ఇంజనీరింగ్ అమ్మాయి మీద ఆసిడ్ దాడి కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిల మీద ఆసిడ్ దాడులు తగ్గిపోయాయి. పాశ్చాత్య సంస్కృతికి, చరవాణిలు, ప్రసార మాధ్యమాల కారణంగా 12నుంచి 18 ఏళ్ళలోబాలలు ఎక్కువగా ఆకర్షణకు గురి అవుతున్నారు. వీరు మంచిని వదిలేస్తున్నారు. శీల నిర్మాణం వదిలి వేస్తున్నారు. న్యాయం, నీతి, ధర్మం మంటగలుపుతున్నారు. తల్లి, చెల్లి, అమ్మ ప్రేమను అశ్లీలం చేస్తున్నవారి మీద చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడేటట్లు చూడాలి.

- రావుల రాజేశం