సంపాదకీయం

‘అరణ్య’ రోదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చదనానికి, ప్రపంచీకరణకు మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ప్రపంచీకరణకు బాసటగా నిలబడడం దీర్ఘకాల ప్రగతికి గొడ్డలిపెట్టు. భూమిని, పర్యావరణను కబళిస్తున్న కేంద్రీకృత కృత్రిమ ప్రగతి కేవలం తాత్కాలిక ప్రగతి భ్రాంతి మాత్రమే! కానీ వ్యవసాయ ప్రగతి కంటే, పచ్చదనం పెంచే అటవీ పరిరక్షణ కంటే వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్న, అటవీ హననం చేస్తున్న పారిశ్రామిక ప్రాబల్యానికి ప్రభుత్వాలు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. హరిత పరిరక్షణ నియమావళిని ఉల్లంఘించి అక్రమంగా పుట్టుకొచ్చిన పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం వారు తక్షణం మూసివేయాలి. ‘హరిత అనుమతుల’ను పొందిన తరువాత మళ్లీ ఆ పారిశ్రామిక సంస్థలు ప్రారంభం కావచ్చు! కానీ ఈ నియమాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నీరుకార్చింది. పరిశ్రమలకు గొప్ప వెసులుబాటు కల్పించింది. పచ్చదనంపై ప్రపంచీకరణ పైచేయి అవుతుండడానికి ఇది సరికొత్త ఉదాహరణ. ‘పర్యావరణ అనుమతి’-ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్-ఇసి-లేకుండానే పరిశ్రమలను నడిపిస్తున్న యజమానులు-ఆరు నెలలలోగా కొత్తగా ‘అనుమతి’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నది కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటు! అంటే ఇది హరిత నియమాలను ఉల్లంఘించిన పరిశ్రమలను క్రమబద్ధీకరించడం వంటిది. నియమ నిబంధనలను పాటించకుండా పర్యావరణను పాడు చేసే లక్ష్యంతో నగరాలలో అంతస్థుల భవనాలను నిర్మిస్తున్నారు. కానీ ఆ తరువాత స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ‘అక్రమాల’ను సక్రమాలు గా మారుస్తున్నారు- కొంత రుసుమును కట్టించుకుని! దీని పేరు క్రమబద్ధీకరణ!! అదే రీ తిలో పర్యావరణను కాలుష్యమ యం చేస్తున్న పరిశ్రమలను కేంద్ర ప్ర భుత్వం క్రమబద్ధీకరిస్తోంది! నియమాలను, హరిత పరిరక్షణ నియమాలను ఉల్లంఘించిన పరిశ్రమలను మూసివేయాలి. కాని ‘రుసుము’ తీసుకుని క్రమబద్ధీకరించినందువల్ల, కాలుష్యపు విషాలను కక్కి పరిసరాలను పాడుచేస్తున్న పరిశ్రమల స్వభావం మారిపోతుందా? ఇలా క్రమబద్ధీకరించడం ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి లభించిన వారసత్వం..
ఇలా హరిత హననం చేయడానికి అవతరించిన పరిశ్రమలను మూసివేయకుండా క్రమబద్ధీకరించడానికి వీలైన వ్యవస్థను 2012 డిసెంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది! 2013 జూన్‌లో మరోసారి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వారు ఉత్తరువులు జారీ చేసారు. ఈ ఉత్తరువు 1994లో ఆర్థిక మంత్రిగా మన్‌మోహన్‌సింగ్ వ్యవస్థీకరించిన వాణిజ్య ప్రపంచీకరణకు అనుగుణమైనది. 2004లో మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రి అయిన తరువాత ‘ప్రత్యేక ఆర్థిక మండలి’-స్పెషల్ ఎకనమిక్ జోన్-సెజ్-పేరుతో వేలాది ఎకరాల అడవులను, పంటపొలాలను నిర్మూలించి ఆ ప్రదేశంలో పారిశ్రామిక కేంద్రీకృత వాటికలను నిర్మించడం ఆరంభమైంది. పచ్చదనం, పరిశ్రమలు పక్క పక్కన నెలకొనే రీతిలో వికేంద్రీకృత ప్రగతి సాధించడం అనాదిగా భారతీయ పద్ధతి. ఈ వికేంద్రీకరణను విదేశీయులు ధ్వంసం చేసారు. స్వతంత్ర భారతంలో కూడ ‘కేంద్రీకృత’ పారిశ్రామిక విధానమే అమలు జరిగింది, జరుగుతోంది. ప్రపంచీకరణ మన నెత్తికెక్కి ‘్ఠవిణీ’ వేసిన తరువాత ఆకుపచ్చని తోటలను ధ్వంసం చేసి సిమెంటు కోటలను కడుతున్నారు. ఒకే చోట వెయ్యి నుంచి పదివేల ఎకరాల పారిశ్రామిక ప్రాంగణాలను-సెజ్‌లు-ఏర్పడడం వల్ల వెలువడే కాలుష్యాన్ని జీర్ణించుకునే సామర్ధ్యం పరిసరాలకు నశించింది, వృక్షాలకు నశించింది, నీటికి నదులకు నశించింది, గాలికి నశించింది, వెరసి ప్రకృతికి నశించింది! సెజ్‌ల కోసం ధ్వంసం అవుతున్న పొలాలు, అడవులతోపాటు సమీపంలోని వందల చదరపు కిలోమీటర్ల పచ్చదనం కూడ పాడవుతోంది! అటవీ విస్తీర్ణం హరించుకుని పోవడానికి ఇలా ‘ప్రపంచీకరణ’ దోహదం చేసింది!
హరిత నియమాలను అతిగా పాటించడం వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతుందన్నది మన్‌మోహన్‌సింగ్ బహిరంగ వేదికలపై ప్రకటించిన వి ధానం. అందువల్లనే ఇలా నిబంధనలను ఉల్లంఘించిన కాలుష్య పరిశ్రమలను మూసివేయకుండా క్రమబద్ధీకరించడం మొదలైంది. మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వానికి వివిధ రంగాలలో సమగ్ర ప్రత్యామ్నాయంగా అవతరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆర్థిక, పారిశ్రామిక రంగంలో మాత్రం మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వ విధానాన్ని కొనసాగిస్తుండడం విచిత్రమైన వైపరీత్యం! ఈ ‘వారసత్వం’ కారణంగానే ఇప్పుడు అక్రమ పరిశ్రమలకు ఆరు నెలలలోగా ‘హరిత అనుమతి’ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది! అడవులకు దిక్కెవ్వరు? హరిత శోభల ‘క్షతి’ని నిరోధించి హరిత శోభల క్షితిని నిలబెట్టగల వారెవ్వరు?? ఆకుపచ్చదనం నిజమైన ప్రగతికి సం కేతం! కానీ దశాబ్దుల తరబడి వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది! దేశం లో ప్రతిరోజు సగటున దాదాపు మూడు వందల ముప్పయి ఐ దు ఎకరాల్లో అడవులు ధ్వంసమైపోతున్నట్టు నాలుగేళ్ల క్రితం నిర్ధారణ జరిగింది! దేశం మొత్తం భూభాగంలో కనీసం ముప్పయి మూడు శాతం అడవులుండాలన్నది ‘అంతర్జాతీయ’ ఆదర్శం. కానీ మన దేశంలో ఇరవై నాలుగు శాతం కంటె తక్కువ భూభాగంలో మాత్రమే అడవులున్నాయి. గత రెండేళ్లుగా అడవుల విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో మరీ తగ్గిపోయిందట! ‘హరిత హారం’, ‘చెట్టు నీరు’ వంటి కార్యక్రమాల వల్ల అడవుల విస్తీర్ణం పెరగకపోవడమే అంతుపట్టని వ్యవహారం..
అడవులతోపాటు జంతువులు నశించిపోతున్నాయి! అడవులలో నీటివాగులు ఎండిపోవడంవల్ల క్రూర జంతువులు సాధు జంతువులు సమానంగా ‘దప్పి’తో అంతరించిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల గుర్రాలు, ఒంటెలు, కంచర గాడిదలు, బర్రెలు వంటి పెంపుడు జంతువులు సైతం అకాల వ్యాధులకు మరణాలకు గురి అవుతున్నాయట! శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు విస్తరించి ఉన్న ‘శార్దూల అభయారణ్యం’ కూడ అంతరించిపోతోంది! కాలుష్య గ్రస్తవౌతున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంలో నిరంతరం అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయట! ఈ అగ్నిప్రమాదాల వల్ల అడవులలోని అనేక చోట్ల పచ్చదనం నశించిపోతోంది. గత పదేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల అటవీ సీమలలో దాదాపు ఇరవై రెండు వేల అగ్నిప్రమాదాలు జరిగాయన్నది కలవరపరుస్తున్న కఠోర వాస్తవం! అరణ్యాలకు రక్షణ ఎప్పుడు?